జూలై 16, 2021

జూమ్ సభకు ఆహ్వానం

Posted in సాహితీ సమాచారం at 10:03 ఉద. by వసుంధర

వాట్‍సాప్ బృందం సాహిత్య సమాచారకలశం సౌజన్యంతో

ఆహ్వానం
తెలంగాణ రచయితల వేదిక-రాష్ట్ర శాఖ

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం 75 ఏళ్ళు – ప్రభావ ప్రతిఫలనాలు

సభాధ్యక్షులు
గాజోజు నాగభూషణం
తె.ర.వే. రాష్ట్ర అధ్యక్షులు

వక్తలు
ఆచార్య ఘంటా చక్రపాణి
పూర్వ అధ్యక్షులు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్

కటుకోజ్వల ఆనందాచారి
ప్రధాన కార్యదర్శి,తెలంగాణ సాహితీ

స్వాగత వచనాలు
కొండి మల్లారెడ్డి
తె.ర.వే. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

వందన సమర్పణ
కూకట్ల తిరుపతి
తె.ర.వే. రాష్ట్ర ప్రచార కార్యదర్శి

@అంతర్జాల సమావేశం@
Date&Time: Jul 18, 2021 05:00 PM

Join Zoom Meeting
https://us02web.zoom.us/j/3639004353

Meeting ID: 363 900 4353
No Password

అందరూ ఆహ్వానితులే

3 వ్యాఖ్యలు »

 1. సంఘాలూ సమావేశాలూ ముఠాలూ మహాకవులనూ మహారచయియితలనూ సృజించలేవు. ఎంతో కొంత సంకుచితత్వాన్ని ఎగదోయగలవు ఏదోవిధంగా అధఃప్రయాణానికి టకట్లు ఇప్పించగలవు. అంతే.

 2. > తెలంగాణ రచయితల వేదిక-రాష్ట్ర శాఖ
  వీరు తెలుగు రచయితలు కారా? తెలంగాణా రచయితలు అ నే ప్రాంతీయతాపరిధి లేకపోతే వ్రాయలేరా? చదివించలేరా? ఇలా చిల్లర కుంపట్లతో తెలుగు రచయితలు అభివృధ్ధి చెందరు – మెల్లగా క్షీణిస్తారు. దాన్ని కొందరు అభివృధ్ధి అనుకుంటే చేయగలిగింది లేదు.

  మెల్లగా కోససీమ రచయితలు కొత్తపేట రచయితలు కొబ్బరితోట రచయితలు ఖమ్మం జిల్లా రచయితలు వరంగల్లు రచయితలు హనుమకొండ రచయితలు అప్పలకొండ రచయితలు అంటూ సవాలక్ష వేరుకుంపట్లు వండివార్చి వడ్డించేది భేషజాల్లేని సాహిత్యమేనూ‌ అని మెడమీద తల ఉన్న వాడెవడైనా అనుకుంటాడా?

  విశాలప్రపంచసాహిత్యంలో అసలు తెలుగుసాహిత్యం ఎక్కడ పడి ఉంది? ప్రపంచసాహిత్యం దాకా ఎందుకు భారతీహసాహిత్యంలో తెలుగుసాహిత్యం‌ ఎంత క్రియాశీలంగా ఉంది? ఎంత ప్రభావశీలంగా ఉంది?

  ఒకప్పుడు రంగనాయకమ్మ మాట్లాడే తెలుగే వ్రాస్తున్నామా అని ఒక వ్యాసం వ్రాసారు. ఈరోజున ఐతే ఈ అంతర్జాలం పుణ్యమా అని తెలుగు అక్షరాలు వచ్చిన ప్రతివ్యక్తీ కవి గానూ రచయితగానూ చెప్పుకొని తిరగటమే. ఇందాకనే ఒకచోట (ఒకబ్లాగులో) శీర్షికలోనే “భావంను” అని ఉంటే ప్రశ్నించాను. ఔపవిక్తకాలను తెలిసిన వారే లేరా అన్నట్లు “రాముడు ఇల్లు” వంటి దిక్కుమాలిన ప్రయోగాలు విచ్చలవిడిగా ఉన్నాయి బయట.

  ఇప్పుడు ఈచీకటిరోజుల్లో, రచయితలం అని చెప్పుకొనేవారు ప్రాంతాలవారీగా గొప్పలు చెప్పుకోవటమూ‌ కొట్టుకుచావటమూ అవసరమా?‌ కాస్త తెలుగుసాహిత్యం పైనా దాని స్థాయిని అభివృధ్ధి చేసే మంచి రచనలపైనా దృష్టిపెట్టటం అవసరమా? ఈ సాహిత్యరాజకీయాలు సాహిత్యానికి కాని సాహిత్యకారులకు కాని చేసే మేలు ఏమీ‌ ఉండదు. మరింత పాతాళానికి త్రోయటం తప్ప.

  దయచేసి ఈ‌వేదిక నిర్వాహకులు ఇలాంటి హ్రస్వదృష్టులను ప్ర్రోత్సహించవద్దని మనవి.

  • పేరేదైనా అది తెలుగు రచయితల వేదిక. ఆ సమావేశం గురించి తెలుసుకోవడం మంచిది. ఆమేరకు మనం మన సాహితీపరిజ్ఞానాన్ని పరిపుష్టం చేసుకోవచ్చు. దీనికి అందరూ ఆహ్వానితులే కాబట్టి మీవంటివారు గళం విప్పడానికి అవకాశంగానూ తీసుకోవచ్చు. మావరకూ వస్తే మాకు సభలు, సమావేశాలు అర్థరహితం అన్న భావన ఉంది. అంతమాత్రాన వాటికి దూరంగా ఉండగలం కానీ, నిరసించలేం కదా! మన చుట్టూ సాహిత్యపరంగా ఏం జరుగుతున్నదీ తెలుసుకోవడం కూడా అక్షరజాలం ఉద్దేశ్యాల్లో ఒకటి. తద్వారా వచ్చిన మీవంటివారి స్పందనలు కూడా కొందరికైనా చేరుతాయి కదా! చూద్దాం- ఏదో రోజున మార్పు వస్తుందేమో!


Leave a Reply

%d bloggers like this: