జూన్ 28, 2021

రాయలసీమ కథల పోటీ ఫలితాలు

Posted in కథల పోటీలు at 11:26 ఉద. by వసుంధర

శ్రీమతి పివి శేషారత్నం సౌజన్యంతో

శ్రీ సింగమనేని నారాయణ స్మారక.. “రాయలసీమ కథల పోటీ- 2021” ఫలితాల ప్రకటన..

ప్రముఖ కథా రచయిత , విమర్శకులు శ్రీ సింగమనేని నారాయణ గారి స్మారకార్థం- రాయలసీమ కథల పోటీల ను “వేమన అధ్యయన & అభివృద్ధి కేంద్రం, రాయలసీమ సాంస్కృతిక వేదిక” లు నిర్వహించాయి.

రాయలసీమ జీవితం ప్రతిబింబించే కథలు ఇతివృత్తంగా జరిగిన ఈ పోటీలకు 75 కథలు వచ్చాయి.

ప్రసిద్ద విమర్శకులు సూర్యసాగర్, హెచ్చార్కె లు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. విజేతలకు మొత్తం పదివేల రూపాయలను బహుమతులుగా అంద చేయనున్నారు.

ప్రథమ బహుమతి:
“ఎర్రగన్నేరు” కథ – డా.త్యాగదుర్గం మౌని, తిరుపతి, ( రూ.4000/-)

ద్వితీయ బహుమతి:
“కరువు సీమ” కథ – వివేక్ రెడ్డి లంకమల, నందిమండలం గ్రామం, బద్వేలు,
( రూ. 3,000/-)

తృతీయ బహుమతి:
“తిరుపతి నాయుడు” కథ – కృపాకర్ పోతుల, హైదరాబాదు.
(రూ..2500/-)

ప్రోత్సాహక బహుమతి:
ఒక అనాధ కథ – జి.జాహ్నవి, పదవ తరగతి విద్యార్థిని, కళ్యాణదుర్గం…
( రూ.500/-)

విజేతలకు శుభాకాంక్షలు.
ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయిన కథకులందరికీ అభినందనలు. ఈ కార్యక్రమంలో మాకు చేదోడు వాదోడు గా నిలిచిన చికాగో సాహితీ మిత్రులు వారికి ధన్యవాదాలు.

సీమ సాంస్కృతిక వికాసం కోసం చేస్తున్న మా ప్రయత్నంలో అందరూ భాగస్వామ్యం కావాలని మనవి.

ఇట్లు….
వేమన అధ్యయన & అభివృద్ధి కేంద్రం,
రాయలసీమ సాంస్కృతిక వేదిక,

రాయలసీమ కథల పోటీ నిర్వాహక బృందం- 2021.

సమన్వయకర్త:
డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి,

యస్. వాసంతి, పి.రాజశేఖరరెడ్డి,
యం.రవికుమార్,
జె. నిర్మల, వై. శైలజ.

వివరాలకు:
99639 17187

Leave a Reply

%d bloggers like this: