అక్టోబర్ 4, 2021

దీపావళి కథల పోటీ 2021- లేఖిని

Posted in కథల పోటీలు at 10:48 ఉద. by వసుంధర

వాట్‍సాప్ బృందం హాస్యానందం సౌజన్యంతో

‘లేఖిని’ రచయిత్రుల వేదిక దీపావళి కథల పోటీ 2021.

నవంబర్ 4 వ తేదీ, గురువారం దీపావళి సందర్భంగా ‘లేఖిని’ రచయిత్రుల వేదిక, చిన్న కథల పోటీ నిర్వహిస్తున్నది. ఉత్సాహవంతులైన రచయిత్రులందరూ ఈ పోటీలో పాల్గొని విజయవంతం చేయగలరు.

పోటీలో పాల్గొనేవారు DTP లో మూడు పేజీలకు మించకుండా పేజీకి ఒకవైపున మాత్రమే రాయాలి.

అంశం ఏదైనా తీసుకోవచ్చు. కాకపోతే, కథ తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేది అయి ఉండాలి.

విధిగా హామీ పత్రం జోడించాలి. పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్ హామీపత్రంలో ఉండాలి.

కథలు పంపవలసిన ఆఖరి తేది అక్టోబర్ 15, అర్థరాత్రి పన్నెండు గంటలు.

విజేతలకు నవంబర్ 6 వ తేది త్యాగరాయ గానసభలో జరిగే సభాకార్యక్రమంలో బహుమతి ప్రదానం ఉంటుంది.

విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇవ్వబడతాయి.

ప్రథమ బహుమతి: ₹ 1500/-

ద్వితీయ బహుమతి: ₹ 1116/-

మూడవ బహుమతి: ₹ 750/-

యువరచయిత్రులకు నాలుగు ప్రోత్సాహక బహుమతులు ఉంటాయి.

కథలు పంపవలసిన email : tojayalakshmi@gmail.com.

9951250144 no కి వాట్సాప్ లో కూడా పంపవచ్చు.

ఈ పోటీకి సంబంధించి వాదోపవాదాలు , ఉత్తరప్రత్యుత్తరాలు అంగీకరింపబడవు.

Leave a Reply

%d bloggers like this: