నవంబర్ 10, 2021

చిన్నారి లోకంః బాల సాహిత్య కథల పోటీ

Posted in కథల పోటీలు at 6:47 సా. by వసుంధర

లంకె

నమస్తే..

పిల్లలు దేవుడితో సమానం అంటారు. ఎలాంటి కల్మషం లేని స్వచ్చమైన మనసు ఉన్న పాలబుగ్గల పసికందులే పిల్లలు. తమ ముద్దు ముద్దు మాటలతో అలరిస్తారు,పెద్దల అలుపును తమ బోసినవ్వులతో మాయం చేస్తారు. తాము ఎంత పెద్దగా ఎదిగినా తమ తల్లిదండ్రులకు పసివారి లాగానే కనిపిస్తారు. మరి మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా?  ఈ నెల మూడ్ అఫ్ ది మంత్ లో భాగంగా “చిన్నారి లోకం” అనే శీర్షిక తో మీ ముందుకు వచ్చింది. మీ పిల్లల చిన్ననాటి గుర్తులను,పిల్లలు లేని వారు తమ తోబుట్టువుల పిల్లలతో గడిపిన క్షణాలను కథలుగా రాసి కథలను రాసి ప్రతిలిపి తో పంచుకొని తన్మయత్వం పొందండి.

మీరు మీ కథలను స్వీయప్రచురణ చేయడానికి ఈ క్రింది విధానాన్ని అనుసరించగలరు.

మీ రచనను స్వీయప్రచురణ చేయడానికి మీ ప్రొఫైల్ లో వెళ్ళి వ్రాయండి మీద క్లిక్ చేసి,కొత్తరచనను జోడించండి. శీర్షిక రాసి ,సంగ్రహం జతచేసి రచనను కొనసాగించి ప్రచురించండి. ఫోటోగ్యాలరీలో మీ కథకు తగ్గ ఫోటోని జోడించి, “విభాగం” అనే చోట “కథ” సెలెక్ట్ చేసి, వర్గం  అనే చోట ” చిన్నారి లోకం ” అనే వర్గం తో పాటు మీ కథకు తగ్గ  మరో రెండు వర్గాలను కూడా సెలెక్ట్ చేసి “నేను అంగీకరిస్తున్నాను” అని చివరగా ప్రచురించండి. ఈ పోటీ చివరి తేది ముగియగానే ” చిన్నారి లోకం ” అనే వర్గం తీసివేయడం జరుగుతుంది. కావున మీరు ” చిన్నారి లోకం ” అనే వర్గంతో పాటు మరో రెండు వర్గాలను  తప్పనిసరిగా సెలెక్ట్ చేసుకోవాలి. మీరు మీ కథలను స్వీయప్రచురణ చేసేటప్పుడు  ” చిన్నారి లోకం ” అనే వర్గాన్ని తప్పకుండా సెలెక్ట్ చేసుకోవాలి. అలా చేసిన కథలు మాత్రమే పోటీకి తీసుకొనబడతాయి. సంగ్రహం తప్పనిసరిగా జత చేయండి.

సంగ్రహం అంటే ఏమిటి?

మీ కథ ఏ అంశం మీద రాస్తున్నారు మరియు మీ కథ యొక్క పూర్తి సారాంశం మూడు వాక్యాలలో కథ మొదట్లో రాయాలి.

న్యాయనిర్ణేత అందించిన ఫలితాలు ఆధారంగా:-

  1. పోటీలో పాల్గొన్న రచయితలందరికీ ప్రతిలిపి ప్రశంసా పత్రం మెయిల్ చేయడం జరుగుతుంది.
  2. మొదటి పది అత్యుత్తమ కథలు రాసిన రచయితల ప్రొఫైల్స్ మా ప్రతిలిపి సంబంధిత మాధ్యమాలలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. తద్వారా మీ ప్రొఫైల్ ఎక్కవ మందికి తెలిసే అవకాశం ఉంది.

ముఖ్యమైన తేదీలు:

1. మీ కథలు స్వీయప్రచురణ చేయడానికి ప్రారంభ తేది :9.నవంబర్.2021

2. మీ కథలు స్వీయప్రచురణ చేయడానికి చివరి తేది : 30.నవంబర్.2021

3. ఫలితాలు ప్రకటించే తేది : 3.డిసెంబర్.2021

నియమాలు :-

  • కథలు మీ స్వంతమై ఉండాలి.
  • ఇది వరకు ప్రతిలిపిలో ప్రచురించిన కథలు పోటీకి స్వీయప్రచురణ చేయరాదు. మరెక్కడైనా ప్రచురణ అయిన కథలు పోటీకి ప్రచురించవచ్చు.
  • పదహైదు(15) కథల వరకు పోటీకి స్వీయ ప్రచురణ చేయవచ్చు.
  • అక్షరదోషాలు లేకుండా చూసుకోవాలి.

సందేహాలకు :events@pratilipi.com కి మెయిల్ చేయగలరు.

Leave a Reply

%d bloggers like this: