ఆగస్ట్ 3, 2021

ప్రతిలిపి సాహిత్య అవార్డ్-2021

Posted in కథల పోటీలు, కథాజాలం at 4:03 సా. by వసుంధర

లంకె

ప్రతిలిపి గురించి:

ప్రతిలిపి భారతదేశంలో అతిపెద్ద కథా స్వీయ ప్రచురణ వేదిక, 12 భాషల్లో 2.5 కోట్లకు పైగా పాఠకులు మరియు 2.7 లక్షలకు పైగా రచయితలు ఉన్నారు. వేలాది మంది పాఠకులను పొందడం, తమ రచనల నుండి డబ్బు సంపాదించుకోవడం, పుస్తకాలను ముద్రించుకోవడం, ఆడియో బుక్స్, కామిక్స్ మరియు వెబ్ సిరీస్‌లుగా మార్చడం వంటి అద్భుతమైన అవకాశాలను రచయితలకు అందిస్తోంది.

మీరు మా తదుపరి బెస్ట్ సెల్లర్ రచయిత కావాలని అనుకుంటున్నారా? అయితే, మీరు మా అతిపెద్ద ప్రతిలిపి సాహిత్య అవార్డ్-2021 పోటీలో పాల్గొనండి.

దయచేసి క్రింది వివరాలను జాగ్రత్తగా చదవండి!

నియమాలు:

1.    ఈ పోటీకి మీ సిరీస్ రాయాల్సి ఉంటుంది.

2.   ఇది బహుభాషా పోటీ, మీరు ఈ క్రింది  ఏ భాషలో అయినా మీ రచనను పోటీకి వ్రాయవచ్చు: తెలుగు, ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, తమిళం, మలయాళం, కన్నడ, ఒడియా, ఉర్దూ, బెంగాలీ.

3.   మీ సిరీస్ కనీసం 5000 పదాలు ఉండాలి (నవల/సిరీస్ మొత్తం భాగాలు కలిపి). నవల కనీసం 5 భాగాలు ఉండాలి. అంతకుమించి ఎన్ని భాగాలైనా ఎన్ని పదాలైనా రాయవచ్చు.

4.   ఈ పోటీకి ఒక్క రచయిత ఒక సిరీస్ మాత్రమే రాయాలి.

5.   పోటీకి మీ సిరీస్ ఏ శైలిలోనైనా లేదా ఏ అంశంపైనైనా వ్రాయవచ్చు.

6.   మీరు ఈ పోటీలో పాల్గొనడానికి మీ సిరీస్ ని స్వీయ ప్రచురణ చేయాలి. మీ రచనలను ప్రచురించేటప్పుడు తప్పనిసరిగా వర్గం “ప్రతిలిపి అవార్డ్స్” ని సెలెక్ట్ చేసుకోవాలి.

ప్రతిలిపి లో మీ నవలలను స్వీయప్రచురణ ఎలా చేయాలో? తెలుసుకోవడానికి ఈక్రింది లింక్ పైన క్లిక్ చేయండి.

 7.   సిరీస్ పూర్తిగా మీ సొంతమై ఉండాలి.

8.   ప్రతిలిపిలో ఇంతకముందు ప్రచురించిన మీ సిరీస్ పోటీకి స్వీయ ప్రచురణ చేయరాదు. మరెక్కడైనా ప్రచురణ అయిన సిరీస్ పోటీకి ప్రచురించవచ్చు.

9.   మీరు రచించిన సిరీస్ ఇచ్చిన గడువు లోపు మీ ప్రొఫైల్ లో స్వీయ ప్రచురణ చేయాలి. అలా పూర్తికాని సిరీస్ పోటీకి పరిగణించబడవు.

బహుమతులు:

1.     ఎడిటర్స్ ఛాయిస్ అవార్డు

మొదటి బహుమతి: 50,000/-

రెండవ బహుమతి: 30,000/-

మూడవ బహుమతి: 15,000/-

మొదటి 10 మంది విజేతలకు ప్రశంసా పత్రం మెయిల్ చేయడం జరుగుతుంది. మరియు వారి ముఖాముఖిని (ఇంటర్వ్యూ) ప్రతిలిపిలో ప్రచురించడం జరుగుతుంది.

12 భాషలలోని మా సంపాదకులు మరియు భాషా నిపుణుల బృందం, 2 విభాగాలలో ఎంట్రీలను ఖచ్చితంగా అంచనా వేసి విజేతలను ప్రకటిస్తాము. విజేతలను అన్ని భాషల రచనల నుండి నిర్ణయిస్తారు.

-భాష యొక్క నాణ్యత (శైలి, స్పెల్లింగ్ మరియు వ్యాకరణం)

-అంశం(కాన్సెప్ట్) నాణ్యత

పైన పేర్కొన్న విభాగాలలో మొత్తం సగటు ఆధారంగా, మేము అన్ని భాషలలో మొత్తం విజేతలను ఎంపిక చేస్తాము, తద్వారా మొదటి మూడు ఉత్తమ రచనలను ఎంపిక చేయడం జరుగుతుంది.

2.     రీడర్స్ ఛాయిస్ అవార్డు

మొదటి బహుమతి: 30,000/-

రెండవ బహుమతి: 15,000/-

మూడవ బహుమతి: 10,000/-

మొదటి 10 మంది విజేతలకు ప్రశంసా పత్రం మెయిల్ చేయడం జరుగుతుంది. మరియు వారి ముఖాముఖిని (ఇంటర్వ్యూ) ప్రతిలిపిలో ప్రచురించడం జరుగుతుంది.

ఈ అవార్డు రీడ్ కౌంట్ ఆధారంగా ప్రచురించడం జరుగుతుంది.

ప్రతిలిపిలో రీడ్ కౌంట్ గురించి:

-ప్రతిలిపిలో రీడ్ కౌంట్ చాలా ఖచ్చితంగా మరియు ప్రత్యేకంగా ఉంటుంది. ఒక పాఠకుడు మొత్తం సిరీస్ చదివితే అది 1 రీడ్ కౌంట్‌గా లెక్కించబడుతుంది.

-అదే రీడర్ అదే సిరీస్ మళ్లీ మళ్లీ చదవడానికి ప్రయత్నిస్తే, అది రీడ్ కౌంట్‌గా లెక్కించబడదు.

-రీడర్ సిరీస్ పై క్లిక్ చేసి, చివరి వరకు చదవకపోతే, అది రీడ్ కౌంట్‌గా లెక్కించబడదు.

మీరు ఒక కొత్త రచయిత మరియు మీరు ఈ అవార్డుకు అవకాశం పొందగలరా లేదా అని ఆందోళన చెందుతుంటే, దయచేసి చింతించకండి.

మా టీం ప్లాట్‌ఫాం బ్యానర్‌లో అన్ని ఎంట్రీలను ప్రదర్శిస్తుంది, తద్వారా పాల్గొనే ప్రతి ఒక్కరు ఈ అవార్డుకు సమాన అవకాశాన్ని పొందవచ్చు.

గమనిక: మీ రచన ఎక్కువ రీడ్ కౌంట్ పొంది, పైన చెప్పిన ఏదైనా నియమాన్ని పాటించకపోతే ఆ రచన పోటీకి పరిగణించబడదు.

ఉదాహరణకు: ఒక ఎంట్రీకి ఎక్కువ రీడ్ కౌంట్ లభించినా అది అసంపూర్తిగా ఉంటే (ఇది మా రూల్ నం. 9ని ఉల్లంఘిస్తుంది), అప్పుడు ఆ ఎంట్రీని ఈ అవార్డుకు పరిగణించరు.

పోటీలో పాల్గొన్నందుకు ప్రశంసా పత్రం:

 పోటీలో పాల్గొన్న రచయితలందరికీ ప్రశంసాపత్రం మెయిల్ చేయడం జరుగుతుంది.

మీరు ఈ పోటీలో పాల్గొనాలా, వద్దా అని ఇంకా ఆలోచిస్తున్నారా?!

అయితే, ఇక్కడ మా పోటీలలో పాల్గొన్నప్పుడు వారికి లభించే అదనపు ప్రయోజనాలను చదవండి:https://telugu.pratilipi.com/story/o0wsmtwhrakp

  ముఖ్యమైన తేదీలు :

        మీ రచనలను ప్రచురించడానికి చివరి తేదీ 30 సెప్టెంబర్ 2021.

పోటీకి వచ్చిన రచనల సంఖ్యను బట్టి, మేము ఎడిటర్స్ ఛాయిస్ మరియు రీడర్స్ ఛాయిస్ అవార్డుల ఫలితాల తేదీని నిర్ణయిస్తాము మరియు మీకు మెయిల్ ద్వారా తెలియజేయబడుతుంది. ఈ పేజీ దిగువన ఉన్న ‘పోటీ ముగింపు తేదీ’ సాంకేతిక రూపకల్పన సమస్య అని తెలుసుకోండి. మరియు మేము వీలైనంత త్వరగా దీన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము. అసౌకర్యానికి మన్నించాలి!

 ముఖ్యమైన సాంకేతిక సమాచారం:

1.     దయచేసి మీరు ప్రతిలిపి యాప్ యొక్క తాజా వెర్షన్‌ని ఉపయోగిస్తున్నారో లేదో నిర్ధారించుకోండి.

2.     మీ రచనను ప్రచురించేటప్పుడు, మీరు రచయిత ప్యానెల్‌లో ‘ప్రతిలిపి అవార్డ్స్’ వర్గాన్ని చూడలేకపోతే, దయచేసి మమ్మల్ని వీలైనంత త్వరగా మెయిల్ (events@pratilipi.com) ద్వారా సంప్రదించండి మరియు మా బృందం మీకు సహాయం చేస్తుంది.

3.   మీరు సబ్స్క్రిప్సన్ ప్రోగ్రామ్ క్రింద ఉన్న రచయిత అయితే, మీరు కూడా పోటీలో పాల్గొనవచ్చు. మా బృందం మీ ఎంట్రీని చదవగలదు, కాబట్టి దయచేసి దీన్ని ప్రోగ్రామ్ నుండి తీసివేయవద్దు.

4.     మీ రచనను వ్రాసేటప్పుడు మీరు రోజువారీ సిరీస్ ఫీచర్‌ని ఉపయోగించాలనుకుంటే, మీరు దీన్ని ఉపయోగించవచ్చు.

5.   ‘లీడర్‌ బోర్డ్’ అనేది పోటీకి సంబంధించినది కాదు. ఇది అన్ని విభాగాలతో అనుసంధానమై వుంటుంది కావున మీరు కంగారు పడవలసిన పని లేదు.

6.   మీరు ఈ పేజీ క్రింద ఉన్న ‘అన్ని ఎంట్రీలు’ శీర్షికను చూస్తున్నట్లయితే, ఇది కేవలం సాంకేతిక సమస్య మరియు దీనికి పోటీతో లేదా దాని ఎంట్రీలతో ఎటువంటి సంబంధం లేదు, ఇది ఏ సందర్భంలోనైనా ఖాళీగా ఉంటుంది మరియు మేము ‘అన్ని ఎంట్రీలు’ అనే టెక్స్ట్ తొలగించడానికి ప్రయత్నిస్తున్నాము. అసౌకర్యానికి చింతిస్తున్నాము.

పోటీ కోసం కొన్ని చిట్కాలు కావాలా?

ఇక్కడ క్లిక్ చేయండి:https://telugu.pratilipi.com/story/ql29rt3ps89q

ఏవైనా సమస్యలు, సందేహాలు లేదా ప్రశ్నలు ఉన్నాయా?

events@pratilipi.com మెయిల్ చేయండి మా బృందం మీకు సహాయం చేస్తుంది.

కాబట్టి మీరు దేని కోసం ఎదురు చూస్తున్నారు?

ఇప్పుడే పాల్గొనండి మరియు మీరు ప్రతిలిపి రైటర్స్ అవార్డ్స్ 2021ను గెలుచుకోండి.

మీ రచనా ప్రయాణాన్ని మాతో ప్రారంభించండి, ఆల్ ది బెస్ట్!

Leave a Reply

%d bloggers like this: