ఏప్రిల్ 10, 2021
చందమామ కథలు-2 వసుంధర
తెలుగునాట తనదైన ప్రత్యేక శైలితో పెద్దల్నీ-పిల్లల్ల్నీ, పండితుల్నీ-పామరుల్నీ అలరించిన పిల్లల రంగుల బొమ్మల మాసపత్రిక చందమామ. అందులో మా (వసుంధర) కథలు ఇదువందలకు పైగా ప్రచురితం కావడం మా అదృష్టం.
చందమామ కథల్ని చందమామ అంత గొప్పగానూ – తెలుగువారికి అందించాలన్న గొప్ప సంకల్పంతో ముందుకొచ్చిన ప్రచురణ సంస్థ జెపి పబ్లిషర్సు. అందుకు వారు మా కథల్ని ఎంపిక చేసుకోవడం మళ్లీ మా అదృష్టం.
వారు ప్రచురించిన తొలి సంపుటి చందమామ కథలు- 1 (వసుంధర) వివరాలు గతంలో ఇచ్చాం.
ఇప్పుడు చందమామ కథలు-2 మార్కెట్లోకి వచ్చింది. 46 కథలు. 144 పేజీలు. ప్రతి పీజీలోనూ చందమామ తరహాలో మళ్లీ కొత్తగా రంగు రంగుల బొమ్మలు. అవి చందమామలో అనుభవం, చందమామతో అనుబంధం ఉన్న – శక్తి దాస్ కుంచె దిద్దినవి కావడం. ఇవి ఈ సంపుటిలో కొన్ని ప్రత్యేకతలు.
ఈ విశేషాన్ని మీతో పంచుకోవడానికి మించిన ఆనందమేముంది?




ఏప్రిల్ 3, 2021
బాలల కవితల పోటీ ఫలితాలు: వసుంధర విజ్ఞాన వికాస మండలి
వసుంధర విజ్ఞాన వికాస మండలి
(సామాజిక యువ చైతన్య వేదిక)
స్థాపితం-1993. రినెం-4393-96
గోదావరిఖని, పెద్దపల్లి జిల్లా-తెలంగాణ రాష్ర్టం
గత 28 ఏండ్లుగా వివిధ ఆంశాలపై నిర్వహిస్తున్న సాహిత్య, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలను ఆదరిస్తున్న తెలుగు ప్రజలకు ధన్యవాదాలు. ఈ క్రమంలో కరోనా చదువులు అనే అంశంపై పాఠశాల స్థాయి విద్యార్థులకు రాష్ర్ట స్థాయిలో నిర్వహించిన కవితల పోటీకి అనుహ్య స్పందన వచ్చింది. కాగా మేము ప్రకటించినట్టు పోటీకి వచ్చిన కవితల్లో ఐదు ఉత్తమ కవితలను మా న్యాయ నిర్ణేతలు నిర్ణయించారు. వీరికి ఐదు సమాన బహుమతులు త్వరలోనే అందజేస్తాము.
విజేతల వివరాలు
1.ఈదులకంటి నందిని- పదవతరగతి, పివీ రంగారావు టీఎస్సార్ స్కూల్ -వంగర (వరంగల్ రూరల్)
2. గంటా పౌలినా ఏంజిలిన్- 7వతరగతి, సెంట్ ఆన్స్‌స్కూల్ ,భీమవరం, పశ్చీమగోదావరి జిల్లా ( ఆంధ్రప్రదేశ్)
3.ఎన్. రోహిణీ, 9వ తరగతి, జిల్లాపరిషత్ స్కూల్, కొండపాక, సిద్దిపేట జిల్లా
4. ఆదివైష్ణవి, పదవతరగతి, జిల్లా పరిషత్ స్కూల్, తడపాకల్, ఏర్గట్ల , నిజామాబాద్ జిల్లా
5. పి.నవనీత, 9వతరగతి, జిల్లా పరిషత్ స్కూల్, దేవరకద్ర, మహాబూబ్‌నగర్ జిల్లా
మధుకర్ వైద్యుల, వ్యవస్థాపకులు, చదువు వెంకటరెడ్డి అధ్యక్షులు, కట్కూరి శంకర్, వర్కింగ్ ప్రెసిడెంట్,
మందల రవిందర్‌రెడ్డి, శాశ్వత ఆహ్వానితులు భూమయ్య ప్రధానకార్యదర్శి
ఏప్రిల్ 1, 2021
కథలు చెప్పే పోటీ
జాతీయ ఉగాది బడి పిల్లల కథల పోటీ *(కథలు చెప్పడం..Story telling)
తొమ్మిది బహుమతులు..3000 Rs
(బడి పిల్లలకు)
“We Love Reading”
“చదవటం మా కిష్టం”
మరియు
Badi Pillala Talent యూట్యూబ్ చానల్ ఆద్వర్యంలో
బడి పిల్లలకు చదువు పట్ల ఇష్టం కలిగించడానికి ,వారిలో దాగి ఉన్న టాలెంట్ ను ప్రోత్సాహించడానికి
1 నుండి 5 తరగతుల వరకు మొదటి లెవెల్
6 నుండి 7 తరగతుల వరకు రెండవ లెవల్
8 నుండి 9 తరగతుల వరకు మూడవ లెవెల్
చదువుతున్న విద్యార్థులకు ఈ కథల పోటీ.
బహుమతులు
ప్రథమ బహుమతి..500
రెండవ బహుమతి..300
తృతీయ బహుమతి..200
మొత్తం తొమ్మిది బహుమతులు 3 లెవెల్స్ కు 3000 రూపాయలు
బహుమతులు ఇస్తున్నవారు..
1) గరిపల్లి అశోక్
9849649101
విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు
తెలంగాణ
2) యువశ్రీ మురళి,
తెలుగు ఉపాధ్యాయులు,
చిత్తూరు జిల్లా.
3) కావేటి.రంగనాయకులు
9052964954
తెలుగు ఉపాధ్యాయులు,
కర్నూలు జిల్లా.
విజేతలను ప్రకటించువారు..
డా”నెమిలేటి కిట్టన్న
తెలుగు ఉపాధ్యాయులు
చిత్తూరు
ఈ పోటిలో పాల్గొన్న ప్రతి విద్యార్థికి డిజిటల్ ప్రశంసా పత్రం ఇవ్వబడును..
కె.శంకర్ రావు
9642214256
తెలుగు ఉపాధ్యాయులు
పత్తికొండ
ఉగాది కథల పోటి నియమాలు
1) కథను సొంత మాటలలో చెప్పవచ్చు..
2) కథను చూసి చదువవచ్చు..
3)గట్టిగా వినపడేటట్లు ,చక్కగా వీడియో తీసి పంపాలి.
4) సెల్ పోన్ నిలువుగా ఉంచి వీడియో తీయాలి.
ఫలితాల ప్రకటన
Badi Pillala Talent యూట్యూబ్ చానల్ లో ఎవ్వరికి ఎక్కువ views వస్తాయో వారే విజేతలు.
చివరి తేది: మే 31
ఫలితాల ప్రకటన: జూన్ 1న
బహుమతులు గూగుల్ పే ,పోన్ పే ,పే టిమ్ ద్వారా బహుమతులు పంపబడుతాయి…
వీడియోలు పంపవలసిన విధానం
*“””
https://youtu.be/F3LR_3ZiU
☝Badi Pillala Talent యూట్యూబ్ చానల్ ను subscribe చేసి వీడియో పంపాలి.
కథపేరు..
విద్యార్థి పేరు..
తరగతి…
పాఠశాల..
జిల్లా…
పోన్ నెంబరు..
నిర్వహణ
పుల్లారామాంజనేయులు
ఉపాధ్యాయులు
9491851349
Badi Pillala Talent యూట్యూబ్ చానల్…