ఏప్రిల్ 13, 2021

ఉగాది శుభాకాంక్షలు

Posted in జన గళం, ముఖాముఖీ, సాంఘికం-రాజకీయాలు at 7:29 సా. by వసుంధర

ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలెన్నుకున్న నాయకులందరూ ప్రజాప్రతినిధులు. వారు పరస్పరం నిందించుకుంటే, వారినెన్నుకున్న ప్రజల్ని అవమానించడమే!
ప్రస్తుతం వరగర్వితులైన రాక్షసుల్ని మరిపిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే- ముందు మనలోని రాక్షసాంశ స్థానంలో దైవత్వాన్ని నింపాలి కదా!
ప్రత్యర్థుల నామస్మరణే ధ్యేయంగా పెట్టుకున్న హిరణ్యకశిపుడు, కంసుడు, దుర్యోధనుడు మనకి ఆదర్శం కాకూడదు.
కొత్త సంవత్సరంలో ప్రజానాయకులందరూ, ప్రత్యర్థిని కాక ప్రజాసేవనే స్మరిస్తూ, దేశాన్ని ముందుకు తీసుకెడతారని ఆశిద్దాం.

అందరికీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

ఆగస్ట్ 5, 2020

భువినుండి దివికి

Posted in జన గళం, రచనాజాలం, సంగీత సమాచారం, సాహితీ సమాచారం at 11:52 ఉద. by వసుంధర

ఉత్తరాంధ్ర జానపద శిఖరం, ప్రజాకవి, కళాకారుడు అయిన వంగపండు ప్రసాదరావు కన్నుమూశారు. ఆయన ఆగస్ట్ 4 తెల్లవారుజామున విజయనగరం జిల్లాలోని స్వస్థలమైన పార్వతీపురంలోని స్వగృహంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రజల్ని చైతన్యపరిచే విధంగా వందలాది పాటలు రాసిన వంగపండుకు ఉత్తరాంధ్ర గద్దర్ గా పేరు ఉంది.

వంగపండు 1943 జూన్ లో జగన్నాథం, చిన్నతల్లి దంపతులకు పార్వతీపురం పెందబొండపల్లిలో జన్మించారు. జగన్నాథం, చిన్నతల్లి దంపతులకు ఆరుగురు సంతానం. అందులో ముగ్గురు అక్కాచెళ్లెల్లు, ముగ్గురు అన్నాదమ్ములు. అన్నదమ్ములలో పెద్దవాడే వంగపండు. ఆయన ఎస్ఎస్ఎల్ సీ ఫెయిల్ కావడంతో.. బొబ్బిలో ఐటీఐ చేశారు. ఉద్యమంలో చేరిన ఏడాదికే ఆయనకు విశాఖ షిప్ యార్డులో ఫిట్టర్ మెన్ గా ఉద్యోగం వచ్చింది. ఆయినా కూడా ఆయన ఉద్యమమే ఎక్కువ అనుకొని ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. వంగపండు 1972లో గద్దర్ తో కలిసి జన నాట్యమండలిని స్థాపించారు. ఆయన మూడు దశాబ్ధాలలో 300లకు పైగా పాటలు రాశారు. ఆయన రాసిన కొన్ని పాటలు పది బాషలలోకి అనువదించబడ్డాయి. యంత్రమెట్లా నడుస్తుందంటే అనే పాట ఇంగ్లీష్ లో కూడా అనువదించబడి.. అమెరికా, ఇంగ్లాండ్ లలో విడుదలయింది. ఏపీ ప్రభుత్వం చేతుల మీదుగా 2017లో కళారత్న పురస్కారం అందుకున్నారు.

ఏం పిల్లడో ఎల్దమొస్తవ.. ఏం పిల్లో ఎల్దమొస్తవా అంటూ ఆయన రాసి, పాడిన పాట ఉమ్మడి రాష్ట్రంలో ఒకప్పుడు మారుమోగింది. ఆయన వ్రాసిన దొమ్మరిసాని నవల ప్రముఖ మాసపత్రిక రచనలో ప్రచురితమైంది.

ప్రజాకవి

ఆయనొక పాటల దండు

జూన్ 11, 2020

నాటు సారాపై చల్లండి సిరా…

Posted in కథల పోటీలు, కవితాజాలం, జన గళం, రచనాజాలం at 11:07 ఉద. by వసుంధర

దొంగ చాటుగా చేస్తున్న నాటు సారా తయారీకి వ్యతిరేకంగా (అక్రమంగా సారా వండడం గురించి మాత్రమే) ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలలో

దాని వలన సమాజానికి ఎంత నష్టమో తెలియజేయుచూ పాట రూపంలో ప్రచారం చెయ్యాలని పోలీస్ డిపార్ట్ మెంటు వారు సంకల్పించారు. అందుకు రెండు పాటలు కావాలని కోరియున్నారు. వచ్చిన పాటలలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేస్తారు.ఎంపిక చేయబడిన పాటల రచయితలు పోలీస్ శాఖ వారిచే గుర్తించబడతారు. సో, కలం కదిలించి, రెండు పాటలను వాట్సాప్ కి ( 7989925995 ) పంపించండి. అందులో చివరన మీ పేరు, మీ సెల్ నెంబరు రాయండి.

మీ పాటలు పంపించడానికి ఆఖరు తేదీ:11-6-2020 సాయంత్రం వరకు పొడిగించబడింది
-ఆడారి గణేశ్వర రావు,

అక్రమంగా నాటుసారా తయారీకి వ్యతిరేకంగా ఫ్లెక్షీలపై రాసి ప్రచారం చేయుటకు
చక్కటి ” శీర్షిక ” ( Caption) ఈ వాట్సాప్ కి ( 7989925995 ) కి పంపించండి.
తక్కువ పదాలతో ఎక్కువ అర్ధవంతంగా ఉండాలి
చదివిన వారికి ఉత్తేజాన్ని కలిగించాలి. ఆలోచింపజేయాలి.
ఎంపిక చేసిన ఉత్తమ caption లని ఫ్లెక్షీలపై రాసి పోలీసు వారిచే విరివిగా ప్రచారం చేయుట జరుగుతుంది

సెప్టెంబర్ 15, 2019

(అ)రాచకీయంలో చురక పలుకులు

Posted in జన గళం, సాంఘికం-రాజకీయాలు, Uncategorized at 12:14 సా. by వసుంధర

సమకాలీన సమాజంలో ప్రతిరోజూ వినిపించే మాటలు, చేతలు – మనలో కలిగించే స్పందనలకు వేదిక ఈ శీర్షిక. ఆ స్పందనలు punch dialoguse లా క్లుప్తంగా ఉండాలి. పార్టీ, కుల, మత, వర్గ భావాల్లో ఏకపక్షం కాకూడదు. ఆవేశంకంటే ఆవేదన, అభిమానం కంటే ఆలోచనకు తావివ్వాలి. ఎవరైనా తమ స్పందనల్ని ఇక్కడ పంచుకోవచ్చు.

ప్రస్తుత సమాజపు తీరుతెన్నులపై మన పౌరుల భావజాలాన్ని నిజాయితీతో అవగాహన చేసుకునేందుకు ఈ స్పందన సహకరిస్తుందని ఆశిద్దాం.

చురక పలుకులు సెప్టెంబర్ 15 2019

‘నేనేం తప్పు చేశాను’ – ఎన్నికల్లో ఓడిన ఒక ప్రముఖ రాజకీయనేత                తప్పులెన్నువారు తమ తప్పు లెరుగరు’

‘కూలగొట్టడానికి క్షణాలు పడితే ప్రజా వేదిక                                                           కూడగట్టడం వాయిదాలు పడితే ప్రజా దర్బార్’

  1.  

      

     

 

జనవరి 29, 2019

ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు

Posted in జన గళం, సాంఘికం-రాజకీయాలు at 6:49 సా. by వసుంధర

‘రాజకీయం – అవినీతి? …… అవును – వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’

పి.ఆర్. బద్దిగం, కరీంనగర్ (ఈ శీర్శిక మీదేఫిబ్రవరి 1, 2019 స్వాతి వారపత్రిక)