అక్టోబర్ 29, 2021

ఆహ్వానంః స్త్రీవాద కవితలకు

Posted in కవితాజాలం, సాహితీ సమాచారం at 11:01 ఉద. by వసుంధర

నెచ్చెలి స్త్రీవాద కవితాసంకలనం “అపరాజిత” కోసం కవయిత్రులకు ఆహ్వానం!

1. స్త్రీల సమస్యలపై స్త్రీలు రాసిన కవితలను మాత్రమే పంపాలి.

2. కవితాకాలం & కవితలు – 1995 నుండి ఇప్పటివరకు వచ్చిన కవితలు ఏవైనా మూడు పంపాలి. ప్రచురణకి అర్హమయ్యిన కవితలు మాత్రమే స్వీకరించబడతాయి.

3. పత్రికల్లో ప్రచురింపబడినవైనా సరే పంపవచ్చు. తప్పకుండా ఎప్పుడు రాసినది, ఏ పత్రికలో ప్రచురించబడింది మొ.న వివరాలు కవిత చివర రాసి పంపాలి.

4. హామీపత్రం: “నెచ్చెలి ప్రచురిస్తున్న స్త్రీవాద కవితా సంకలనం “అపరాజిత” కు కవితలను ప్రచురించడానికి పూర్తి అనుమతి ఇస్తున్నానని, మరి ఏ ప్రచురణ సంస్థకు తమ సంకలనాల్లో ప్రచురణకు అనుమతి లేదని, ఇతర స్త్రీవాద కవితా సంకలనాల్లో/ స్త్రీల సమస్యల మీద వచ్చిన కవితా సంకలనాల్లో ఇప్పటికే వచ్చినవి కావని, మరి ఏ సంకలనానికి పరిశీలనలో  లేవని”  విధిగా హామీపత్రంలో రాయాలి.  

3. కవితతో బాటూ విధిగా ఒక ఫోటో, ఒక చిన్న పారాగ్రాఫులో మీ (మీపేరు, ఊరు, వృత్తి, రచనలు, చిరునామా, ఫోన్, ఈమైల్) వివరాలు ఈ-మెయిలుకి జతపరచండి.

5. కవితలు ఒక్కొక్కటి 40 పంక్తుల లోపు ఉండాలి.

7.కవిత తప్పనిసరిగా యూనికోడ్ లో ఉండాలి. వర్డ్ ఫైల్ పంపాలి.  పిడిఎఫ్ లేదా పి.ఎమ్.డి లు స్వీకరించబడవు.

8. ఎంపిక చేయబడిన కవితలు “నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక” లో కూడా నెలనెలా ప్రచురింపబడతాయి.

9. కవితలు పంపడానికి చివరి తేదీ: నవంబరు 15, 2021

10.ఈ-మెయిలు “అపరాజిత- నెచ్చెలి స్త్రీవాద కవితాసంకలనం” అని రాసి
editor@neccheli.com (లేదా) editor.neccheli@gmail.comకి పంపాలి.

11. కవితలకు విడిగా పారితోషికం ఇవ్వబడదు కానీ ఒక్కొక్క  కవయిత్రికి ఒక పుస్తకం ఉచితంగా ఇవ్వబడుతుంది.

-ఎడిటర్

Leave a Reply

%d bloggers like this: