ఆగస్ట్ 15, 2021

75 ఏళ్ల లేత వయసులో

Posted in ముఖాముఖీ at 12:08 సా. by వసుంధర

మనది వేల సంవత్సరాల ఘనచరిత్ర, సంప్రదాయం.

ప్రాంతాలు, మతాలు, వర్ణాలు, కులాలు, భాషలు వ్యక్తులుగా మనని వేరు చేసినా- మనది భిన్నత్వంలో ఏకత్వమని గర్వపడుతూ- మనమంతా భారతీయులమనే చెప్పుకునేవాళ్లం.

కానీ మన భిన్నత్వంలో అనేకత్వాన్ని గుర్తించిన పరాయి పాలకులు- మనని తమకు బానిసల్ని చేసుకుని, మన సంపదను దోచుకున్నారు.

ఎలాగో 75 సంవత్సరాలక్రితం మనది స్వతంత్రభారతమైంది.

దేశాలకుండే ఆయువునుబట్టి- 75 సంవత్సరాలంటే లేత వయసే! భారతీయులు- తమని తాము ప్రాంతం, మతం, వర్ణం, కులం, భాష వగైరాలనుంచి విముక్తుల్ని చేసుకుని- భిన్నత్వాన్ని వ్యక్తికి పరిమితం చేసి, ఏకత్వాన్ని సమిష్టిగా ఆపాదించుకునేందుకు- ఈ లేత వయసు ఎంతో అనువైనది.

భారత దేశం స్వతంత్రమైంది. ఇక భారతీయులు స్వతంత్రులు కావాలి- అన్న నినాదం దేశమంతటా ప్రతిధ్వనించడానికి తగిన స్ఫూర్తి నేటి వేడుకలు దోహదం చేస్తాయని ఆశిద్దాం.

అందరికీ అక్షరజాలం స్వతంత్రదిన శుభాకాంక్షలు.

Leave a Reply

%d bloggers like this: