మార్చి 28, 2021
@18- తప్పక చదవండి
వివాహం సమాజానికి ఆవశ్యకమైన ఒక అద్భుత, ఆరోగ్యకర సంప్రదాయం. అది అపరిపక్వదశలో జరగడం ఎంత నష్టమో, పరిపక్వదశలో జరక్కపోవడమూ అంతే నష్టం సమాజానికి. ఈ అంశాన్ని మాతో సహా ఎందరో రచయితలు తమ రచనల్లో ప్రస్తావించారు. కానీ అదే అంశాన్ని సమకాలీనులకు అత్యవసరమైన సందేశంగా గుర్తించిన ఈ కథ, అందుకు తగిన పరిపక్వ కథనం – విశిష్టం. అనన్యసామాన్యం అనిపించేలా సమస్యను విశ్లేషించి ప్రదర్శించిన రచయిత సురేష్ పిళ్లైకు అభివందనాలు. ప్రచురించిన సారంగ వెబ్ పత్రికకు అభినందనలు. తమ స్పందనతో అభివందనాలు అందుకునే పాఠకుల సంఖ్య అపరిమితమై, రచయిత కృషికి న్యాయం జరుగుతుందని ఆశిద్దాం.
కథ చదవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
మార్చి 22, 2021
100 రోజులు 100 కథలు
టెలిగ్రామ్ గ్రూప్
మిత్రులారా … రెండవ తరగతి లోపు చిన్నారులకు మంచి కథలు అందించడం కోసం. వందరోజులు వందకథలు అనే టెలిగ్రామ్ గ్రూపు నాలుగు వేలమంది సభ్యులతో నడుస్తూ ఉంది. మీరు ఇందులో సభ్యులుగా చేరడంతో పాటు చిన్న పిల్లలు ఉన్న మీ స్నేహితులను కూడా సభ్యులుగా చేర్చండి. ఇది only admin గ్రూపు. నేను తప్ప ఎవరూ post చేసే వీలుండదు. రోజూ రెండు కథలు సంయుక్త అక్షరాలు లేకుండా పిల్లలు సొంతంగా చదువుకునేలా సులభ శైలిలో వస్తాయి. వీటితో బాటు ఒత్తులు సంయుక్త అక్షరాలు లేని గేయాలు ,బొమ్మలతో సామెతలు , పొడుపుకథలు వస్తుంటాయి. విద్యార్థులకు , ప్రాథమిక తరగతులు బోధించే ఉపాధ్యాయులకు ఈ గ్రూప్ ఎంతో ఉపయోగపడుతుంది – మీ – డా.ఎం.హరికిషన్ – కర్నూలు – 9441032212.
లింక్ ఓపెన్ కాకపోతే నాకు మెసేజ్ చేయండి.
కథామంజరిః ఒక ఆదర్శ ప్రయోగం
కాలం మారుతోంది. తెలుగు భాష మనుగడకే సమస్య వచ్చిందని కొందరు కలవరపడుతున్నారు. కానీ ప్రపంచమంతటా తెలుగు వెలుగులు కనబడుతూనే ఉన్నాయి.
భాషను బ్రతికించే ముఖ్యసాధనాల్లో సాహిత్యం ఒకటి. ఆ సాహిత్యానికి మనుగడనిచ్చే అచ్చు పత్రికలు వరుసగా మూత పడుతున్నాయి. అదే సమయంలో అంతర్జాలం సాహిత్యానికి ఇస్తున్న ఊతం చెప్పుకోతగ్గది.
అమెరికానుంచి ఈ మాట, కౌముది వంటి పత్రికలు కొన్ని దశాబ్దాలుగా సాహిత్యసేవ చేస్తున్నాయి. ఇంకా సారంగ, మాలిక, తెలుగుజ్యోతి, సంచిక, అవిర్భవ వగైరా ఎన్నోపత్రికలు ఆశ్చర్యమనిపించే స్థాయి సాహితీ వేదికలు. ఇటీవలే ఆస్ట్రేలియాలో తెలుగు పలుకు మొదలైంది. అచ్చులోని పత్రికల్ని తలపించే సహరి ఒక వినూత్న ప్రయోగంగా వర్థిల్లుతోంది.
సాహిత్యంలో అత్యంత ప్రభావశీలమైన ప్రక్రియ కథ. ఆ కథకు ప్రాధాన్యమిస్తున్న కథామంజరి- ప్రస్తుతం అంతర్జాలంలో ఒక ఆదర్శప్రయోగం.- అదర్శం ఎందుకంటే, కథ అంటే అభిమానమున్న వారు, వనరులు స్వల్పమైనా, అనుసరించడానికి అనువైన, ఆచరణీయమైన ప్రయోగమిది. చక్కని కథలతో, ప్రయోజనాత్మకమైన స్పందనలతో- సాహితీపరులు వారిని ప్రోత్సహించడానికీ- సాహిత్యాభిమానులు వారిని స్ఫూర్తిగా తీసుకునేందుకు సహకరించడానికీ- ఇంతవరకూ వచ్చిన కథామంజరి సంచికలకు ఇక్కడ లంకె ఇస్తున్నాం.