జూలై 12, 2021

రాయలసీమ సాహిత్య చరిత్ర నిర్మాణానికి ఆహ్వానం

Posted in మన కథకులు, సాహితీ సమాచారం at 7:09 సా. by వసుంధర

వాట్‍సాప్ బృందం సాహితీ పల్లవం సౌజన్యంతో

ఆధునిక రాయలసీమ సాహిత్య చరిత్ర నిర్మాణానికి ఔత్సాహికులకు ఆహ్వానం

ఇప్పుడు రాయలసీమ అస్తిత్వం చైతన్యం పెరుగుతున్నది. రాయలసీమలో ఆధునిక సాహిత్యం చాలా ఆలస్యంగా మొదలైందనే వాదం నుంచి బయటపడి ,రాయలసీమలో కూడా ఆధునిక సాహిత్యం ఇతర ప్రాంతాలతోపాటు కొంచెం ముందుగా నడుస్తున్నది అనే వాదం వినబడుతున్నది. ఈసమయంలో రాయలసీమ సాంస్కృతిక చరిత్రను సమగ్రంగా రచించుకోవలసిన సమయం ఆసన్నమైంది. ఇందుకే ఈ ప్రయత్నం..ఈ సందర్భం లో తెలుగు భాషా మిత్ర మండలి ఆధునిక రాయలసీమ సాహిత్య చరిత్రను సమగ్ర విశ్లేషణ తో పునర్నిర్మించ తలపెట్టింది. ఈ యజ్ఞం లో పాలుపంచుకోవాటానికి కవులు/రచయితల కు , విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న అధ్యాపకుల కు, పరిశోధకులకు, విమర్శకుల కు, సాహిత్య అభిమానులకు, ఆహ్వానం పలుకుతూంది.వారి రచనలను కాలానుగుణంగా క్రోడీకరించి ఆధునిక రాయలసీమ సాహిత్య చరిత్రను సమగ్ర విశ్లేషణ చేయాలని యోచిస్తోంది. 1853 నుండి 2000 సంవత్సరాల మధ్య లో పుట్టిన కవులు/ రచయితల వివరాలు రచనలు సేకరించి ,లోతైన పరిశోధన వ్యాసాలు రాయించి ,పుస్తక రూపంలో తీసుకురావాలని అనుకుంటోంది. మీకు తెలిసిన కవులు/ రచయితలు, రచనలు, లేదా మీ రచనలు కింది పద్ధతి లో పంపమని తెలుపుతోంది తెలుగు భాషా మిత్ర మండలి. ఈ వివరాలను వాట్సాప్ (8333010428) ద్వారా కూడా పంపవచ్చు.పోస్ట్ కార్డు ద్వారా కూడా పంపవచ్చు.
https://forms.gle/cZNod974f7y5en6ZA
ఈ గూగుల్ ఫామ్ లో నింపి పంపవచ్చు.వివరాలు నమోదు ఇలా…

1.కవి/రచయిత పేరు :
(ఇంటిపేరు తో)

2.పుట్టిన తేది:
(తేది/నెల/సంవత్సరం)

 1. స్వంత జిల్లా:
 2. చిరునామా:
  (ఫోన్ నెంబర్ తో)
 3. రచనలు :
  (ప్రక్రియల వారీగా)
  ముద్రితం/అముద్రితం రచనా సంవత్సరం:

6.మీకు నచ్చిన కవి/ రచయిత :

(భవిష్యత్తులో ఈ కవి/ రచయిత గురించి వ్యాసం రాయగలగాలి)

ఈ పద్ధతి లో మీ రచనలు, లేదా మీకు తెలిసిన వారి రచనలు మాకు పంపితే వారందరి వివరాలు ఆధునిక రాయలసీమ సాహిత్య చరిత్రలో చోటు చేసుకుంటాయి.(కాలం పరిధి కచ్చితంగా దృష్టిలో ఉంచుకుని రచనలు పంపాలి.(1853-2000).
పోస్ట్ కార్డు ద్వారా పంపించాల్సిన చిరునామాలు
డా.జి.వి.సాయి ప్రసాద్
ఇంటి నెంబరు 57-513-2,
మేడ పైన, శాస్త్రి నగర్
అక్కాయపల్లె
కడప 516003
డా.అనుగూరు చంద్రశేఖర రెడ్డి
ఇంటి నెంబరు 39/633-6-1
పటేల్ రోడ్, అరవింద నగర్.
కడప 516001

(దయవుంచి ఈ సమాచారాన్ని మన రాయలసీమ పరిధిలోని సాహిత్య సమూహాల్లో,ఇతర సమూహాల్లో ప్రచారం చేసి రాయలసీమ సాహిత్య చరిత్రను భవిష్యత్తరాలవారికి తెలిపేందుకు మీ వంతు బాధ్యతగా, రాయలసీమ వాసిగా కృషి చేయగలరని సవినయంగా మనవి చేస్తున్నాము)

2 వ్యాఖ్యలు »

 1. ఈప్రాంతీయతత్వవాదం ఎంతదూరం పోతుందో తెలిరకుండా ఉంది. క్రమంగా ఊరూరా మావాళ్ళు అంటూ గొడవలు మొదలౌతాయి. తెలుగువారు అంతా ప్రాంతాలకు అతీతంగా ఒకటి కాలేకపోతే వారి అస్తిత్వం చెడుతుంది చివరికి.

  • kailash said,

   భాషకు ప్రాంతాలు, సాహిత్యానికి వర్గాలు- ఇదీ రాజకీయమార్గంలోనే నడుస్తోంది. మనలాంటివాళ్లది అరణ్యరోదనే!


Leave a Reply

%d bloggers like this: