Site icon వసుంధర అక్షరజాలం

పురస్కారం

వాట్‍సాప్ బృందం సాహితీపల్లవం సౌజన్యంతో

రంగనాథ రామచంద్రరావు గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు
“బాలసాహిత్యాభివృద్ధికి పత్రికలు, రచయితలు, అకాడమీలు ఇంకా ఎంతో కృషి చేయాలి. రాష్ట్రంలోని అన్నిప్రాంతాల నుండి ముఖ్యంగా గ్రామాల్లో పెద్దలు, పిల్లల నుండి బాలసాహిత్యానికి సంబంధించిన కథలు సేకరించి వాటికి మెరుగులు దిద్ది తెలుగులోకి అనువదించి తెలుగు బాలలకు అందించాలి” అంటారు రంగనాథ రామచంద్రరావు.

కర్నూలు జిల్లా ఆదోనిలో శ్రీమతి అన్నపూర్ణ, శ్రీ రఘునాధరావు దంపతులకు 28 ఏప్రిల్ 1953న జన్మించారు. బీఎస్సీ, ఎం.ఏ (ఆంగ్ల), బీ, ఈడీ చేశారు. ఉపాధ్యాయుడిగా పదవీ విరమణ చేశారు.

రంగనాధ రామచంద్రరావు బాలల కోసం ఎన్నో రచనలు చేశారు. కొన్నింటిని పుస్తకాలుగా ప్రచురించారు. గొప్ప త్యాగం (కథల సంపుటి), ఎత్తుకు పై ఎత్తు (కథల సంపుటి), సుచిత్ర శ్రీ రాఘవేంద్రస్వామి చరిత్ర, గవర్నర్ పిల్లి (దేశదేశాల జానపద కథలు) అద్భుత మంత్రం (దేశదేశాల జానపద కథలు), ‘తోకవచ్చె కత్తి పోయే ఢాం ఢాం ఢాం’ బాలల కథలు అనే పుస్తకాలు ప్రచురించారు. అంతేకాదు… గడుసు భార్య (జానపదకథలు), సిందాబాద్ సాహసయాత్రలు, గలివర్ సాహసయాత్రలు, అలీబాబా నలభై దొంగలు, అల్లావుద్దీన్-అద్భుత దీపం, శ్రీమతి విజయలక్ష్మీ పండిట్ పుస్తకాలు బాలల కోసం ప్రచురణకు సిద్ధం చేశారు. రంగనాథ రామచంద్రరావు అనేక కలం పేర్లతో రచనలు చేశారు. సూర్యనేత్ర, స్వప్నమిత్ర, రంగనాధ, మనస్విని, నిగమ కలం పేర్లతో ఇప్పటి వరకు 300 కు పైగా వివిధ ప్రక్రియల్లో రచనలు, 250కు పైగా అనువాద కథలు, 140కి పైగా బాలల కధలు, 70కి పైగా సొంత కథలు అందించారు.

విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ‘గవర్నర్ పిల్లి’ పిల్లల నీతికథలు ప్రచురించింది.

Exit mobile version