అక్టోబర్ 5, 2021

నవలల పోటీ: సాహితీ సిరికోన

Posted in కథల పోటీలు at 12:35 సా. by వసుంధర

శ్రీమతి పివి శేషారత్నం సౌజన్యంతో

సాహితీ సిరికోన ప్రకటన
🌹🌹🌹🌹🌹🌹🌹
🌻 2021 జొన్నలగడ్డ రాంభొట్లు-సరోజమ్మ స్మారక ‘సిరికోన నవలల’ పోటీ🌻

   వస్తు నిర్దేశం

ద్వై సాంస్కృతిక (డయస్ఫోరా) ఇతివృత్తం పై వర్తమాన సామాజిక నవలల పోటీ

వివిధ దేశాలకు ఉద్యోగరీత్యా తరలి వెళ్లి అక్కడ స్థిరపడ్డ తెలుగు భారతీయులు, ఆ దేశ సంస్కృతిలో ఇమిడిపోతున్న- లేదా- ఇమిడిపోలేక సంఘర్షిస్తున్న జీవన అనుభవాల చిత్రణ.
లేదా
వారిని చూడడానికో, వారితో కలిసి ఉండటానికో వెళ్లిన వారి పెద్దల అంతస్సంఘర్షణ
లేదా
పరదేశీయ సమాజంలో తమ సాంస్కృతిక అస్తిత్వాన్ని,గుర్తింపును నిలబెట్టుకోడానికి పడుతున్న తపన
ఇలాటివేవైనా ఇతివృత్తం కావచ్చు…

రెండు సంస్కృతుల సన్నికర్ష-సంఘర్షణ- సందేశం ప్రధాన విషయంగా ఉండాలి
(అందులో ఒకటి విధిగా తెలుగు భారతీయ సంస్కృతి కావాలి. మరొకటి మరో ఏ దేశ సంస్కృతి అయినా కావాలి.)

💜 1. పురస్కారం మొత్తం రూ.25000/=(ఇరవై ఐదు వేల రూపాయలు)💜
🛑 2. రచనల సమర్పణకు ఆఖరు తేదీ 2022 మార్చి 1వ తేదీ 🛑

🌻 ఇతర వివరాలు 🌻

 1. ముద్రణలో రెండు వందల పుటల వరకు ఉండాలి.
 2. యూనికోడ్ 14pt.లో dtp చేయబడాలి.
  3.ఉగాదికి పోటీ ఫలితాలు ప్రకటింపబడతాయి.
 3. ఫలితం ప్రకటిస్తున్నప్పుడే పదివేల రూ౹౹లు వారి అకౌంటుకు పంపడం జరుగుతుంది. ముద్రణ అయ్యాక మిగిలిన 15,000 రూ. లను సముచిత సత్కారంతో పాటు అందచేయబడుతుంది.
  5.మొదటి అట్ట వెనుక, ఫలానా పురస్కారం పొందుతున్న రచన అని విధిగా ముద్రించాలి.
  6.పురస్కారం పొందిన వెంటనే నవలను సిరికోనలో సీరియల్ గా సమర్పించాలి.

ఇతర వివరాలకు:

 1. గంగిశెట్టి లనా
  (+1) 341 356 1093 (US)
  gangisetty.ln@ gmail.com
 2. సుబ్బు జొన్నలగడ్డ:
  (+1) 214 -621-1790 (US)
 3. జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి
  (+91) 99488 96984 (భారత్)
  🙏🌻🌻🌻🌹🌼🌹🌻🌻🌻🙏

Leave a Reply

%d bloggers like this: