నవంబర్ 2, 2021

దీపావళి కథల పోటీ ఫలితాలుః బహుళ

Posted in కథల పోటీలు at 3:39 సా. by వసుంధర

శ్రీమతి పివి శేషారత్నం సౌజన్యంతో

‘బహుళ అంతర్జాతీయ అంతర్జాల త్రైమాసిక మహిళా పత్రిక’ & కథాసాగరం  సంయుక్తంగా ” దీపావళి కథలపోటీ కోసం, సెప్టంబర్ 19, 2021 నాడు ప్రకటన ఇచ్చాము.. 20 అక్టోబర్ 2021 చివరి తేదీ నాటికి 39 కథలు వచ్చాయి. అందరికీ అభినందనలు.

పోటీ ఫలితాలు:

ప్రథమ బహుమతి  డా. తంగెళ్ళ శ్రీదేవిరెడ్డి గారి కథ ‘ఎర్రరేగళ్ళు’ – రూ. 1500/- లు
ద్వితీయ బహుమతి శ్రీమతి తోట సుభాషిణి గారి కథ
‘ది లాస్ట్ ఫ్యామిలీ’  రూ. 1000/-లు
తృతీయ బహుమతి శ్రీమతో బి. కళాగోపాల్ గారి కథ ‘లచ్చుమమ్మ’ . రూ. 500/-

కన్సోలేషన్ బహుమతులు వరుసగా  ఇద్దరికి ఒక్కొరికి రూ 300/- చొప్పున 
(1) శ్రీమతి నామని సుజనాదేవిగారి,  ‘చివరి కోరిక’ అనేకథ, (2) అనసూయ ఉయ్యూరు గారి ‘నిర్లక్ష్యం’ అనే కథ గెలుచుకున్నాయని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.
న్యాయ నిర్ణేతల ప్రత్యేక ప్రశంసలు అందుకున్న మరికొన్ని కథలు ఉన్నాయి.. అవి..
1) చిత్తుకాగితాల సాయమ్మ – యడవల్లి శైలజ
2) నువ్వు నాకు నచ్చావ్ – కొటమర్తి రాధా హిమబిందు
3) నాన్న మనసు – పి.వి. శేషారత్నం
4) ఆహ్వానం – యమున చింతపల్లి
ఆ కథయిత్రులకు ప్రత్యేక అభినందనలు…

తమ కథలు పంపి పోటీనీ విజయవంతం చేసిన రచయిత్రులందరకు అభినందనలు. 
ప్రతిరోజు ఎన్నో సాహిత్య కార్యక్రమలతో బిజీగా ఉన్నప్పటికీ తక్కువ సమయంలో ఎంతో బాధ్యతగా న్యాయనిర్ణేతగా విశ్లేషణాత్మక తీర్పును అందించారు, ప్రముఖ రచయిత్రి, విమర్శకురాలు, బహుగ్రంథకర్త,  ప్రభుత్వ డిగ్రీకళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సిహెచ్. సుశీల గారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు.

   జ్వలిత
‘బహుళ ‘ వ్యవస్థాపక సంపాదకురాలు

సుమతి చురుకంటి
కథాసాగరం, బాధ్యులు

(కథాసాగరం గురించి ఒక మాట చెప్పాలి,
కథా చరిత్రలో మహిళలు రాసిన కథల వివరాలను కుల మత ప్రాంతాలతో సంబంధం లేకుండా తెలుగు కథను భద్రపరచడం ద్వారా రేపటి తరానికి అందించడం, పరిశోధకులకు సహకరించడం, మనని మనం గౌరవించుకోవడం. కథయిత్రుల వివరాలు కథలను వీడియోలుగా భద్రపరచడం ఉద్దేశ్యంతో
02- 08-2020 తేదీన కథయిత్రుల సమూహం ఏర్పాటు చేశాము. “కథాసాగరం” యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నాము. కారణం సాహిత్య చరిత్రలో జెండర్ వివక్ష ఉంది కదా… లేదంటారా)

Leave a Reply

%d bloggers like this: