సెప్టెంబర్ 29, 2021

వేదపండితులకు జాతీయ సదస్సు

Posted in సాహితీ సమాచారం at 8:45 సా. by వసుంధర

శ్రీమతి పివి శేషారత్నం సౌజన్యంతో

వేదపండితులకు విజ్ఞప్తి: మీ అందరికీ ఒక సువర్ణావకాశం : On line జాతీయ సదస్సు. మన వేదాలలో ఈ దిగువ PDF లో పేర్కొన్న 30 అంశములలో ఏ ఒక్క అంశముగూర్చైనా, ఏ వేదంలో? ఎక్కడ? ఏవిధంగా? చెప్పబడింది మూడు భాషలలో సంస్కృతం (దేవనాగరి నాగరిలిపి), హిందీ, ఆంగ్ల భాషలలో ఏ భాషలోనైనా సరే, ముందుగా 300 పదాలు (మాటలు-words) సంక్షిప్త పాఠం (Abstract) 30-09-2021లోపు, తదుపరి పూర్తి పాఠం (Full Paper) 3000 నుండి 5000 పదాలు (మాటలు-words) తేదీ 12-10-2021 లోపు పంపాలి. PDF లో ఉదహరించిన Fonts మాత్రమే ఉపయోగించాలి. కేవలం రూ500/- ప్రవేశ రుసుముతో మీరు ఉన్న చోటునుండే ONLINE సదస్సులో పాల్గొనవచ్చు. మీకు ఒక E.Mail చిరునామా ఉండాలి. (అది సుళువుగా పొందవచ్చు) సదస్సు తేదీలు: 2021, అక్టోబరు 23, 24 & 25 . మీరు పంపిన పూర్తి పత్రము (వేద ప్రమాణంగా, సోదాహరణంగా, నవ్యంగా ఉంటే) సదస్సు అనంతర ప్రచురణకు ఎంపికైతే అది జాతీయ స్థాయిలో వినుతికెక్కుతుంది. మీ ప్రతిభ ఇనుమడిస్తుంది. మనవేదాలలో ఉన్న అనేక నిఘూడమైన విశేషాలు మీ కృషి ద్వారా మొత్తం భారతదేశం అంతటా వెల్లడౌతుంది. దయచేసి ప్రయత్నించండి. “వేద -విజ్ఞానం” మన సమాజానికి అందించేందుకు మీ వంతు కృషిచేయమని నా మనవి. ౼వేంకటేశ్వర్లు పెండ్యాల, (విశ్రాంత ‘ఎండోమెంట్స్’ ఉద్యోగి) విశాఖపట్టణము.

Leave a Reply

%d bloggers like this: