అక్టోబర్ 29, 2021

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి 100వ ప్రచురణ ఆవిష్కరణ మహోత్సవం

Posted in పుస్తకాలు, సాహితీ సమాచారం at 11:11 ఉద. by వసుంధర

వాట్‍సాప్ బృందం సాహిత్య సమాచారకలశం సౌజన్యంతో

భారత ఉపరాష్ట్రపతి గౌ. ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిచే వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి 100వ ప్రచురణ ఆవిష్కరణ మహోత్సవం దిగ్విజయం
గత ఆదివారం…అనగా అక్టోబర్ 24, 2021 సాయంత్రం న్యూ ఢిల్లీలో తమ అధికారిక భవనంలో అంతర్జాల వేదిక ద్వారా భారత ఉపరాష్ట్రపతి గౌ. ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థ ప్రచురించిన 100వ తెలుగు గ్రంధాన్ని లాంఛనప్రాయంగా ఆవిష్కరించారు. ఆ పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లింక్ లో పూర్తి గా చూసి ఆనందించమని కోరుతున్నాం.
https://www.youtube.com/watch?v=CFgc_4SEzFk&t=6s
క్లుప్తంగా…చెప్పాలంటే….ఈ సందర్భంగా మాట్లాడుతూ 27 ఏళ్ళుగా తెలుగు భాషా, సాహిత్యాలకి సేవలు అందిస్తూ వంగూరి ఫౌండేషన్ చేస్తున్న కృషి ముదావహమని, 100 పుస్తకాలను ప్రచురించడం గొప్ప ప్రయత్నమని తెలిపారు. ఆ సదస్సు నిర్వహించిన లో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, శ్రీ సాంస్కృతిక కళా సారధి (సింగపూర్), తెలుగు మల్లి (ఆస్ట్రేలియా), ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తెలుగు సమాఖ్య (ఇంగ్లండ్), దక్షిణ ఆఫ్రికా తెలుగు సాహిత్య వేదిక (జొహానెస్ బర్గ్) సంస్థలని అభినందించారు. ఈ పుస్తకం తమ 100వ ప్రచురణగాను, వంగూరి ఫౌండేషన్ గత 27 ఏళ్ళగా సాధించిన ప్రగతిని, సాహిత్య ప్రస్థానాన్ని పదిలపరిచిన వీడియో ప్రసారాన్ని గౌ. ఉపరాష్ట్ఱపతి ఎంతో ఆసక్తితో వీక్షించి, ప్రశంసించారు.
ఈ అవిష్కరణ మహోత్సవాన్ని రాధిక మంగిపూడి వ్యాఖ్యాతగా నిర్వహించారు. 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ప్రధాన నిర్వాహకులు రత్నకుమార్ కవుటూరు (సింగపూర్), రావు కొంచాడ (మెల్ బర్న్), వంశీ రామరాజు (హైదరాబాద్), జొన్నలగెడ్డ మూర్తి (ఇంగ్లండ్), శాయి రాచకొండ లతో సహా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు చెందిన ప్రవాసాంధ్రులు, తెలుగు భాషాభిమానులు, తెలుగు సాహితీవేత్తలు తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి దక్షిణ ఆఫ్రికాకు చెందిన ప్రధాన నిర్వాహకులు రాపోలు సీతారామరాజు వందన సమర్పణ చేశారు.
గౌ. ఉపరాష్ట్రపతి ఆవిష్కరించిన “7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు సభా విశేష సంచిక” ఇక్కడ జతపరిచాం. ఆ 520 పేజీల గ్ర్డంధం లో ఉన్న అన్ని సాహిత్య ప్రసంగ వ్యాసాలనీ చదివి ఆనందించమని కోరుతున్నాం.
ఈ కార్యక్రమ వివరాలని తెలుగు నాట ప్రసార మాధ్యమాలు ప్రముఖంగా ప్రకటించాయి. ETV Prime News లో ఈ 100వ పుస్తకావిష్కరణ ప్రత్యేక వార్త గా ప్రసారం అయిన లింక్ ఈ క్రింద ఇచ్చాం.
ETV: News item after about 12.30 mins
https://www.youtube.com/watch?v=07x8H42b_F0
News Paper Coverage
ఈనాడు, ఈక్షణం, మా గల్ఫ్, సాక్షి, తెలుగు టైమ్స్, ఆంధ్రజ్యోతి, NT న్యూస్ మొదలైన పత్రికలు
https://www.eenadu.net/nri/newsarticle/telugu-news-vanguri-foundation-boo-release/1101/121218204
https://andhrajyothy.com/telugunews/vice-president-of-india-vanguri-foundation-of-america-book-launch-mrgs-nri-1921102507574096
https://m.sakshi.com/telugu-news/nri/vice-president-releases-100th-book-vanguri-foundation-america-1406827

Leave a Reply

%d bloggers like this: