జూలై 20, 2021

సాహిత్య వ్యాసాలకు ఆహ్వానం

Posted in సాహితీ సమాచారం at 10:51 ఉద. by వసుంధర

వాట్‍సాప్ బృందం సాహిత్య సమాచారకలశం సౌజన్యంతో

సాహిత్య వ్యాసాలకు ఆహ్వానం ———————————————
సాహితీ మిత్రులకు నమస్కారం! రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ట్రిపుల్ ఐటీ), బాసర, తెలుగు శాఖ ఆధ్వర్యంలో ‘వ్యాస వాహిని’ అనే పేరుతో వ్యాస సంకలనం తీసుకురాదలిచాం. సాహితీవేత్తలు , పరిశోధకులు, అధ్యాపకులు సాహిత్య వ్యాసాలు రాసి పంపిస్తారని ఆశిస్తున్నాము.

నిబంధనలు…


1.వ్యాసం ఐదు పేజీల లోపు ఉండాలి.
2.సాహిత్యంలో ఏ అంశం పైనైనా వ్యాసం రాయవచ్చు.
3.వ్యాసం పరిశోధనాత్మకంగా ఉండాలి.
4.పాద సూచికలు ,ఆధార గ్రంథాలు పేర్కొనాలి.
5.పరిశోధనా వ్యాసం వెంట హామీ పత్రం ఇవ్వాలి.
6.ప్రామాణిక గ్రంథాలను ఆశ్రయించి మాత్రమే వ్యాసాలు రాయాలి.
7.పరిశోధన పత్రాలు సూటిగా, స్పష్టంగా, ప్రామాణికంగా ఉండాలి.
8.వ్యాసాలు అను ప్రియాంక ఫాంట్ లో పిడిఎఫ్ తో ఒక కాపీ, ఓపెన్ ఫైల్ ఒక కాపీ పంపించవలెను.
9.ఈ గ్రంథం ISBN నెంబర్ తో ప్రచురించడం జరుగుతుంది. కాబట్టి ముద్రణ నిమిత్తం వ్యాసాలు పంపే రచయితలు 500/- చెల్లించవలసి ఉంటుంది.
10.ఈ వ్యాసాలు ఆగస్టు 31, 2021లోపు పంపించాల్సిందిగా మనవి.

నోట్: మొదట వచ్చిన 100 వ్యాసాలు మాత్రమే ప్రచురణకు స్వీకరించబడుతాయి.

ఇట్లు
డా.బి.విజయ్ కుమార్
అధ్యక్షులు
తెలుగు శాఖ
రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం
(IIIT BASAR)
బాసర.
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: 7780559426
: 9951428183
వ్యాసాలు పంపాల్సిన మెయిల్ ఐడి: vyasavahini@gmail.com
డబ్బులు పంపాల్సిన అకౌంట్:
ఫోన్ పే మరియు గూగుల్ పే నంబర్:
9951428183.
Dr. J. Rayamallu

Leave a Reply

%d bloggers like this: