జూలై 1, 2021

తెలుగువ‌న్‌-అక్ష‌ర‌యాన్ ఉగాది క‌థ‌లు, క‌విత‌ల పోటీ విజేత‌లు

Posted in కథల పోటీలు, కవితల పోటీలు at 11:04 ఉద. by వసుంధర

తెలుగువ‌న్‌, అక్ష‌ర‌యాన్ సంయుక్తంగా నిర్వ‌హించిన ఉగాది క‌థ‌లు, క‌విత‌ల పోటీ ఫ‌లితాల‌ను నేడు (జూన్ 30) సాయంత్రం జూమ్ ద్వారా నిర్వ‌హించిన స‌భ‌లో ప్ర‌క‌టించారు. ఈ స‌భ‌కు తెలుగువ‌న్ ఎండీ కంఠంనేని ర‌విశంక‌ర్ అధ్య‌క్ష‌త వ‌హించ‌గా, మ‌హారాష్ట్ర మాజీ గ‌వ‌ర్న‌ర్ చెన్న‌మ‌నేని విద్యాసాగ‌ర్‌రావు ముఖ్య అతిథిగా, ప్రముఖ సినీ ర‌చ‌యిత వి. విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. స‌భ‌ను అయినంపూడి శ్రీ‌ల‌క్ష్మి నిర్వ‌హించారు.

క‌థ‌ల పోటీల వివ‌రాలు:

క‌థ‌ల పోటీలో మొద‌టి బ‌హుమ‌తిని డా. వార‌ణాసి నాగ‌ల‌క్ష్మి ర‌చించిన ‘శిశిర‌ములో విరిసిన వసంతం’ క‌థ గెలుచుకుంది. రెండు రెండో బ‌హుమ‌తుల‌ను ఎస్వీ కృష్ణ‌జ‌యంతి క‌థ ‘స‌భ‌కు న‌మ‌స్కారం’, క‌విత బేతి క‌థ ‘త‌రువాతే నేను’ ల‌కు ప్ర‌క‌టించారు. మూడు మూడో బ‌హుమ‌తుల‌ను చివుకుల శ్రీ‌ల‌క్ష్మి క‌థ ‘దృక్ప‌థం’, శ్రీ‌దేవి బంటుప‌ల్లి క‌థ ‘రావోయి అతిథి’, ప‌ప్పు ప‌రిమ‌ళ క‌థ‌ ‘ఆన్‌లైన్ విందు’ గెలుపొందాయి. అలాగే మూడు క‌న్సొలేష‌న్ బ‌హుమ‌తుల‌ను అప్పికొండ‌ భాగ్య‌ల‌క్ష్మి క‌థ ‘సిందూరం’, విజ‌య‌ల‌క్ష్మి క‌థ ‘శంఖారావం’, వ‌న‌జాత క‌థ ‘వెంక‌ట ర‌మ‌ణీయం’ ల‌కు ప్ర‌క‌టించారు.మొద‌టి బ‌హుమ‌తి క‌థ‌కు రూ. 10,116, రెండో బ‌హుమ‌తి పొందిన ఒక్కో క‌థ‌కు రూ. 3,116, మూడో బ‌హుమ‌తి పొందిన ఒక్కో క‌థ‌కు రూ. 1,116 అంద‌జేస్తారు. అలాగే క‌న్సొలేష‌న్ బ‌హుమ‌తి పొందిన ఒక్కో క‌థ‌కు రూ. 526 అంద‌జేయ‌నున్నారు.

క‌విత‌ల పోటీల వివ‌రాలు:

ఇక క‌విత‌ల్లో ప్ర‌థ‌మ బహుమ‌తిని శార‌ద ఆవాలు ర‌చించిన ‘బ‌హుశా వాళ్లు’ క‌వితకు ప్ర‌క‌టించారు. ఈ బ‌హుమ‌తి కింద రూ. 5,116 అంద‌జేస్తారు. రెండు ద్వితీయ బ‌హుమ‌తుల‌ను పి. సుష్మ క‌విత ‘హైబ్రిడ్‌’, మంగామ‌ణి క‌విత ‘చైత‌న్య‌పు ఖ‌డ్గాన్ని’ గెలుపొందాయి. ఒక్కో క‌విత‌కు రూ. 2,116 అంద‌జేయ‌నున్నారు. మూడు తృతీయ బ‌హుమ‌తుల‌ను సంధ్యారాణి ప‌ద్య క‌విత ‘యుగ‌లిధార‌’, కాస‌ర ల‌క్ష్మీసుజాత రెడ్డి క‌విత ‘సుప్ర‌భాత‌’, నందిరాజు ప‌ద్మ‌ల‌తా జ‌య‌రాం క‌విత ‘కరోనా చాలా నేర్పింది’ గెలుచుకున్నాయి. వీటిలో ఒక్కో క‌విత‌కు రూ. 1,116 అంద‌జేస్తారు. అలాగే మూడు క‌విత‌ల‌కు క‌న్సొలేష‌న్ బ‌హుమ‌తులు ప్ర‌క‌టించారు. అవి.. విజ‌య రామ‌గిరి క‌విత ‘గెలుపు గ‌మ‌నం’, ల‌లిత ప్ర‌వ‌ల్లిక క‌విత ‘సైనికులు కావాలి’, నామ‌ని సుజ‌నాదేవి క‌విత ‘యుద్ధం మ‌న‌కు కొత్త‌ కాదు’. ఈ క‌విత‌ల్లో ఒక్కో దానికి రూ. 526 అంద‌జేయ‌నున్నారు.

Leave a Reply

%d bloggers like this: