సెప్టెంబర్ 30, 2021

తర్జని కథల పోటీ గడువు పెంపు …

Posted in కథల పోటీలు at 10:17 ఉద. by వసుంధర

శ్రీమతి పివి శేషారత్నం సౌజన్యంతో

తర్జని కథల పోటీ గడువు పెంపు …
ఔత్సాహిక రచయితల కోరిక మేరకు
తర్జని” వెబ్సైటు ప్రధమ వార్షికోత్సవం సందర్భంగా సస్పెన్స్ /థ్రిల్లర్ కథల పోటీ నిర్వహిస్తోంది. ఎంపికైన ఉత్తమ కథలకు ప్రధమ బహుమతి 5 వేల రూపాయలు .. ద్వితీయ బహుమతి 3 వేల రూపాయలు .. తృతీయ బహుమతి 2 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించాం. బహుమతి పొందని కథలను సాధారణ ప్రచురణకు స్వీకరిస్తాం.
కథ నిడివి 600 పదాలకు మించకుండా ఉండాలి. యూనికోడ్ లో టైపు చేసి కింది మెయిల్ ఐడీ కి పంపాలి. కథ చివరిలో రచన తన సొంతమని రచయిత హామీ ఇవ్వాలి. వేరే పత్రికలలో ..వెబ్ పత్రికల్లో .. సోషల్ మీడియాలో ప్రచురితమైన కథలను పంపకూడదు. ఒక రచయిత రెండు కథలకు మించి పంపకూడదు.
వాదవివాదాలకు తావులేదు. ప్రధమ బహుమతికి అర్హమైన కథలు రానపుఁడు .. ఆ బహుమతి సొమ్మును న్యాయనిర్ణేత ల సూచన మేరకు పంపిణీ చేస్తాం. మంచి కథలు వస్తే సంకలనం తెచ్చే యోచన కూడా ఉంది.
మీరు రాయండి. మీ స్నేహితులకు చెప్పండి. ఈ పోస్ట్ ఫార్వర్డ్ చేయండి. ఈ కార్యక్రమానికి చేయూత నివ్వండి.
మీ కథలు పంపాల్సిన మెయిల్ చిరునామా …… tharjani.murthy@gmail.com …. అక్టోబర్ 15 వ తేదీ లోగా మీ కథలు అందాలి.
ఇంకా ఏమైనా సందేహాలుంటే 9949723777 కి ఫోన్ చేయవచ్చు

Leave a Reply

%d bloggers like this: