అక్టోబర్ 16, 2021

పండుగ వేళః ప్రతిలిపి కథల పోటీ

Posted in కథల పోటీలు at 4:29 సా. by వసుంధర

లంకె

పండుగ వేళ

నమస్తే…

ఈ నెల మూడ్ ఆఫ్ ది మంత్ లో భాగంగా “పండుగ వేళ” అనే పోటితో ప్రతిలిపి మీ ముందుకు వచ్చింది. పండుగ అనగానే గుడికి వెళ్ళడం, ఇంట్లో దైవమునకు ప్రత్యేక పూజలు చేయడం, బంధువులను ఆహ్వానించడం మొదలైనవి చేస్తాము. పండుగలు మన సంస్కృతిని గుర్తు చేస్తూ, యాంత్రికమైన జీవన విధానంలో సంతోషాన్ని పంచుతూ బంధుమిత్రులను ఒక దగ్గరికి చేరుస్తాయి. పండుగలను గుర్తు చేసుకుంటూ మీరు ఇది వరకు జరుపుకున్న, రాబోయే రోజులలో జరుపుకోబోతున్న పండుగలకు సంబంధించిన కథలను రాసి మీ ప్రొఫైల్ లో స్వీయప్రచురణ చేయండి.

మీరు మీ కథలను స్వీయప్రచురణ చేయడానికి ఈ క్రింది విధానాన్ని అనుసరించగలరు.

మీ రచనను స్వీయప్రచురణ చేయడానికి మీ ప్రొఫైల్ లో వెళ్ళి వ్రాయండి మీద క్లిక్ చేసి,కొత్తరచనను జోడించండి. శీర్షిక రాసి ,సంగ్రహం జతచేసి రచనను కొనసాగించి ప్రచురించండి. ఫోటోగ్యాలరీలో మీ కథకు తగ్గ ఫోటోని జోడించి, “విభాగం” అనే చోట “కథ” సెలెక్ట్ చేసి, వర్గం  అనే చోట “పండుగ వేళ” అనే వర్గం తో పాటు మీ కథకు తగ్గ  మరో రెండు వర్గాలను కూడా సెలెక్ట్ చేసి “నేను అంగీకరిస్తున్నాను” అని చివరగా ప్రచురించండి. ఈ పోటీ చివరి తేది ముగియగానే ” పండుగ వేళ ” అనే వర్గం తీసివేయడం జరుగుతుంది. కావున మీరు ” పండుగ వేళ ” అనే వర్గంతో పాటు మరో రెండు వర్గాలను  తప్పనిసరిగా సెలెక్ట్ చేసుకోవాలి. మీరు మీ కథలను స్వీయప్రచురణ చేసేటప్పుడు  ” పండుగ వేళ ” అనే వర్గాన్ని తప్పకుండా సెలెక్ట్ చేసుకోవాలి. అలా చేసిన కథలు మాత్రమే పోటీకి తీసుకొనబడతాయి. సంగ్రహం తప్పనిసరిగా జత చేయండి.

సంగ్రహం అంటే ఏమిటి?

మీ కథ ఏ అంశం మీద రాస్తున్నారు మరియు మీ కథ యొక్క పూర్తి సారాంశం మూడు వాక్యాలలో కథ మొదట్లో రాయాలి.

న్యాయనిర్ణేత అందించిన ఫలితాలు ఆధారంగా:-

  1. మొదటి పది మంది రచయితలకు ఉత్తమ రచయితలుగా ప్రతిలిపి ప్రశంసా పత్రం మెయిల్ చేయడం జరుగుతుంది.
  2. మొదటి రెండు అత్యుత్తమ కథలను మా ప్రతిలిపి బృందం చదివి ఆడియోను ప్రతిలిపి యూ ట్యూబ్ ఛానల్ లో అప్‌లోడ్ చేయడం జరుగుతుంది.

ముఖ్యమైన తేదీలు:

1. మీ కథలు స్వీయప్రచురణ చేయడానికి ప్రారంభ తేది : 7.అక్టోబర్.2021

2. మీ కథలు స్వీయప్రచురణ చేయడానికి చివరి తేది : 30.అక్టోబర్.2021

3. ఫలితాలు ప్రకటించే తేది : 6.నవంబర్.2021

నియమాలు :-

  • కథలు మీ స్వంతమై ఉండాలి.
  • ఇది వరకు ప్రతిలిపిలో ప్రచురించిన కథలు పోటీకి స్వీయప్రచురణ చేయరాదు. మరెక్కడైనా ప్రచురణ అయిన కథలు పోటీకి ప్రచురించవచ్చు.
  • పదహైదు(15) కథల వరకు పోటీకి స్వీయ ప్రచురణ చేయవచ్చు.
  • అక్షరదోషాలు లేకుండా చూసుకోవాలి.

సందేహాలకు :events@pratilipi.com కి మెయిల్ చేయగలరు.

Leave a Reply

%d bloggers like this: