జూలై 27, 2021

కవులకు ఆహ్వానం

Posted in కవితాజాలం, సాహితీ సమాచారం at 7:03 సా. by వసుంధర

శ్రీమతి పివి శేషారత్నం సౌజన్యంతో

‘సేవ’ సంస్థ

సేవ సహస్ర సాహితీ సప్తాహం

కవులకు ఆహ్వానం

‘సేవ’ సంస్థ ఆధ్వర్యంలో
తెలుగు సంఘాలు, వాట్సాప్, ఫేస్బుక్ సమూహాలు, మీడియా, సోషల్ మీడియా సహకారంతో తెలుగు భాషా వారోత్సవాలను
‘సేవ సహస్ర సాహితీ సప్తాహం’ పేరిట
జూమ్ వేదికగా…
2021 ఆగస్టు 23వ తేదీ సోమవారం నుండి 29వ తేదీ ఆదివారం వరకు
నిర్వహిస్తున్నాం.
ఈ సందర్భంగా 10 – 15 మంది తెలుగు కవులతో ఒక విభాగంగా రోజుకు 10 విభాగాలుగా ఉదయం 9 – 10 మధ్య సదస్సులు అనంతరం ఉదయం 10 నుండి రాత్రి 10 గం. వరకు వరుసగా వారం రోజుల పాటు 1000 మందితో కవి సమ్మేళనము లను నిర్వహిస్తున్నాము.

తెలుగు వచనకవిత్వం, పద్యకవిత్వం,కథానికలు, గజళ్ళు, గీతాగానం, ఇతర సాహితీ ప్రక్రియల కవితలను ఈ సమ్మేళనంలలో పఠనం చేయవచ్చు.

పఠనం చేసే కవిత సోషల్ మీడియా సమూహాల్లోను, పత్రికల్లోనూ, అంతర్జాలలోనూ ఇంతవరకు ఎక్కడా ప్రచురించబడి ఉండరాదు. కవితా పఠనం 3 నిమిషాలకు మించి ఉండరాదు. అలాగే పంపిన కవిత తదుపరి తేది తెలిపే వరకు ఎక్కడా ప్రచురణ చేయరాదు. ప్రపంచంలో ఎక్కడి నుండయినా,
ఎక్కడి వారయినా జూమ్ యాప్ వేదికగా నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు.

పాల్గొనే వారికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, వరల్డ్ రికార్డు, గుర్తింపు పొందిన కొన్ని సంస్థలతో ధ్రువీకరణ పత్రాలు, ప్రశంసలు, విన్నూత్న రీతిలో పురస్కారం సేవ అందజేస్తుంది.

ఆసక్తి కలిగిన కవులు, కవయిత్రులు వెంటనే పూర్తి పేరు, ఊరు, జిల్లా, రాష్ట్రం ఇతర ప్రాధమిక వివరాలతో క్రింది వాట్సాప్ నంబర్లకు మెసేజ్ చేస్తూ తమ పేర్లను వెంటనే నమోదు చేసుకోండి.

పేర్ల నమోదుకు చివరి గడువు: తేదీ 30-07-2021

పేర్లు నమోదు చేసుకోవాల్సిన వాట్సాప్ నంబర్: 9542114416

పై వాట్సాప్ నంబరుకు మెసేజ్ చేస్తూ వెంటనే మీ పేరును నమోదు చేసుకోండి.
లేదా కవి సమ్మేళనం నిర్వహణ కోసం ఏర్పాటైన రాయలసీమ వాట్సాప్ గ్రూపులో జాయిన్ కండి!

గ్రూపు లింక్: https://chat.whatsapp.com/FesfMAszU8YELiY6v4Gd9R

సదా సేవలో

  • ఉద్దండం చంద్రశేఖర్
    కార్యనిర్వాహక కమిటీ గౌరవ సభ్యులు, సేవ
    🙏
    జయహో సాహిత్యం.

Leave a Reply

%d bloggers like this: