సెప్టెంబర్ 16, 2021

ఆహ్వానంః అష్టావధానంలో పృచ్ఛకులకు

Posted in భాషానందం, సాహితీ సమాచారం at 9:19 సా. by వసుంధర

నమస్కారము..
 కొత్త అవధానితో కార్యక్రమం అనుకుంటున్నాము. ఇంకా ఖరారు కాలేదు.  అష్టావధానంలో పాల్గొనదలచినవారికి ఆహ్వానము ..  మీరు స్వయంగా పాల్గొనవచ్చు/ మీకు తెలిసినవారికి పంపవచ్చు.

2021 అక్టోబర్ లో  నవరాత్రుల్లో కాకుండా    ఏదో ఒకరోజు .. బహుశా శని/ ఆదివారం   (భారత కాలమానం ప్రకారం 17:10-19:53) ఆన్లైన్ లో జరుగనున్న అష్టావధానం కార్యక్రమానికి ప్రాశ్నికులుగా ఉండదలచినవారు తమ వివరాలను క్లుప్తంగా vikramkumar.volunteer@gmail.com 8331926163 కి పంపగలరు
ప్రస్తుతం 8 మందికి అవకాశం ఉంటుంది.  మీరు ఎలాంటివి అడుగుతారో  రెండు నమూనా ప్రశ్నలు పంపగలరు.
 పాఠశాల విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరౌతారు.. కనుక వినతగినవే అడుగవలెను.    హంగూ ఆర్భాటాలు ఉండవు. ఉదాత్తమైన అంశాలతో మొదటి సారి అవధానం చూస్తున్నవారికి ఈ ప్రక్రియ పట్ల కుతూహలం కలిగేలా భాషా సాహిత్యాలపై గౌరవం కలిగేలా నిర్వహించాలని సంకల్పం.

ప్రాశ్నికులకు  నియమాలు..
సమయపాలన చేయవలసి ఉంటుంది.మీకు ఇంటర్నెట్ _ కరెంటు లేకపోవడం వంటి ఇబ్బందులు ఉండరాదు. ఆన్లైన్ లో  పాల్గొనటానికి తగినంత సాంకేతిక పరిజ్ఞానం కూడా ఉండాలి. 
అనవసర ప్రసంగాలు వలదు(అప్రస్తుత ప్రసంగం చేసేవారు సైతం ఔచిత్యవంతంగా అడుగవలె)
 స్వోత్కర్షలు/ సాగతీత / చౌకబారు వ్యవహారం నిషేధం.

జాతీయ సమైక్యత/  సర్వమానవ సౌభ్రాతృత్వం/  జీవ కారుణ్యం వంటి  ఉదాత్తమైనవిగా ఉండాలి  ప్రశ్నలు / జవాబులు 
మరీ ఎక్కువ మంది తమ వివరాలు పంపితే భవిష్యత్తులో చేసే కార్యక్రమాలకు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.
 ధన్యవాదములు—-

పద్యాల విక్రమ్ కుమార్ 

8331926163

www.linkedin.com/in/विक्रम-విక్రమ్-vikram-कुमार-కుమార్-kumar-85424172

Leave a Reply

%d bloggers like this: