ఆగస్ట్ 24, 2021

భూవినుండి దివికి

Posted in మన పాత్రికేయులు, సాహితీ సమాచారం at 3:54 సా. by వసుంధర

వాట్‍సాప్ బృందం బాలసాహితీశిల్పులనుండి

స్వతంత్ర ప్రభ దినపత్రిక సంపాదకుడు, నది మాసపత్రిక వార్తాపత్రికల సంపాదకుడిగా పనిచేసిన ప్రభాకర్ జలదంకిని కూడా కరోనా కబళించింది. ఈ తెల్లవారుఝామున నెల్లూరులో ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అయన కలం మూసేసారు. నది ప్రభాకర్ అంటే ఎక్కువ మందికి అయన తెలుసు. నది మాసపత్రికను ఆయన అత్యున్నత ప్రమాణాలతో నడిపారు. నదితో పాటే ఆయన పాత్రికేయ జీవితం ఆగిపోయినా పడిలేచిన అల లాగా తిరిగి స్వంతంగా స్వతంత్రప్రభ దినపత్రికను ప్రారంభించారు. ఇంకా ఏడాదైనా గడవకమునుపే అయన అర్థంతరంగా వెళ్లిపోయారు. ప్రొద్దున్నే పేపరు ఆలస్యం అయితే చికాకు పడుతున్నాం గానీ. ఆ పేపరు రావటానికి ఎందరు పాత్రికేయులు. ఎందరు ఉద్యోగులు కరోనాని ఎదుర్కొంటున్నారో., ఎందరు అసువులు బాస్తున్నారో… మరో పాత్రికేయుణ్ణి తెలుగు జాతి కోల్పోయింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. ఆయనకు ఘన నివాళి

Leave a Reply

%d bloggers like this: