జూలై 7, 2021

కవితా పోటీలు: అక్షర మందిరం

Posted in కవితల పోటీలు, కవితాజాలం at 7:36 సా. by వసుంధర

శ్రీమతి పివి శేషారత్నం సౌజన్యంతో

” అక్షర మందిరం ” వారి కవితా పోటీలు..14వ భాగం

నియమ నిబంధనలు:
వరుసకు 20 అక్షరాలు మించకుండా 16 వరుసలో కవిత పూర్తి కావాలి.
అక్షర దోషాలు ఉన్నా, నియమ అతిక్రమణ జరిగినా పరిగణించ బడవు. కవిత టైప్ చేసి వాట్సప్ ( 9949188444) లో పంపాలి.
కవితలో డిజైన్స్ అనవసరం. కవిత క్రింద హామీ పత్రం జతపరచడం తప్పనిసరి.
ఫలితాలు ప్రకటించే వరకు సామాజిక మాధ్యమాలలో పోస్టు చేయటం , పత్రికలకు పంపటం జరపరాదు.
ఎన్నిక కాబడిన కవితల పై పూర్తిగా హక్కులు మావి.
ఎన్నుకోబడిన కవితలు” అక్షర్యాన్” వారి వెబ్సైట్ లో కూడా ప్రచురింపబడును.
**
ఈ భాగపు విశేషత :
కేవలం హెల్మెట్ ధరించక పోవటం వలన ఎంత మంది వారి తల్లి తండ్రుల కడుపులో ఆరని చిచ్చు పెడుతున్నారో ఒక్క సారి ఊహించండి.
మీ కవిత ఇలాంటి వారి మనసులో చెరగని ముద్రవేసి వారి నిర్లక్ష్యాన్ని తొలగించ గలిగితే ఎంత మంచి పని చేస్తున్నారో గమనించండి. అంత కన్నా తృప్తి ఏ రచయిత కయినా ఏమి కావాలి…
అంతే కాకుండా ( అర్హత ఉంటే ) ఉత్తమ కవితలు మూడింటికి ( ప్రథమ Rs 500/ ద్వితీయ Rs 300/ తృతీయ 200/ ) నగదు బహుమతి నా తరఫునుంచి ఇవ్వ దలుచుకున్నాను.
అలాగే ఈ కవితలకు విశేష ప్రచారం చేసే ఏర్పాట్లు కూడా సఫలీకృతం కావచ్చు దేవుడి దయ ఉంటే .
మేధకు పదును బెట్టి, త్వరపడి పంపక తగు సమయం తీసుకుని పంప మనవి.
**

14 వ భాగం : ఇప్పటి నుంచి ( 7.7.2021) నుంచి 8 .7.21 రాత్రి 12.00 వరకు.

పోటీ అంశం :
14 వ భాగం :
హెల్మెట్ ధారణ
భవదీయుడు,
నండూరి రామచంద్ర రావు.

Leave a Reply

%d bloggers like this: