సెప్టెంబర్ 27, 2021

కవులు అమ్ముడు పోతున్నారా?

Posted in రచనాజాలం, సాంఘికం-రాజకీయాలు, సాహితీ సమాచారం at 1:12 సా. by వసుంధర

ఆంధ్రజ్యోతి దినపత్రిక సౌజన్యంతో

కవులకైనా, ఎవరికైనా పురస్కారాలు ఒక గుర్తింపు. గుర్తింపుకి కారణం ఆశ్రయింపు కూడా కావచ్చు. కానీ పురస్కారం ప్రతిభకు మాత్రమే!

అవార్డులు వచ్చినవారిలో అమ్ముడు పోయినవారు ఉంటే ఉండొచ్చు. కానీ ఆ మాట అవార్డులు స్వీకరించినవారూ, అవార్డులు రానివారూ అనడం సబబు కాదు. అవార్డులు వచ్చినవారిని అభినందించగలిగితే అభినందిద్దాం. చిన్నబుచ్చడంవల్ల- ఒక వేలే అటు. మిగతా నాలుగు వేళ్లూ మనవైపే!

అవార్డులు ఎందుకు, ఎలా వచ్చాయీ అన్నది చర్చనీయాంశమే కాకూడదు. అవార్డులతో ముడిపెట్టకుండా ప్రతిభను ప్రతిభ పరంగానే చర్చించడం సాహిత్యంలో సత్సాంప్రదాయమౌతుంది.

Leave a Reply

%d bloggers like this: