సెప్టెంబర్ 17, 2021

కెనడా- అమెరికా తెలుగు సాహితీ సదస్సు

Posted in సాహితీ సమాచారం at 10:34 ఉద. by వసుంధర

వాట్‍సాప్ బృందం సాహిత్య సమాచారకలశం సౌజన్యంతో

మిత్రులారా,
ఈ నెల ..అనగా సెప్టెంబర్ 25-26, 2021 తేదీల్లో జరుగుతున్న ““మొట్టమొదటి కెనడా తెలుగు సాహితీ సదస్సు & 12వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు” కి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్రపంచంలో అతి పెద్ద దేశాలు అయిన కెనడా- అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నివసిస్తున్న సాహితీవేత్తలు అనేక సాహిత్యపరమైన అంశాల మీద ప్రసంగించనున్నారు. తెలుగు సినీ రంగానికి చెందిన సర్వశ్రీ కె. బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, భువన చంద్ర, సుద్దాల అశోక్ తేజ, బలభద్రపాత్రుని రమణి మొదలైన లబ్దప్రతిష్టులు ఈ చరిత్రాత్మక సదస్సులో ప్రత్యేక ప్రసంగాలు చేయనున్నారు.

సుమారు 100 మంది వక్తలూ, 30 మంది అనుభవజ్ఞులైన వేదిక నిర్వాహకులూ, అత్యంత సమర్ధవంతమైన సాంకేతిక నిపుణులూ, 12 ప్రసంగ వేదికలలో నిర్వహించబడుతున్న ఈ సదస్సు ఆసక్తికరమైన ప్రసంగాలు, 12 పుస్తకావిష్కరణణలు, చర్చా వేదికలు, సరదా సాహిత్యం పోటీలతో రెండు రోజుల పాటూ 20 గంటలు జరుగుతుంది. ఆసక్తిఉన్న వారు వారి నెట్టింటి నుంచే, ఉత్తర అమెరికా ఖండంలో తెలుగు సాహిత్యవికాసాన్ని ఉచితంగా ఈ సదస్సుని వీక్షించి ఆనందించమని కోరుతున్నాం.

ఈ సదస్సులో జరిగే అన్ని విశేషాలూ జతపరిచిన సమగ్ర ప్రకటనలో చూడండి. మీరు వీక్షించే లంకెలు ఈ క్రింద ఇచ్చాం.
రెండు రోజుల సదస్సు ప్రత్యక్ష ప్రసారం చూసే లింక్ లు
సదస్సు ప్రారంభ సమయాలు
ఉదయం 9:00 AM టొరంటో సమయం (EST), భారత దేశ సమయం సాయంత్రం 6:30 pm)
September 25, 2021
YouTube: https://bit.ly/3zcq0O1
Facebook: https://bit.ly/2WhVfsA
September 26, 2021
YouTube: https://bit.ly/3mjgLYS
Facebook: https://bit.ly/3khBrxO
సదస్సులో అన్ని ప్రసంగాలూ వినడమే కాకుండా మీ అమూల్యమైన అభిప్రాయాలని పంచుకుంటూ స్పందించి ఆయా వక్తలని ప్రోత్సహించండి.

భవదీయులు,

సదస్సు కార్యనిర్వాహక వర్గం
లక్ష్మీ రాయవరపు (టొరంటో, కెనడా): sadassulu@gmail.com
వంగూరి చిట్టెన్ రాజు (హ్యూస్టన్, టెక్సస్, USA): vangurifoundation@gmail.com
త్రివిక్రమ్ సింగరాజు (కెనడా): triv.sing@gmail.com
శాయి రాచకొండ (USA): sairacha@gmail.com

Leave a Reply

%d bloggers like this: