జూన్ 10, 2021

సంస్మరణః పైడిమర్రి

Posted in విద్యారంగం, విద్యావేత్తలు, సాంఘికం-రాజకీయాలు at 8:38 సా. by వసుంధర

వాట్‍సాప్ బృందం బాలసాహితీశిల్పులు సౌజన్యంతో

మే 18, 2021

బడికి గుడిగా సహరి

Posted in విద్యారంగం, సాంఘికం-రాజకీయాలు at 4:50 సా. by వసుంధర

ఏప్రిల్ 21, 2021

పుస్తక సమీక్ష: ఆధునిక భారత తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్

Posted in పుస్తకాలు, విద్యారంగం, సాహితీ సమాచారం at 11:49 ఉద. by వసుంధర

వాట్‍సాప్ బృందం బాలసాహితీశిల్పులు సౌజన్యంతో

పుస్తక సమీక్ష:
ఆధునిక భారత తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్

రచయిత -సయ్యద్ నశీర్ అహ్మద్

మనదేశ తొలి ఉపాధ్యాయినిగా సావిత్రి బాయి పూలే అని అందరికి తెలుసు.కానీ ఆమెతో కలిసి పనిచేసి బాలికా విద్యకి కృషి చేసిన మరో మహిళ ఉన్నారు.ఆమే ఫాతిమా బేగం.ఆమె ఆధునిక భారత తొలి ముస్లిం ఉపాధ్యాయినిగా పేరు పొందారు.నిన్న మొన్నటి వరకు మనకు ఆమె గురించి పెద్దగా సమాచారం తెలియదు.కానీ ప్రముఖ రచయిత సయ్యద్ నశీర్ అహ్మద్ ఫాతిమా గురించి పరిశోధించి కొంత సమాచారాన్ని మనకు ఒక పుస్తక రూపంలో ఇవ్వగలిగారు.వారి ప్రయత్నం అభినందనీయం.

1850 వ ప్రాంతంలో పూలే దంపతులు మనదేశంలో బాలి కా విద్యకి పునాదులు వేశారు.అయితే వారి పనులకు ఆనాటి సమాజం నుండి తగినంత మద్దతు లభించలేదు.జ్యోతిరావు పూలే తండ్రి గోవిందరావు పూలే పై సంస్కరణలకి ఇష్టపడని వారు పూలే దంపతులని ఇంటినుంచి బయటికి పంపమని ఒత్తిడి చేశారు. వారి ఒత్తిడి భరించలేక పూలే దంపతులని ఆయన బయటికి పంపారు.ఆ సమయంలో పూలే దంపతులకు ఉస్మాన్ షేక్, ఆయన సోదరి ఫాతిమా ఆశ్రయం కల్పించారు.అంటే ఫాతిమా లేకుంటే పూలే దంపతుల సేవలు పరిపూర్ణం కావు.1856 లో సావిత్రి బాయి అనారోగ్యం కారణంగా చాలా రోజులు పుట్టింట్లో గడపాల్సి వచ్చింది. ఆ సమయంలో ఫాతిమా పాఠశాలలు నిర్వహణ బాధ్యతలని తీసుకొంది.1856 అక్టోబర్ 10 న సావిత్రి తన భర్తకు రాసిన లేఖలో ఫాతిమా గురించి రాసారు. ఫాతిమా చరిత్రకు ఈ లేఖే ప్రాణం పోసింది.
ఆనాటి సమాజంలో బహుజనులకి చదువుకోవడానికి అవకాశమే ఉండేది కాదు. ఇక స్త్రీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి హక్కులని కాలరాసిన రోజులవి.
సమాజం నుండి మద్దతు లేకపోయినా, ఉపాధ్యాయినిల కొరత ఉన్నా, సావిత్రీ, ఫాతిమా లు బాలికల విద్యకి చేసిన పోరాటం చాలా గొప్పది.
ఈ పుస్తకంలో రచయిత అవసరమైన ప్రతిచోటా తగిన చారిత్రక ఆధారాలతో సహా ఎన్నో కొత్త విషయాలు మన ముందుంచారు.శకలాలుగా ఉన్న ఫాతిమా చరిత్రని వెతికి ఒక వరుస క్రమంలో పెట్టి పాఠకులకి అందించారు.170 సంవత్సరాల క్రితమే మనదేశం లో ముస్లింలు, బహుజనులు ఐక్యంగా తమ హక్కుల కోసం పోరాడారు అనే విషయం మనకి రచయిత ద్వారా తెలుస్తోంది.ఫాతిమాకి చరిత్రలో జరిగిన అన్యాయాన్ని సరిచేయాల్సి ఉంది.ఆమె గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే సయ్యద్ నశీర్ అహ్మద్ రాసిన ఆధునిక భారత తొలి ముస్లిం ఉపాధ్యాయిని :ఫాతిమా షేక్ పుస్తకం చదవాల్సిందే.
పబ్లిషర్స్:ఆజాద్ హౌస్ ఆఫ్ పబ్లికేషన్స్, అమరావతి రోడ్,ప
ఉండవల్లి.పేజీలు 72.ధర 50 రూపాయలు.ముద్రణ 2021
ప్రతుల కోసం :సయ్యద్ నశీర్ అహ్మద్,ఫోన్:9440241727
వ్యాసకర్త యమ్. రామ్ ప్రదీప్
తిరువూరు,9492712836

ఏప్రిల్ 3, 2021

చంద్రమోహ‌న్ స్మార‌క పుర‌స్కారాలు

Posted in విద్యారంగం, సాహితీ సమాచారం at 12:27 సా. by వసుంధర

వ‌సుంధ‌ర విజ్ఞాన వికాస మండ‌లి
సామాజిక యువ‌చైత‌న్య వేదిక
రి.నెం-4393-96‌
8ఇంక్లయిన్‌కాల‌నీ, గోదావ‌రిఖ‌ని
పెద్ద‌ప‌ల్లి జిల్లా ,తెలంగాణ‌రాష్ట్రం

చంద్రమోహ‌న్ స్మార‌క పుర‌స్కారాలు
గ‌త ఆరేండ్లుగా విద్యారంగంలో కృషిచేస్తున్న వారికి ఇస్తున్న బామండ్ల‌ప‌ల్లి చంద్ర‌మోహ‌న్ స్మార‌క పుర‌స్కారాల‌ను రెండు సంవ‌త్స‌రాల‌కు గాను ప్ర‌క‌టిస్తున్నాము. గ‌తేడాది క‌రోనా మూలంగా ఇవ్వ‌లేక‌పోయిన పుర‌స్కారంతో పాటు ఈ ఏడాది పుర‌స్కారం కూడా ప్ర‌క‌టిస్తున్నాం.
విద్యారంగంలో స‌మూల మార్పులు, విద్యార్థుల్లో విద్యా నైపుణ్య‌త పెంపుద‌ల‌కు కృషిచేస్తున్న వారికి ఈ పుర‌స్కారాల‌ను అందిస్తున్నాము. కాగా 2020 సంవ‌త్స‌రానికి గాను స్నేహ‌ల‌త ఉపాధ్యాయురాలు (క‌ల్వ‌చ‌ర్ల, ప్ర‌భుత్వ‌పాఠ‌శాల‌), కె. మాధూరి ఉపాధ్యాయురాలు (బాలికోన్న‌త పాఠ‌శాల‌, గోదావ‌రిఖ‌ని)ల‌కు సంయుక్తంగా పుర‌స్కారాన్ని అందించ‌నున్నాము. 2021 సంవ‌త్స‌రానికి గాను అన్న‌వ‌రం శ్రీనివాస్, స్కూల్ అసిస్టెంట్‌, వేగురుప‌ల్లి మాన‌కోండూరును ఎంపిక చేయ‌డం జ‌రిగింది. త్వ‌ర‌లోనే ఈ పుర‌స్కారాల తేదిని ప్ర‌క‌టిస్తాము.

మధుక‌ర్ వైద్యుల‌, వ్య‌వ‌స్థాప‌కులు, చదువువెంక‌ట‌రెడ్డి అధ్య‌క్షులు, క‌ట్కూరిశంక‌ర్‌, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, భూమ‌య్య‌, ప్ర‌.కార్య‌దర్శి, మంద‌ల ర‌వింద‌ర్‌రెడ్డి.

డిసెంబర్ 1, 2020

ఉచిత శిక్షణ

Posted in విద్యారంగం at 6:50 సా. by వసుంధర

తరువాతి పేజీ