జూలై 22, 2021

మినీ కథా ప్రపంచం: ప్రతిలిపి

Posted in రచనాజాలం, సాహితీ సమాచారం at 10:52 ఉద. by వసుంధర

లంకె

నమస్తే…

మీరు కథలు రాయాలని అనుకుంటున్నారా?మీకు సమయం సరిపోవడం లేదా? అయితే మీకిది సదవకాశం. ప్రతిలిపి మినీ కథల పోటీతో మీ ముందుకు వచ్చింది. కొన్ని సంఘటనలపైన, సన్నివేశాలపైన అతి త్వరగా స్పందించడమే మినీ కథ. తక్కువ పదాలతో ఎక్కువ సమాచారం, సందేశం ఇవ్వడమే మినీ కథా లక్ష్యం. రచయిత మినీ కథను హస్యపూరితంగా కానీ బాధగా కానీ వ్యంగ్యంగా కానీ మరేవిధమైన ఎమోషనైనా రాయవచ్చు. మీరు రచించిన మినీకథలను ప్రతిలిపిలో ప్రచురించడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.

స్వీయప్రచురణ ఎలా చేయాలి?

మీ రచనను స్వీయప్రచురణ చేయడానికి మీ ప్రొఫైల్ లో వెళ్ళి వ్రాయండి మీద క్లిక్ చేసి,కొత్తరచనను జోడించండి. శీర్షిక రాసి సంగ్రహం జతచేసి రచనను కొనసాగించి ప్రచురించండి. ఫోటోగ్యాలరీలో మీ కథకు తగ్గ ఫోటోని జోడించి, “విభాగం” అనే చోట “కథ” సెలెక్ట్ చేసి, వర్గం  అనే చోట “మినీ కథా ప్రపంచం” అనే వర్గం తో పాటు మీ కథకు తగ్గ  మరో రెండు వర్గాలను కూడా సెలెక్ట్ చేసి “నేను అంగీకరిస్తున్నాను” అని చివరగా ప్రచురించండి. ఈ పోటీ చివరి తేది ముగియగానే “ మినీ కథా ప్రపంచం అనే వర్గం తీసివేయడం జరుగుతుంది. కావున మీరు ” మినీ కథా ప్రపంచం ” అనే వర్గంతో పాటు మరో రెండు వర్గాలను  తప్పనిసరిగా సెలెక్ట్ చేసుకోవాలి. మీరు మీ కథలను స్వీయప్రచురణ చేసేటప్పుడు  ” మినీ కథా ప్రపంచం అనే వర్గాన్ని తప్పకుండా సెలెక్ట్ చేసుకోవాలి. అలా చేసిన కథలు మాత్రమే పోటీకి తీసుకొనబడతాయి. సంగ్రహం తప్పనిసరిగా జత చేయండి.

న్యాయనిర్ణేత అందించిన ఫలితాలు ఆధారంగా:-

1. పోటీలో పాల్గొన్న రచయితలందరికీ ప్రశంసాపత్రం మెయిల్ చేయడం జరుగుతుంది.

2. పోటీకి వచ్చిన కథలన్నింటిని కలిపి ప్రతిలిపిహోమ్ పేజిలో ప్రచురించడం జరుగుతుంది. తద్వారా మీ ప్రొఫైల్ ఎక్కువ మంది పాఠకులకు చేరుకొని పాఠకులసంఖ్య, రేటింగ్, తెలుస్తుంది.

ముఖ్యమైన తేదీలు :

1. మీ కథలు స్వీయప్రచురణ చేయడానికి ప్రారంభ తేది : 16.జూలై.2021

2. మీ కథలు స్వీయప్రచురణ చేయడానికి చివరి తేది : 27.జూలై.2021

3. ఫలితాలు ప్రకటించే తేది : 31.జూలై.2021

 నియమాలు :-

  1. కథలు మీ స్వంతమై ఉండాలి. ఇది వరకు ప్రతిలిపిలో ప్రచురించిన కథలు పోటీకి స్వీయప్రచురణ చేయరాదు.
  2. మీ మినీ కథ కనీసం రెండువందల పదాల పైన వెయ్యి పదాల లోపు ఉండాలి.

సందేహాలకు : events@pratilipi.com కి మెయిల్ చేయగలరు.

Leave a Reply

%d bloggers like this: