సెప్టెంబర్ 26, 2021

కవితలకు ఆహ్వానం

Posted in కవితల పోటీలు, సాహితీ సమాచారం at 12:18 సా. by వసుంధర

శ్రీమతి పివి శేషారత్నం సౌజన్యంతో

యానాం శాసనసభ్యునిగా, పుదుచ్చేరీ శాసన సభాపతిగా విశేష సేవలందించిన శ్రీ కామిశెట్టి శ్రీ పరశురామ వరప్రసాద్ రావు నాయుడు గారి శతజయంతి ఉత్సవం 2 అక్టోబర్ 2021 తేదీన ఘనంగా నిర్వహించేందుకు తలపెట్టారు. ఈ సందర్భంగా ఔత్సాహిక కవులకు కవితల పోటీ నిర్వహించదలిచాము. కావున ఈ క్రింది అంశాలలో ఒకదానిపై 30 లైన్లు దాటకుండా కవిత రాసి పోటీ నిర్వాహకులు శ్రీ దాట్ల దేవదానం రాజు గారికి 27 సెప్టెంబర్, 2021సాయంత్రం 4 గం. లోపు 9440105987 నెంబర్ కు వాట్సాప్ లో గానీ, A4 కాగితం పై రాసి గానీ నేరుగా
ఉదయిని
8-1-048, 2 వ క్రాస్,
జిక్రియా నగర్, యానాం-533464 చిరునామాలో
‘మీ స్వీయ రచన అని హామీ పత్రం తో జతచేసి సమర్పించగలరు.

అంశములు:

  1. శ్రీ కామిశెట్టి పరశురాం గారి వ్యక్తిత్వం
  2. రాజకీయం-నైతికత
  3. సామాజిక సేవ
    (2, 3 అంశాలు శ్రీ కామిశెట్టి గారి గురించి తెలియనివారు కూడా రాసేందుకు ఇచ్చాము. )

ఈ సమాచారాన్ని మీకు తెలిసిన కవులకు కూడా పంపమని కోరుతున్నాము.
పోటీలో విజేతలకు 2-10-21 తేదీన ఉదయం 10 గంటలకు గీతామందిరం, కామిశెట్టి వారి వీధి, యానాం నందు నగదు బహుమతులు ప్రదానం చేయబడును.

ప్రథమ : ₹ 3,000
ద్వితీయ: ₹ 2,000
తృతీయ: ₹ 1,000
ప్రోత్సాహక: ₹500/-

  • శ్రీ కామిశెట్టి శ్రీ పరశురామ వరప్రసాద్ రావు నాయుడు
    శతజయంతి ఉత్సవ కమిటీ, యానాం
    20-09-21

Leave a Reply

%d bloggers like this: