సెప్టెంబర్ 25, 2021

కెనడా-అమెరికా తెలుగు సాహితీ సదస్సు

Posted in సాహితీ సమాచారం at 6:29 సా. by వసుంధర

మిత్రులారా,

రేపూ, ఎల్లుండీ…   అనగా  సెప్టెంబర్ 25-26, 2021 (శనివారం, ఆదివారం) తారీకులలో కెనడా ప్రధాన కేంద్రంగా అంతర్జాలంలో జరుగుతున్న “మొట్టమొదటి కెనడా తెలుగు సాహితీ సదస్సు  & 12వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు”  ప్రత్యేక తెలుగు భాషా, సాహిత్య సమావేశానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం.

ఎంతో ఆహ్లాదాన్నీ, సాహిత్యపు విందునీ, విజ్ఞానాన్నీ ఉచితంగా మీకు అందజేయాలని సుమారు 30 మంది నిర్వాహకులూ,  సాంకేతిక నిపుణులూ, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, తెలుగు తల్లి (కెనడా) మొదలైన ఎనిమిది  సంస్థలూ, సుమారు 100 మంది వక్తలూ పాల్గొంటున్న ఈ చరిత్రాత్మక  సదస్సు గాన గంధర్వుడు ఎస్. పీ. బాల సుబ్రమణ్యం గారికి అంకితం. ప్రత్యేక అతిధులుగా సర్వశ్రీ కె. బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, భువన చంద్ర, సుద్దాల అశోక్ తేజ, బలభద్రపాత్రుని రమణి మొదలైన లబ్దప్రతిష్టులు ఆసక్తికరమైన ప్రసంగాలు చేయనున్నారు. 

రెండు రోజుల సదస్సు ప్రత్యక్ష ప్రసారం చూసే లింక్ లు

Face Book (2 రోజులు): https://bit.ly/3lN0yt7

September 25, 2021

YouTube: https://bit.ly/3zcq0O1

September 26, 2021

YouTube: https://bit.ly/3mjgLYS

ఈ సదస్సులో పాల్గొంటున్న ప్రముఖులూ, వక్తలూ, తదితర విశేషాలతో పొందుపరిచిన ప్రకటన, 12 వేదికలలో పాల్గొంటున్న వక్తలూ, వారి ప్రసంగాంశాలూ పొందుపరిచిన సమగ్ర కార్యక్రమం  జతపరిచాం….మీ కోసం…..

భవదీయులు,

వంగూరి చిట్టెన్ రాజు, లక్ష్మి రాయవరపు, త్రివిక్రమ్ సింగరాజు, శాయి రాచకొండ

కార్యనిర్వాహక సభ్యులు 

Leave a Reply

%d bloggers like this: