సెప్టెంబర్ 15, 2021

కథల పోటీ ఫలితాలు (అంచెలంచెలుగా)ః సినీవాలి

Posted in కథల పోటీలు at 10:45 ఉద. by వసుంధర

శ్రీమతి పివి శేషారత్నం సౌజన్యంతో

సినీవాలిచిన్నకథల_పోటీ

“సినీవాలి” నియమ నిబంధనల ప్రకారం, చిన్నకథల పోటీలో బహుమతి పొందిన మూడు కథలను, ఈ వారం ప్రచురిస్తున్నాము. మేమెప్పుడూ పోటీ ఫలితాలను ముందుగా ప్రకటించము. బహుమతి పొందిన రచనలను ప్రచురిస్తూ పోతుంటాము. రచయితలు వేచి చూడవలసిందే. దయచేసి ఈ విషయంలో ఎటువంటి సంప్రదింపులు చేయవద్దు. అలా చేయడం వలన మీరు బహుమతి పొందే అవకాశాలు తగ్గుతాయని గమనించండి.

ఆలస్యం జరిగిన మాట వాస్తవమే. కానీ, లెక్కకు మించి కథలు రావడంతో న్యాయనిర్ణేతలు మరింత వ్యవధి కోరడంతో ఈ ఆలస్యం. కానీ, డబ్బులు రెడీగా కూడా ఉన్నాయి.

ఈ పోటీకి బహుమతులను శ్రీ Naveen Pulluri,
సిన్ సినాటి, అమెరికా గారు వారి అమ్మ గారైన #శ్రీమతిపుల్లూరిజగదీశ్వరి, వరంగల్ గారి స్మృత్యర్థం స్పాన్సర్ చేస్తున్నారు. వారికి ‘సినీవాలి’ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తుంది.

చిన్న కథలంటే క్లుప్తంగా, భావం చెడకుండా, మనసుకు హత్తుకునేలా రాసిన రచయితలకు సినీవాలి పట్టం కడుతుంది. బహుమతి పోటీలో చెప్పినట్టుగా ఇరవై ఐదు కథలకే కాకుండా ఇంకా ఎక్కువ బహుమతులు ఇవ్వడానికి కూడా మేం సిద్ధం.

బహుమతి పొందిన ప్రతీ చిన్న కథకు రూ. 500/ శుక్రవారం ఉదయం గూగుల్ లేదా ఫోన్ పే చేయబడును. మీరు గూగుల్/ఫోన్ పే నెంబరు ఇవ్వకుంటే వెంటనే పంపించగలరు

ఈ వారం బహుమతి పొందిన చిన్న కథలు:

{1}#అంతిమ_జైత్రయాత్ర: అలేఖ్యా రవికాంతి
{2}#అవ్యక్తరాగం: పీ. వీ. ఆర్. శివకుమార్
{3}#బ్రతుకుతెరువు: చెన్నూరు సుదర్శన్

విజేతలందరికీ అభినందనలు!
కాబోయే విజేతలకు శుభాకాంక్షలు!

Leave a Reply

%d bloggers like this: