ఏప్రిల్ 13, 2021
విశాఖ సంస్కృతి 2021 ఆన్లైన్లో
క్రమం తప్పకుండా మార్కెట్లో విడుదలవుతున్న మంచి పత్రికల్లో విశాఖ సంస్కృతి ఒకటి.
ఏప్రిల్ సంచిక ప్రస్తుతం మార్కెట్లో ఉంది. 2020లో సంచికలు కావలసినవారు మాకు గానీ, పత్రికకు కానీ వ్రాసి తెప్పించుకోవచ్చును.
రెండు ఉగాది వెబ్ సంచికలు
- సహరి
అందరికీ శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. 💐💐💐
నూతన సంవత్సర కానుకగా ఈ వారం సహరి మీకు ఉచితంగా అందచేస్తున్నాము. ఈ క్రింద ఇచ్చిన లంకెలో సహరి చదవండి. మీ బంధుమిత్రులకు షేర్ చెయ్యండి.
http://guest.sahari.in/1617892600/09-04-2021/
2. కథామంజరి

ఈ క్రింద ఇచ్చిన లంకెలో కథామంజరి చదవండి
మార్చి 17, 2021
చేతినుంచి కంటికి- ఈనాడు
ఇది వాట్సాప్ సమాచారం. నిజమే కావచ్చని అనుకుంటూ ఇక్కడ ఇస్తున్నాం…
ఈనాడు ప్రింటింగ్ ను నిలిపేస్తున్న రామోజీరావు
డిజిటల్ ఎడిషన్ లకే ఇక ఈనాడు పరిమితం
హైదరాబాద్:
తెలుగు పత్రికా రంగంలో ‘ఈనాడు’సంస్థ కొన్నేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతూ వచ్చింది. అయితే కరోనా వైరస్ అన్ని రంగాలతో పాటు పత్రికా రంగాన్ని కూడా అతలాకుతలం చేసేసింది. దీనికి ‘ఈనాడు’కూడా మినహాయింపు కాదనే చెప్పాలి. దీంతో పాటు మీడియాలో మారుతున్న పోకడల కారణంగా అధినేత రామోజీరావు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘ఈనాడు’ పత్రికా ప్రింట్‌ను త్వరలోనే క్లోజ్ చేస్తారని ఆ సంస్థ ఉద్యోగులు బహిరంగంగానే చెప్తున్నారు. భవిష్యత్‌లో ఈనాడు కేవలం ఆన్లైన్ ఎడిషన్‌కే పరిమితం అవుతుందని వారి మాటల సారాంశం. మరోవైపు రామోజీరావు ఔషధాల వ్యాపార రంగంలోకి దిగుతున్నట్లు టాక్ నడుస్తోంది.ఈ నేపథ్యంలో ‘ఈనాడు’దినపత్రిక జిల్లా కార్యాలయాలు ‘మెడికల్ డిస్ట్రిబ్యూటర్’ సంస్థలుగా మారబోతున్నాయని సమాచారం. ఈ మేరకు భారత్ బయోటెక్ సంస్థతో ఒప్పందం కూడా జరిగిందట.
ఇప్పటికే గుంటూరు యూనిట్లో పత్రిక ప్రింట్‌ను ఔట్‌సోర్సింగ్‌కు అప్పగించారు. ఔట్ సోర్సింగ్ ద్వారా అయితే ఉద్యోగుల పీఎఫ్, గ్రాట్యూటీ, వేజ్ బోర్డు వేతన సిఫారసులు వంటి తలనొప్పులు ఉండవు. అందుకే త్వరలోనే తెలుగు రాష్ట్రాలలోని మరికొన్ని ప్రింటింగ్ యూనిట్లను ఔట్ సోర్సింగ్‌కు అప్పగిస్తారని విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఈ ప్రక్రియ దశల వారీగా జరగనుందట. 2024 ఆగస్టు 10 వరకు మాత్రమే ఈనాడు ప్రింటింగ్ కొనసాగుతుందని, ఆ తర్వాత కేవలం ‘ఈనాడు’ను ఈ-పేపర్, డిజిటల్ ఎడిషన్లకు మాత్రమే పరిమితం చేస్తారని మీడియా వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ధాటికి మెయిన్ స్ట్రీమ్ మీడియా విలవిలలాడుతున్న సంగతి అందరికీ తెలిసిందే.