ఏప్రిల్ 17, 2021

అన్నమయ్య సంకీర్తనలుః సామాజిక దృక్పథం

Posted in సంగీత సమాచారం, సాహితీ సమాచారం at 5:29 సా. by వసుంధర

సంగీత నవావధానం

Posted in సంగీత సమాచారం at 12:52 సా. by వసుంధర

ఏప్రిల్ 16, 2021

భువినుండి దివికి

Posted in సంగీత సమాచారం, సాహితీ సమాచారం at 3:07 సా. by వసుంధర

లంకె

మ్యూజికాలజిస్ట్ శ్రీ రాజా ఇక లేరు!
ప్రముఖ జర్నలిస్ట్, మ్యూజికాలజిస్ట్ శ్రీ రాజా కొద్ది సేపటి క్రితం హైదరాబాద్ లో అనారోగ్యంతో కన్నుమూశారు. కొన్ని నెలలుగా ఆయన ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ ఉన్నారు. ‘వార్త’ దిన పత్రిక సినిమా పేజీ ఇన్ ఛార్జ్ గా, ‘హాసం’ పక్ష పత్రిక సంపాదకుడిగా సినిమా రంగానికి ఎంతో సేవ చేశారు. ‘మా’ టీవీ ఛానెల్ లోనూ పలు సినీ సంగీత కార్యక్రమాలను నిర్వహించారు. మరీ ముఖ్యంగా సినీ సంగీత, సాహిత్యం విషయంలో ఆయనో ఎన్ సైక్లోపిడియా! ‘మ్యూజికాలజిస్ట్’ అని సినీ సంగీత కళాకారులు ఆయన్ని అభిమానంతో పిలుచుకునే వారు. అత్యంత పాఠకాదరణ పొందిన ‘ఆపాతమధురం’ శీర్షికను నిర్వహించిన శ్రీ రాజాగారు దానిని పుస్తకం రూపంలోనూ తీసుకొచ్చారు. శ్రీ రాజాగారూ కన్నుమూయడం, తెలుగు సినిమా రంగానికి తీరని లోటు. వారకి కన్నీటి నివాళులు

ఫిబ్రవరి 27, 2021

అంతర్జాలంలో హరికథాగానం

Posted in కళారంగం, సంగీత సమాచారం, సాహితీ సమాచారం at 7:24 సా. by వసుంధర

“తానా ప్రపంచ సాహిత్య వేదిక “( ప్రతి నెలా ఆఖరి ఆదివారం – అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం ) పదవ సమావేశం  ఆదివారం – ఫిబ్రవరి 28, 2021(భారత కాలమానం – 8:30 PM; అమెరికా – 7:00AM PST; 9:00AM CST; 10:00 AM EST) “తెలుగు సాహిత్య వినీలాకాశంలో .. హరికథాప్రాభావం” భక్త పోతన సాహిత్య వైభవం (హరికథాగానం)కథకులు: వాచస్పతి డా. ముప్పవరపు వేంకట సింహచాలశాస్త్రి గారు డి.లిట్, తిరుపతి అందరికీ ఆహ్వానం. మీ స్నేహితులకు కూడా తెలియజేయండి.   ఈ క్రింది ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షించవచ్చు: 1. TANA TV Channel – in YuppTV2. Facebook: https://www.facebook.com/tana.org3. YouTube: https://www.youtube.com/channel/UCwLhSy1ptf0i1CioyeZmzrw4. Mana TV & TV5 USA5. TVAsia Telugu  మిగిలిన వివరాలకు: www.tana.org

జనవరి 31, 2021

సినీగీతాల్లో – ప్రేమ సందిగ్ధాలు

Posted in బుల్లితెర-వెండితెర, సంగీత సమాచారం at 12:58 సా. by వసుంధర

ప్రేమలో రకరకాల సందిగ్ధాలు. కవుల అక్షరాల్లో అవి మనోహరాలు. సంగీతంతో మేళవమైతే అవి సుస్వరాలు. వెరసి దృశ్యకావ్యంగా అవి సినీగీతాలు. అనుభూతికి, స్మృతులకు అవి సుమధురాలు.

అసమాన ప్రతిభావంతుడు, మహా గాయకుడు – ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం – వేదికలపై సినీగీతాల లోతుని అవగాహనకు తెచ్చే ప్రయత్నాలు ఎన్నో చేశారు. ఆ ప్రేరణతోనే అప్పుడప్పుడు కొన్ని సినీ గీతాల్ని సంస్మరించుకుందుకు అక్షరజాలమూ ఓ వేదిక. దీన్ని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు.

మచ్చుకి సినీగీతాల్లో ప్రేమ సందిగ్ధాలను ప్రదర్శించిన మూడు పాటలకు ఇక్కడ లంకె ఇస్తున్నాం.

  1. రాజ్ కుమార్ (హిందీ) – ఇస్ రంగ్ బదల్తీ దునియామే
  2. బాజీగర్ (హిందీ) – చుపానాభీ నహీ ఆతా
  3. గుండమ్మ కథ (తెలుగు)- కనులు మూసినా నీవాయె

తరువాతి పేజీ