సెప్టెంబర్ 30, 2021

సాహితీ విశేషాలు

Posted in సాహితీ సమాచారం at 6:32 సా. by వసుంధర

శ్రీమతి పివి శేషారత్నం సౌజన్యంతో

కవి మిత్రులందరికీ శుభసాయంత్రం.
పర్యావరణ కవిసమ్మేళనం విజేతల వివరాలు ఇవాళ ప్రకటించాల్సి ఉంది. వివిధ కారణాల వల్ల (పాల్గొన్న కవుల సంఖ్య దాదాపు 400, పండుగలు, ఇతరత్రా) న్యాయనిర్ణేతలు మరొక 10-15 రోజులలో ఫలితాలు అందిస్తామని తెలిపారు.

అట్లే ఇంత పెద్ద బృహత్కార్యానికి పూనుకున్న మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత పబ్లిక్ సర్వీస్ కమీషన్ మెంబర్ శ్రీ ఆర్. సత్యనారాయణ గారు పాత్రికేయులకు కూడా కథనాల పోటీ ఏర్పరచారు. వాటికి చెందిన సంకలనం, మన పర్యావరణ చైతన్య కవితా సంకలనం ఒకేరోజున ఆవిష్కరిద్దామని నిర్ణయం చేశారు.

ఫలితాలు ప్రకటించిన తదుపరి ఆవిష్కరణోత్సవం ఉంటుందని తెలుపుతున్నాం.
గౌరవ సంపాదకులు & సంపాదక మండలి పక్షాన..

  • అవుసుల భానుప్రకాశ్.

Leave a Reply

%d bloggers like this: