ఆగస్ట్ 27, 2021

పోతన భాగవతం యాప్

Posted in కవితాజాలం, సాహితీ సమాచారం at 10:42 ఉద. by వసుంధర

వాట్‍సాప్ బృందం రంజని మిత్రులు సౌజన్యంతో

లంకె

వేలు ఖరీదు చేసే శ్రీ పోతన గారి భాగవతం ఉచితంగా ఒకే ఒక్క యాప్ లో . డౌన్ లోడ్ చేసుకోండి . ఈ యాప్ ఒక అద్భుతం.. తెలుగు వారు గర్వించే విధంగా .. దేశం లో మొట్టమొదటి సంపూర్ణ భాగవతం గ్రంధం ఆన్లైన్ లో తెలుగుదే కావడం విశేషం .. ఈ యాప్ లో 9000 పై చిలుకు పద్య గద్య లు ఉండటమే కాదు, అర్ధ ప్రతిపదార్ధాలతో పాటు పద్యాలు నేర్చువడానికి వీలుగా ఆడియో కూడా ప్రతి పద్యం క్రింద ఇవ్వడమంటే మాటలు కాదు. తన తరువాతి తరానికి భాగవతం అందాలని 57 సంవత్సరాలు వయసులో కంప్యూటర్ నేర్చుకుని , టైపింగు నేర్చుకుని 9000 పద్యాలు టైప్ చేసి, 7 సంవత్సరాలు కష్టపడితే వచ్చిందే ఈ యాప్ .. టైప్ చేస్తున్న సమయం లో మధ్యలో గుండెకు ఆపిరేషన్ జరిగిన .. కృష్ణుడి పై భారం వేసి ఈ అద్భుత గ్రంధాన్ని మనకి అందచేశారు.. మీరు డౌన్లోడ్ చేస్కోవడం వల్ల ఆయనికి డబ్బులు రావు, మీరు షేర్ చేయడం వల్ల ఆయనకి డబ్బులు రావు. యాప్ లో ప్రకటనలకు స్థానం లేదు.. అందరికి భాగవతం చేరవేయడమే ఆయన లక్ష్యం.. చివరిగా ఆయన పేరు సాంబశివరావు.

Leave a Reply

%d bloggers like this: