ఆగస్ట్ 24, 2021

స్వతంత్ర భారతం- దేశభక్తి కథలుః ప్రతిలిపి

Posted in కథల పోటీలు, కథాజాలం at 6:20 సా. by వసుంధర

లంకె

నమస్తే..

ఆగష్టు నెల మూడ్ ఆఫ్ ది మంత్ పోటీలో భాగంగా స్వతంత్ర భారతం అనే శీర్షికతో  ప్రతిలిపి  మీ ముందుకు వచ్చింది. మన దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహానుభావులు ప్రాణత్యాగం చేసిన విషయం మనకు తెలుసు.  భారత దేశ స్వాతంత్ర్యానికి సంబంధించిన దేశభక్తి కథలను రాసి మన త్యాగమూర్తులకు అంకితం ఇవ్వండి. జై హింద్…

 మీరు మీ కథలను స్వీయప్రచురణ చేయడానికి ఈ క్రింది విధానాన్ని అనుసరించగలరు.

మీ రచనను స్వీయప్రచురణ చేయడానికి మీ ప్రొఫైల్ లో వెళ్ళి వ్రాయండి మీద క్లిక్ చేసి,కొత్తరచనను జోడించండి. శీర్షిక రాసి సంగ్రహం జతచేసి రచనను కొనసాగించి ప్రచురించండి. ఫోటోగ్యాలరీలో మీ కథకు తగ్గ ఫోటోని జోడించి, “విభాగం” అనే చోట “కథ” సెలెక్ట్ చేసి, వర్గం  అనే చోట “స్వతంత్ర భారతం” అనే వర్గం తో పాటు మీ కథకు తగ్గ  మరో రెండు వర్గాలను కూడా సెలెక్ట్ చేసి “నేను అంగీకరిస్తున్నాను” అని చివరగా ప్రచురించండి. ఈ పోటీ చివరి తేది ముగియగానే “స్వతంత్ర భారతం” అనే వర్గం తీసివేయడం జరుగుతుంది. కావున మీరు ” స్వతంత్ర భారతం ” అనే వర్గంతో పాటు మరో రెండు వర్గాలను  తప్పనిసరిగా సెలెక్ట్ చేసుకోవాలి. మీరు మీ కథలను స్వీయప్రచురణ చేసేటప్పుడు  ” స్వతంత్ర భారతం ” అనే వర్గాన్ని తప్పకుండా సెలెక్ట్ చేసుకోవాలి. అలా చేసిన కథలు మాత్రమే పోటీకి తీసుకొనబడతాయి. సంగ్రహం తప్పనిసరిగా జత చేయండి.

సంగ్రహం అంటే ఏమిటి?

మీ కథ ఏ అంశం మీద రాస్తున్నారు మరియు మీ కథ యొక్క పూర్తి సారాంశం మూడు వాక్యాలలో కథ మొదట్లో రాయాలి.

న్యాయనిర్ణేత అందించిన ఫలితాలు ఆధారంగా:-

1. మొదటి ముప్పై ఉత్తమ కథల లింక్ లను F.B లో ప్రచురిస్తాము. తద్వారా మీ ప్రొఫైల్ ఎక్కువ మంది పాఠకులకు తెలిసి,మీ రచనకు రీడ్ కౌంట్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.

2. మొదటి ముప్పై మంది రచయితలకు ప్రతిలిపి ప్రశంసా పత్రం మెయిల్ చేయడం జరుగుతుంది.

ముఖ్యమైన తేదీలు:

1. మీ కథలు స్వీయప్రచురణ చేయడానికి ప్రారంభ తేది : 6.ఆగష్టు.2021

2. మీ కథలు స్వీయప్రచురణ చేయడానికి చివరి తేది : 30.ఆగష్టు.2021

3. ఫలితాలు ప్రకటించే తేది : 6.సెప్టెంబర్.2021

నియమాలు :-

  • కథలు మీ స్వంతమై ఉండాలి.
  • ఇది వరకు ప్రతిలిపిలో ప్రచురించిన కథలు పోటీకి స్వీయప్రచురణ చేయరాదు. మరెక్కడైనా ప్రచురణ అయిన కథలు పోటీకి ప్రచురించవచ్చు.
  • పదహైదు(15) కథల వరకు పోటీకి స్వీయ ప్రచురణ చేయవచ్చు.
  • అక్షరదోషాలు లేకుండా చూసుకోవాలి.

సందేహాలకు :events@pratilipi.com కి మెయిల్ చేయగలరు.

Leave a Reply

%d bloggers like this: