సెప్టెంబర్ 29, 2021

కథానికలపోటీ

Posted in కథల పోటీలు at 8:41 సా. by వసుంధర

వాట్‍సాప్ బృందం సాహిత్య సమాచారకలశం సౌజన్యంతో

కథానికలపోటీ

 • * **
  నేను 95 వ సంవత్సరం లోకి అడుగిడబోవు సందర్భంగా
  నవ్యసాహితీసమితి విజయవాడశాఖ కథానికలపోటీ నిర్వహిస్తోంది
  అంశం: సామాజిక రుగ్మతలు – పరిష్కారాలు
  నియమ నిబంధనావళి
 1. తెలుగులో చదవగల, వ్రాయగలవారెవ్వరైనా ఈ అంశంపై చక్కని కథని ఎ4 సైజులో 3
  పేజీలలో టైప్ చేసి ఇమెయిల్ చేయవచ్చును
 2. ఇదివరలో ప్రచురింపబడిన కథ నిషేధం
 3. రాజకీయ, వ్యక్తిగత దూషణ ఇత్యాది అసాంఘిక విమర్శనలు, ఘటనలు నిషేధం
 4. రచనలు తెలుగు యూనికోడ్ లిపిలో టైపుచేసి kadhalapoti.95@gmail.com కు
  Text formst లో email చేయవలెను
  పిడిఎఫ్ గా కాని స్కాన్ చేసి గాని అటాచ్ చేయవద్దు. చేతివ్రాత ప్రతులు నిషేధం.
 5. కథ ప్రారంభములో ఈవిధముగా వ్రాయవలెను
  కథానికలపోటీ
  అంశం: సామాజిక రుగ్మత – పరిష్కారాలు
  కథ:
  రచన: (రచయిత పేరు, వూరు, సెల్ నెంబరు)
 6. కథలను 20 నవంబరు 2021 సాయంత్రం 6 గంటలకు గాని, ఆలోగాకాని పోస్ట్ చేయవలెను
 7. దయచేసి ఒక్కరు ఒక కథ మాత్రమే పోస్టుచేయవలెను.
 8. న్యాయనిర్ణేత ఎంపికచేసిన ప్రధమ, ద్వితీయ, తృతీయ విజేతలకు వరుసగా
  సుమారు మూడువేలు, రెండువేల అయిదువందలు, రెండువేల రూపాయలు బహుమతిగా
  ప్రదానం చేయబడును
 9. న్యాయనిర్ణేత ఎంపికపై ఎట్టి అభ్యంతరములు అంగీకరింపబడవు. వాదోపవాదములకు తావులేదు
  న్యాయనిర్ణేత ఎంపికచేసిన విజేతలపేర్లు 2021 డిసెంబరు 20 వతేదీన ప్రకటింపబడును
  బహుమతులు నా 95 వ జన్మదినమున 2021 డిసెంబరు 25 న పంపబడును
 10. అవసరమైనచోఈనియమ నిబంధనలలో మార్పులు చేర్పులు చేయబడును.
  భవదీయుడు
  కాలనాధభట్టవీరభద్రశాస్త్రి
  అధ్యక్షులు
  2021 సెప్టెంబరు 29

Leave a Reply

%d bloggers like this: