ఆగస్ట్ 21, 2021

భువి నుండి దివికి

Posted in బాల బండారం, మన కథకులు, సాహితీ సమాచారం at 1:23 సా. by వసుంధర

వాట్‍సాప్ బృందం బాలసాహిత్యపరిషత్ సౌజన్యంతో

ప్రముఖ బాలసాహితీవేత్త పుట్టగుంట సురేష్ కుమార్ శనివారం ఉదయం గచ్చీబౌలీ కేర్ ఆసుపత్రిలో 5:30కు గుండెపోటుతో మరణించారు. విజయవాడలో 9 డిసెంబర్ 1960న పుట్టారు. వీరి తల్లిదండ్రులు రంగనాయకమ్మ, సూర్య ప్రకాశరావు.

వీరు ఎంబిఏ చేసి సైకాలజీ, ఫిలాసఫీలలో పట్టా పొందారు. ఎంఎ ఇంగ్లీషు పూర్తి చేసి వృత్తిరీత్యా పిల్లలకు, పెద్దలకు ఆంగ్లం నేర్పిస్తూ క్రియేటివ్ రచనలు చేశారు. బాలల కోసం అనేక కథలు రాశారు. కొన్ని కథల్ని 1997 ఫిబ్రవరి 15న తికమక కథలు శీర్షికన వార్త పుస్తకాలుగా ప్రచురించారు. ‘వింత లడ్డూలు’ వీరి మొదటి కథ. ఆ తర్వాత ;చెక్కు చెదరని కొండ’ కథతో ప్రారంభమైన తమాషా కథలు వార్త దినపత్రికలో 3 మే 1997 నుంచి 21 డిసెంబర్ 2008 వరకు అంటే 11 సంవత్సరాలు ప్రతి ఆదివారం ధారావాహికంగా 591 కథల వరకు ప్రచురించబడటం విశేషం. అందుకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి సర్టిఫికేట్ అందుకున్నారు. తమాషా కథలు, గమ్మత్తుకధలు, మొసలి కన్నీరు బాలల కథలు, ఏ బలం గొప్పది?, బాలల కథలు, బబ తాతయ్య, అల్లరి చీమ అద్భుత యాత్ర వగైరా రచనలు చేశారు.
2011లో తమాషా కథలు పుస్తకానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి బాలసాహిత్య పురస్కారం అందుకున్నారు.
డాక్టర్ కుందేలు వైద్యరహస్యం, గాడిద చిట్కా , బాబోయ్ పోలీసులు అనే కథల్ని మహారాష్ట్ర ప్రభుత్వం- ఆరు, ఏడు తరగతి సరళభారతిలోప్రచురించారు. ఆంగ్లభాషపై పట్టు ఉండటంతో ఒక్క రోజులో ఇంగ్లీషు, స్పోకెన్ ఇంగ్లీషుకు అద్భుతపునాది, గడగడా ఇంగ్లీషు, పటాఫట్ వాక్యాబులరీ, నవ్వుతూ ఇంగ్లీషు నేర్చుకోండి, స్పోకెన్ ఇంగ్లీషు రహస్యాలు ప్రచురించారు. పిల్లలకు కథలు ఎలా రాయాలో చెప్పుతూ ఆంగ్లంలో ప్రచురించారు.
బాలసాహిత్య పరిషత్ సహాయ కార్యదర్శిగా సేవలందించిన పుట్టగుంట సురేష్ కుమార్ కు భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. పుట్టగుంట సురేష్ కుమార్ మృతికి బాలసాహిత్య పరిషత్ సంతాపం తెలియచేస్తోంది.

వారి గురించి గతంలో ప్రముఖ బాలసాహిత్యవేత్త శ్రీ పైడిమర్రి రామకృష్ణ వ్రాసిన వ్యాసం ఇక్కడ ఇస్తున్నాంః

Leave a Reply

%d bloggers like this: