ఆగస్ట్ 21, 2021

‘నిశ్శబ్దపర్జన్యాలు’ నానీల సంపుటి ఆవిష్కరణ

Posted in పుస్తకాలు, సాహితీ సమాచారం at 12:20 సా. by వసుంధర

గుంటూరు జిల్లాలో తెలుగు ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న కవయిత్రి  శ్రీమతి సుభాషిణి ప్రత్తిపాటి గారు రచించిన ‘నిశ్శబ్దపర్జన్యాలు’ నానీల సంపుటిని ప్రముఖ కవి, నానీల ‌సృష్టికర్త ఆచార్య డా. ఎన్. గోపి గారు, వారి సతీమణి ప్రముఖ కవయిత్రి ఎన్. అరుణ గారు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా శ్రీ ఎన్. గోపి గారు మాట్లాడుతూ భావపురి కవయిత్రిగా నానీల తొలి సంకలనం వెలువరించిన శ్రీమతి సుభాషిణి నిబద్ధతకు, నానీల రచనా పటిమకు అభినందనలు తెలిపారు. మంచి కవయిత్రిగా పేరు తెచ్చుకోవాలని ఆశీర్వదించి, సత్కరించారు. ఈ కార్యక్రమ సమన్వయకర్తగా  నానీల వసంతం యువకవి శ్రీ కుడికాల వంశీధర్ పాల్గొన్నారు.

కవయిత్రి సుభాషిణి ప్రత్తిపాటి మాట్లాడుతూ నానీల సృష్టి కర్త ఆచార్య గోపి గారి ఆశీస్సులతో వ్రాసిన నానీల సంకలనాన్ని, రచనా వ్యాసంగంలో తనకు ప్రోత్సాహం అందించిన ప్రముఖ కవయిత్రి డా. సి. భవానీదేవి  గారికి అంకితం చేశానని, ఈ సంకలనంలోని నానీలు వివిధ దిన, వార,మాస పత్రికలతో పాటు అంతర్జాతీయ వనితా వెబ్ పత్రికలలో కూడా ప్రచురితమైనవని, వాటిని ‘నిశ్శబ్ద పర్జన్యాలు’  సంపుటిగా తీసుకువచ్చానన్నారు.
తన పుస్తకావిష్కరణ చేసిన  డా. ఎన్. గోపి, శ్రీమతి ఎన్. అరుణ దంపతులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కవయిత్రి సుభాషిణి, కొండ పి. వెంకట శేషయ్య, సాయి శరత్ చంద్ర, శశిధర్ పాల్గొన్నారు.

‘నానీల పర్జన్యాలు’ కొరకు రచయిత్రి శ్రీమతి ప్రత్తిపాటి సుభాషిణి గారిని సంప్రదించగలరు +91 8099305303

Leave a Reply

%d bloggers like this: