జూలై 2, 2021

ఓపెన్ సిరీస్ ఛాలెంజ్ ధారావాహికల పోటీః ప్రతిలిపి

Posted in కథల పోటీలు, రచనాజాలం, సాహితీ సమాచారం at 6:36 సా. by వసుంధర

లంకె

నమస్తే

ఓపెన్ సిరీస్ ఛాలెంజ్ కి స్వాగతం. ఈ పోటీ సిరీస్ ని ప్రోత్సహించడం కోసం పెట్టడం జరుగుతోంది. శీర్షికకు తగ్గట్టు ఈ పోటీ పూర్తిగా మీ ఇష్టం. అనగా విభిన్నమైన అంశాలపై మీరు సిరీస్ (సీరియల్స్) రాయవచ్చు. ఆసక్తికరమైన సిరీస్ రాసి మీ ప్రతిలిపి ప్రొఫైల్ లో స్వీయప్రచురణ చేయగలరు.

మీరు మీ ధారావాహికలను స్వీయప్రచురణ చేయడానికి ఈ క్రింది విధానాన్ని అనుసరించగలరు.

మీ ధారావాహికలను స్వీయప్రచురణ చేయడానికి మీ ప్రొఫైల్ లోకి వెళ్ళి “వ్రాయండి” అనే బటన్ మీద క్లిక్ చేసి, కొత్తరచనను జోడించండి. మీ ధారావాహిక యొక్క శీర్షికను జత పరిచి రెండు వాక్యాల్లో సంగ్రహాన్ని రాసి ధారావాహికను కొనసాగించి ప్రచురించండి. ప్రతిలిపి ఫోటోగ్యాలరీ లో మీ ధారావాహికకు తగ్గ ఫోటోని జోడించి, విభాగం అనే చోట “కథ” ను సెలెక్ట్ చేసి, వర్గం  అనే చోట “ఓపెన్ సిరీస్ ఛాలెంజ్” అనే వర్గంతో పాటు మీ ధారావాహికకు సరిపోయే మరో రెండు వర్గాలను కూడా సెలెక్ట్ చేసి నేను అంగీకరిస్తున్నాను అని చివరగా ప్రచురించండి. ఈ పోటీ చివరి తేది ముగియగానే ” ఓపెన్ సిరీస్ ఛాలెంజ్ ” అనే వర్గం తీసివేయడం జరుగుతుంది. కావున మీరు తప్పకుండా ” ఓపెన్ సిరీస్ ఛాలెంజ్ ” అనే వర్గంతో పాటు మరో రెండు వర్గాలను  తప్పనిసరిగా సెలెక్ట్ చేసుకోవాలి.

బహుమతులు:

1. మొదటి బహుమతి : 6000

2. రెండవ బహుమతి : 4000

3. మొదటి ఐదు మంది రచయితలకు ప్రతిలిపి ఉత్తమ రచయిత అవార్డు మీ ఇంటికి పంపడం జరుగుతుంది.

ముఖ్యమైన తేదీలు:

1. మీ ధారావాహికలు స్వీయప్రచురణ చేయడానికి ప్రారంభ తేది: 1.జూలై.2021

2. మీ ధారావాహికలు స్వీయప్రచురణ చేయడానికి చివరి తేది: 29.జూలై.2021

3. ఫలితాలు ప్రకటించే తేది: 5.ఆగస్టు.2021

నేను ఎప్పుడూ ధారావాహిక రాయలేదు. నేను కూడా పాల్గొనవచ్చా?

తప్పకుండా పాల్గొనవచ్చు. ధారావాహిక ఎలా రాయాలో…? సందేహాలు ఉంటే మా ప్రతిలిపి బృందం మీకు సహాయం అందిస్తుంది.

పోటీలో ఎన్ని ధారావాహికాలైనా  రాయవచ్చా?

అవును. ఈ పోటీలో ఒక రచయిత ఎన్ని ధారావాహికాలైనా రాయవచ్చు. కాకపోతే ఇచ్చిన గడువు లోపు పూర్తి చేయాలి.

నియమాలు:

1. మీరు ధారావాహిక రాయవలసి ఉంటుంది. కనీసం రెండు భాగాలు ఉన్న రచనలు మాత్రమే ధారావాహికలుగా స్వీకరించబడతాయి.

2. ధారావాహిక ఎన్ని భాగాలు అయినా ఉండవచ్చు. తప్పకుండా మీ ధారావాహిక యొక్క అన్ని భాగాలు ఒకే లింక్ లో ఉండాలి. అలా ఉన్న ధారావాహికలు మాత్రమే పోటీకి తీసుకొనబడతాయి.

3. ధారావాహిక ఏ అంశం మీద అయినా రాయవచ్చు.

4. మీరు ఎన్ని ధారావాహికలు అయినా రాయవచ్చు.

5. ఒక భాగంలో కనీసం రెండు వందల పదాలు ఉండేలా చూసుకోవాలి, ఆపైన ఎన్ని పదాలు అయినా ఉండవచ్చు.

6. పోటీలో ఎవరైనా పాల్గొనవచ్చు.

7. ప్రతిలిపిలో ఇంతకముందు ప్రచురించిన ధారావాహికలు పోటీకి తీసుకోబడవు. ధారావాహికలు పూర్తిగా మీ సొంతం అయి ఉండాలి.

సందేహాలకు events@pratilipi.com కి మెయిల్ చేయగలరు.

Leave a Reply

%d bloggers like this: