జూలై 2, 2021

వైద్యో నారాయణో హరీ- వైద్యుల కథల పోటీః ప్రతిలిపి

Posted in కథల పోటీలు, రచనాజాలం, సాహితీ సమాచారం at 6:41 సా. by వసుంధర

లంకె

నమస్తే

వైద్యో నారాయణో హరీ!…

వైద్యులు భగవంతునితో సమానం. ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా ముందుగా గుర్తొచ్చేది వైద్యులే. వైద్యులు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడుతారు. కరోనా కాలంలో వైద్యుల సేవ అనిర్వచనీయమైనది. అయితే కొన్ని ఆసుపత్రుల వారు కార్పొరేటే వైద్యం పేరుతో బీద ప్రజలను పీక్కుతింటున్నారు. మూడ్ ఆఫ్ ది మంత్ లో భాగంగా ఈ నెల వైద్యో నారాయణో హరీ… అనే శీర్షికతో ప్రతిలిపి మీ ముందుకు వచ్చింది. మీరు చూసిన,అనుభవించిన లేదా ఎక్కడైనా విన్న  వైద్యులకు సంబంధించిన సంఘటనలను కథలుగా రాసి మీ ప్రొఫైల్ లో స్వీయప్రచురణ చేయండి.

మీరు మీ కథలను స్వీయప్రచురణ చేయడానికి ఈ క్రింది విధానాన్ని అనుసరించగలరు.

మీ రచనను స్వీయప్రచురణ చేయడానికి మీ ప్రొఫైల్ లో వెళ్ళి వ్రాయండి మీద క్లిక్ చేసి,కొత్తరచనను జోడించండి. శీర్షిక రాసి సంగ్రామం జతచేసి రచనను కొనసాగించి ప్రచురించండి. ఫోటోగ్యాలరీలో మీ కథకు తగ్గ ఫోటోని జోడించి, “విభాగం” అనే చోట “కథ” సెలెక్ట్ చేసి, వర్గం  అనే చోట ” వైద్యో నారాయణో హరీ ” అనే వర్గం తో పాటు మీ కథకు తగ్గ  మరో రెండు వర్గాలను కూడా సెలెక్ట్ చేసి “నేను అంగీకరిస్తున్నాను” అని చివరగా ప్రచురించండి. ఈ పోటీ చివరి తేది ముగియగానే “వైద్యో నారాయణో హరీ అనే వర్గం తీసివేయడం జరుగుతుంది. కావున మీరు ” వైద్యో నారాయణో హరీ ” అనే వర్గంతో పాటు మరో రెండు వర్గాలను  తప్పనిసరిగా సెలెక్ట్ చేసుకోవాలి. మీరు మీ కథలను స్వీయప్రచురణ చేసేటప్పుడు  ” వైద్యో నారాయణో హరీ “ అనే వర్గాన్ని తప్పకుండా సెలెక్ట్ చేసుకోవాలి. అలా చేసిన కథలు మాత్రమే పోటీకి తీసుకొనబడతాయి. సంగ్రామం తప్పనిసరిగా జత చేయండి.

సంగ్రామం అంటే ఏమిటి?

మీ కథ ఏ అంశం మీద రాస్తున్నారు మరియు మీ కథ యొక్క పూర్తి సారాంశం మూడు వాక్యాలలో కథ మొదట్లో రాయాలి.

న్యాయనిర్ణేత అందించిన ఫలితాలు ఆధారంగా:-

1. మొదటి ముప్పై ఉత్తమ కథలను బ్యానర్ గా చేసి ప్రతిలిపి వెబ్ సైట్ లో రెండు రోజుల పాటు ఉంచడం జరుగుతుంది. తద్వారా మీ ప్రొఫైల్ ఎక్కువ మంది పాఠకులకు తెలిసే అవకాశం ఉంది.

2. మొదటి ముప్పై మంది రచయితలకు  ప్రతిలిపి డిజిటల్ అవార్డు పంపడం జరుగుతుంది.

ముఖ్యమైన తేదీలు:

1. మీ కథలు స్వీయప్రచురణ చేయడానికి ప్రారంభ తేది : 1.జూలై.2021

2. మీ కథలు స్వీయప్రచురణ చేయడానికి చివరి తేది : 30.జూలై.2021

3. ఫలితాలు ప్రకటించే తేది : 3.ఆగస్టు.2021

నియమాలు :-

  • కథలు మీ స్వంతమై ఉండాలి.
  • ఇది వరకు ప్రతిలిపిలో ప్రచురించిన కథలు పోటీకి స్వీయప్రచురణ చేయరాదు. మరెక్కడైనా ప్రచురణ అయిన కథలు పోటీకి ప్రచురించవచ్చు.
  • పదహైదు(15) కథల వరకు పోటీకి స్వీయ ప్రచురణ చేయవచ్చు.
  • అక్షరదోషాలు లేకుండా చూసుకోవాలి.

సందేహాలకు :events@pratilipi.com కి మెయిల్ చేయగలరు.

Leave a Reply

%d bloggers like this: