అక్టోబర్ 16, 2021

కథల వర్షంః ప్రతిలిపి పోటీ

Posted in కథల పోటీలు at 4:27 సా. by వసుంధర

లంకె

కథల వర్షం

కథల వర్షం పోటీకి స్వాగతం. ప్రస్తుతం వర్షాలు ఎక్కువగా పడుతుండటం వలన మనం ఇంటి నుండి బయటికి వెళ్ళే అవకాశం చాల తక్కువగా వుంటుంది.  అంటే వర్షం మనకు కొంత సమయాన్ని ఇంటివద్ద గడపడానికి అవకాశం ఇస్తోందన్న మాట!

మరి… వర్షాన్ని చూస్తూ మీ మనసును ఆహ్లాదపరచుకొని మీకు ఇష్టమైన కథలను రాసి మీ ప్రొఫైల్ లో స్వీయ ప్రచురణ చేయండి. వర్షం ఎటువంటి నిభందనలు లేకుండా అన్ని ప్రదేశాలలో ఎలా కురుస్తుందో అలాగే ఈ పోటీ కూడా ఎలాంటి నిభందనలు లేకుండా మీకు ఇష్టమైన , విభిన్నమైన అంశాలపైన కథలను ఆహ్వానిస్తోంది.

 మీరు మీ కథలను స్వీయప్రచురణ చేయడానికి ఈ క్రింది విధానాన్ని అనుసరించగలరు.

మీ రచనను స్వీయప్రచురణ చేయడానికి మీ ప్రొఫైల్ లో వెళ్ళి వ్రాయండి మీద క్లిక్ చేసి,కొత్తరచనను జోడించండి. శీర్షిక రాసి సంగ్రహం జతచేసి రచనను కొనసాగించి ప్రచురించండి. ఫోటోగ్యాలరీలో మీ కథకు తగ్గ ఫోటోని జోడించి, “విభాగం” అనే చోట “కథ” సెలెక్ట్ చేసి, వర్గం  అనే చోట “కథల వర్షం” అనే వర్గం తో పాటు మీ కథకు తగ్గ  మరో రెండు వర్గాలను కూడా సెలెక్ట్ చేసి “నేను అంగీకరిస్తున్నాను” అని చివరగా ప్రచురించండి. ఈ పోటీ చివరి తేది ముగియగానే ” కథల వర్షం ” అనే వర్గం తీసివేయడం జరుగుతుంది. కావున మీరు ” కథల వర్షం ” అనే వర్గంతో పాటు మరో రెండు వర్గాలను  తప్పనిసరిగా సెలెక్ట్ చేసుకోవాలి. మీరు మీ కథలను స్వీయప్రచురణ చేసేటప్పుడు  ” కథల వర్షం ” అనే వర్గాన్ని తప్పకుండా సెలెక్ట్ చేసుకోవాలి. అలా చేసిన కథలు మాత్రమే పోటీకి తీసుకొనబడతాయి. సంగ్రహం తప్పనిసరిగా జత చేయండి.

సంగ్రహం అంటే ఏమిటి?

మీ కథ ఏ అంశం మీద రాస్తున్నారు మరియు మీ కథ యొక్క పూర్తి సారాంశం మూడు వాక్యాలలో కథ మొదట్లో రాయాలి.

న్యాయనిర్ణేత అందించిన ఫలితాలు ఆధారంగా:-

  1. మొదటి బహుమతి:3000
  2. రెండవ బహుమతి: 2000
  3. మూడవ బహుమతి:1000
  4. పోటీలో పాల్గొన్న రచయితలందరికీ ప్రతిలిపి ప్రశంసా పత్రం మెయిల్ చేయడం జరుగుతుంది.

ముఖ్యమైన తేదీలు:

1. మీ కథలు స్వీయప్రచురణ చేయడానికి ప్రారంభ తేది : 15.అక్టోబర్.2021

2. మీ కథలు స్వీయప్రచురణ చేయడానికి చివరి తేది : 31. అక్టోబర్.2021

3. ఫలితాలు ప్రకటించే తేది : 7.నవంబర్.2021

నియమాలు :-

  • కథలు మీ స్వంతమై ఉండాలి.
  • ఇది వరకు ప్రతిలిపిలో ప్రచురించిన కథలు పోటీకి స్వీయప్రచురణ చేయరాదు. మరెక్కడైనా ప్రచురణ అయిన కథలు పోటీకి ప్రచురించవచ్చు.
  • పదహైదు(15) కథల వరకు పోటీకి స్వీయ ప్రచురణ చేయవచ్చు.
  • అక్షరదోషాలు లేకుండా చూసుకోవాలి.

సందేహాలకు :events@pratilipi.com కి మెయిల్ చేయగలరు.

Leave a Reply

%d bloggers like this: