నవంబర్ 23, 2021

సోమేపల్లి చిన్నకథల పోటీ విజేతలు

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం at 7:22 సా. by వసుంధర

వాట్‍సాప్ బృందం సాహిత్య సమాచారకలశం, శ్రీమతి పివి శేషారత్నం లకు ధన్యవాదాలు

13వ జాతీయస్థాయి ‘సోమేపల్లి’ చిన్న కథల పోటీ విజేతలు
‘రమ్యభారతి’ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన తెలుగు చిన్న కథల పోటీలలో 13వ జాతీయస్థాయి ‘సోమేపల్లి సాహితీ పురస్కారాల’ కోసం దేశం నలుమూలల నుండి 150 కథలు పరిశీలనార్థం వచ్చాయి. వాటిలో ఉత్తమంగా ఉన్న ఈ క్రింది కథలను న్యాయనిర్ణేత ఎన్నిక చెయ్యడం జరిగింది.

విజేతలు: హైదరాబాద్ కు చెందిన పాండ్రంకి సుబ్రమణి రచించిన ‘బాల్యం’ కథకు ‘సోమేపల్లి’ ప్రధమస్థాయి అత్యుత్తమ పురస్కారం లభించింది. ద్వితీయస్థాయి పురస్కారం విజయవాడకు చెందిన పొన్నాడ సత్యప్రకాశరావు రచించిన ‘అభద్రత?’కు, తృతీయస్థాయి పురస్కారం ఒంగోలుకు చెందిన శింగరాజు శ్రీనివాసరావు ‘తీర్పు’కు లభించాయి. అలాగే సింహప్రసాద్, హైదరాబాద్ (గోపెమ్మ), కె.వి.మేఘనాధ్ రెడ్డి, పలమనేరు (పల్లె వసంతం), కె.వి.లక్ష్మణరావు, మానేపల్లి (రిటైర్మెంట్), డా. ఎమ్.సుగుణరావు, విశాఖపట్నం (చట్టం-ధర్మం)లకు ప్రోత్సాహక పురస్కారాలు లభించాయి. విజేతలకు వరసగా 2,500, 1,500, 1,000, ప్రోత్సాహకం 500 నగదుతోపాటు జ్ఞాపిక, శాలువతో త్వరలో జరిగే ప్రత్యేక సభలో సత్కరించడం జరుగుతుంది. ఈ పోటీలకు ప్రఖ్యాత రచయిత, విమర్శకులు శ్రీకంఠస్పూర్తి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఈ పోటీలు విజయవంతం చేసిన రచయితలకు, పత్రికల వారికి ఈ సందర్భంగా రమ్యభారతి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నది.

Leave a Reply

%d bloggers like this: