జూలై 2, 2021

ఈ పోటీలో నెగ్గితే ఏంటంట?

Posted in విద్యారంగం, సాంఘికం-రాజకీయాలు at 12:34 సా. by వసుంధర

గిన్నెస్ బుక్ రికార్డుకోసం బిందెలకొద్దీ నీళ్లు తాగేవాళ్లూ, మిరపకాయలు తినేవాళ్లూ ఉన్నారు. వాటివల్ల ఏం ప్రయోజనమని గట్టిగా నిలదీస్తే- ఆటలపోటీలవల్ల ఏం ప్రయోజనమని వాళ్లు ఎదురుదాడి చెయ్యొచ్చు.

మనం పేరుకోసం చేసే పని కొందరికి వినోదాన్నో, స్ఫూర్తినో ఇవ్వచ్చు. కేవలం మనకు మాత్రమే పేరు తెచ్చిపెట్టే పోటీల గురించి ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకోవాలంతే!

అమెరికాలో అమెరికన్లు తక్కువ ఆసక్తి చూపించే స్పెల్లింగ్ పోటీల్లో- మనవాళ్లు మహోత్సాహంగా పాల్గొని విజేతలౌతుంటారు. అందుకు మనం గర్వపడుతుంటాం. ఆ పోటీలో నెగ్గితే ఏంటంట- అని ఎప్పుడైనా అలోచించేమా?

జీవితంలో ఔన్నత్యాన్ని సాధించడంపై ఆంగ్లంలో చక్కని పుస్తకాన్ని వ్రాసిన ప్రొఫెసర్ భరత్ రామకృష్ణ సంత్ – ఈ పోటీలపై వెలిబుచ్చిన స్పందన మనకు మార్గదర్శకం కావచ్చు. ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Leave a Reply

%d bloggers like this: