మార్చి 18, 2014
ఎవరికి ఎవరు కాపలా
సరస్వతీ చంద్ర హిందీ చిత్రం పేరు వినగానే గుర్తుకొచ్చే పాట చందన్ స బదన్. ఆ చిత్రంలోని మరో పాట ఛోడ్దే సారీ దునికా కిసీ కేలియే. ఆ పాటను అర్థవంతంగా పరిచయం చేశారు శ్రీ బమ్మెర డిసెంబర్ 2 ఆంధ్రజ్యొతి దినపత్రికలో. వారికి ధన్యవాదాలు.
మార్చి 4, 2014
ఇది వీడ్కోలు కాదు- మళ్లీ కలుస్తాం
1982లో వచ్చిన హిందీ చిత్రం నిఖాహ్ ఒక సంచలనం. బ్రిటన్‌లో స్థిరపడ్డ పాకిస్తానీ తార సల్మా ఆగా ఈ చిత్రంలో కథానాయికగా, గాయనిగా పరిచయం కావడం విశేషం. ఆమె పాడిన దిల్ కె అర్మా అన్న పాట దేశమంతటా మారుమ్రోగింది. ఆ ఏడు ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా గెల్చుకుంది. ఆ చిత్రంలో మరో పాట బీతే హుయే లహ్మోం కి. మహేంద్రకపూర్ పాడిన ఈ గేయానికి మార్చి 3 ఆంధ్రజ్యోతి దినపత్రికలో- తెలుగులో అర్థం వివరించారు తనదైన మనోహరమైన శైలిలో శ్రీ బమ్మెర. ఆ వ్యాసం ఇక్కడ మీకోసంః
ఫిబ్రవరి 24, 2014
ఛోడో కల్కీ బాతే- ఒక మంచి హిందీ పాట
ఉషాఖన్నామన దేశ సినీరంగంలో తొలి మహిళా సంగీతదర్శకురాలు. ఆమె తన 18వ ఏట తొలిసారిగా సంగీత దర్శకత్వం వహించిన దిల్ దేకే దేఖో చిత్రంలో పాటలు 1959లో గొప్ప ఊపుతో దేశంలో సంచలనం కలిగించాయి. వాటిలో మెరీజా వాహ్ అనే పాట- అదే చిత్రంలో హీరోయిన్గా తెరంగేట్రం చేసిన ఆశాపరేఖ్ని కొన్ని దశాబ్దాలపాటు వెండితెరపై చమక్కుమనేలా చేసింది. ఆ చిత్రంలో టైటిల్ సాంగ్‌ని తెలుగు నాట ప్రముఖ సంగీత దర్శకుడు ఘంటసాల శాంతినివాసం చిత్రంలో హాస్యజంటకోసం వాడారు.
ఉషాఖన్నా రెండవచిత్రం హమ్ హిందూస్థానీ. అందులో పాటలకు తొలిచిత్రపు ఊపుతో పాటు లలిత సంగీతపు మార్దవం అద్ది- ఆమె తన బహుముఖప్రజ్ఞను నిరూపించుకున్నారు. ఆ చిత్రంలో ఛోడో కల్కీ బాతే అన్న పాటని ప్రస్తుత సందర్భానుసారంగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో తెలుగులో టీకాతాత్పర్య సహితంగా వివరించారు. చదవండి….
ఫిబ్రవరి 5, 2014
యే జిందగీ ఉసీకిహై
1953లో విడుదలైన అనార్కలి హిందీ చిత్రంలో యే జిందగీ ఉసీకిహై అన్న పాట అప్పట్లో సంచలనం కలిగించింది. ఇప్పటికీ సంగీతప్రియుల్ని అలరిస్తోంది. ఆ చిత్రం ఆధారంగా 1955లో తెలుగులో వచ్చిన అనార్కలి చిత్రంలో జీవితమే సఫలమూ అన్న పాట హిందీ పాటకు అనుకరణే ఐనా తెలుగులో అంతటి ప్రాచుర్యాన్నీ పొందింది. తెలుగు పాట అక్షర రచనకు ఇక్కడ క్లిక్ చెయ్యండి. హిందీ పాట గేయాన్ని తెలుగు తాత్పర్యంతో అందించింది ఫిబ్రవరి 3 ఆంధ్రజ్యోతి దినపత్రిక. అది ఈ క్రింద ఇస్తున్నాం.