జూలై 19, 2021

చిన్నకథల పోటీ ఫలితాలుః ఆంధ్ర సారస్వత పరిషత్

Posted in కథల పోటీలు at 1:15 సా. by వసుంధర

శ్రీమతి పివి శేషారత్నం సౌజన్యంతో

ఆంధ్ర సారస్వత పరిషత్ చిన్న కథల పోటీ విజేతలు

భీమవరం: ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహించిన అంతర్జాతీయ చిన్ని కథల పోటీలలో ప్రధమ బహుమతి శ్రీ సింహ ప్రసాద్ , హైదరాబాద్ వారు రచించిన “పరంపర “అనే కథ కు లభించింది. శ్రీ అల్లు సాయిరామ్, విజయనగరం రచించిన “అగమ్యం” కు ద్వితీయ బహుమతి , శ్రీమతి పి.వి.శేషారత్నం , టెక్సాస్, రచించిన ” మూడోతరం” కు తృతీయ బహుమతులు లభించినట్లు , శ్రీ ఉప్పులూరి మధుపత్ర శైలజ, హైదరాబాద్ వారి తెలుగును వెలిగిద్దాం, డా.శ్రీదేవి శ్రీకాంత్ , సౌత్ ఆఫ్రికా వారి నాతి చరామి, శ్రీ మహమ్మద్ రఫీ , రాజంపేట వారి పలక నేర్పిన పాఠం, శ్రీ ఇంద్రగంటి నరసింహమూర్తి ,కాకినాడ వారి మాతృ భాషకు నీరాజనం కథలకు ప్రోత్సాహక బహుమతులు లభించినట్లు పరిషత్ అధ్యక్షలు డా.గజల్ శ్రీనివాస్, కార్యదర్శి శ్రీ రెడ్డప్ప ధవేజి పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ పోటీకి ప్రధాన న్యాయ నిర్ణేతగా ప్రఖ్యాత కథా రచయిత శ్రీ కంఠ స్ఫూర్తి, డా. యెస్ ఆర్. యెస్ కొల్లూరి సమన్వయకర్త గా వ్యవహరించారు.

శ్రీ రెడ్డప్ప ధవెజి
97031 15588
కార్యదర్శి
ఆంధ్ర సారస్వత పరిషత్

Leave a Reply

%d bloggers like this: