జూలై 8, 2021

నవలోత్సవం ఫలితాలు: ప్రతిలిపి

Posted in కథల పోటీలు at 9:57 ఉద. by వసుంధర

లంకె

07 జులై 2021

నమస్తే..

నవలోత్సవం ధారావాహికల పోటీలో పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదములు. మా న్యాయనిర్ణేతలు క్రింది రచనలను మొదటి రెండు ఉత్తమ రచనలుగా ప్రకటించారు. పోటీలో పాల్గొన్న  రచయితలందరికీ మరో 10 రోజులలో ప్రశంసా పత్రం పంపడం జరుగుతుంది. 

మొదటి బహుమతి : విరూపాక్షి

రచన : హీరోయిన్

భావవాద సమాజం అభ్యుదయ సమాజంగా మారాలి. అలా మారితేనే సమాజం ప్రగతిపథంలో నడుస్తుంది. సమాజం ప్రగతిపథంలో నడుస్తోందంటే మనుషులు ప్రగతి వైపు ఉన్నారని అర్థం. ఈ నవలను పరిశీలిస్తే అంకాలమ్మ అనే పాత్ర మొదట భావవాది ఆ తర్వాత అనేక సంఘటనల వల్ల అభ్యుదయ వాదిగా మారుతుంది. ఆ పాత్రను అలానే భావవాద పాత్రగా రచయిత్రి నడిపించి ఉండవచ్చు కానీ రచయిత్రి ఆ పని చేయకపోవడం రచయిత్రి అనుభవానికి నిదర్శనం. సహజమైన భాష, వాస్తవిక శైలి, ఆసక్తికరమైన శిల్పం నవలను ఉన్నత స్థానంలో నిలిపాయి. 

రెండవ బహుమతి : మీనాక్షీ శ్రీనివాస్

రచన : పూలు-ముళ్ళు

సమయం అన్ని సమస్యలకు పరిష్కారాన్ని ఇస్తుంది. భార్యాభర్తలు అర్థం చేసుకొని ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ముందుకు నడిస్తే వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. సాంకేతికంగా సమాజం ముందుకు సాగే కొద్ది బంధాలు బలహీనం అవుతున్నాయి అనే విషయాన్నీ రచయిత్రి చక్కగా వివరించారు. ఆకట్టుకునే శిల్పం, కథనంతో నవలను సాగించిన విధానం ప్రశంసనీయం. వస్తువు ఎంత గొప్పదైనా దాన్ని నడిపించడంలోనే రచయితల నేర్పు ఉంటుంది. రచయితలకు శుభాకాంక్షలు తెలుపుతూ పాల్గొన్న అందరికి అభినందనలు.

పై రెండు నవలలు మా న్యాయనిర్ణేతల దృష్టిలో ఉత్తమమైనవి కానీ ఇవే తెలుగు సాహిత్యంలో కానీ, ప్రతిలిపిలో కానీ అత్యుత్తమ నవలలుగా ప్రకటించడం లేదు. వచ్చిన నవలల్లో వివిధ అంశాలను పరిగణలోకి తీసుకొని విజేతలను ప్రకటించడం జరిగింది. ఈ పోటీకి చాలా మంచి నవలలు వచ్చినప్పటికీ శిల్పం, ఎత్తుగడ, అసహజ సంఘటనలు, మలుపులు, భాష, అసంపూర్ణ ముగింపులు వారిని విజయానికి దూరం చేశాయి.

ఈ పోటీలో పాల్గొన్న రచయితలందరికి మరోసారి ధన్యవాదములు. గెలిచిన విజేతలకు శుభాకాంక్షలు తెలుపుతూ… మరొక పోటీతో మీ ముందుకు వచ్చి ఉన్నాము. పోటీ యొక్క వివరాల కోసం పోటీలు శీర్షికలో చూడగలరు. ప్రతిలిపి నిర్వహించే పోటీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ.

ప్రతిలిపి తెలుగు విభాగం. 

ఇమెయిల్ : events@pratilipi.com

Leave a Reply

%d bloggers like this: