డిసెంబర్ 17, 2020

పలుకే లిపిగా….

Posted in విద్యావేత్తలు, సాహితీ సమాచారం at 11:13 ఉద. by వసుంధర

మీ ఆలోచనల్ని మాటల్లో పలికితే – వాటిని అక్షరాలుగా మార్చొచ్చు.

మీ దగ్గర వ్రాతప్రతి ఉంటే చదవడమే టైపింగు కావచ్చు.

ఇది voice typing సదుపాయం. అదీ తెలుగులో.

అందుకోసం – మీరు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చెయ్యండి. docs.google.com అనే సైటుకి వెళ్లండి. కొన్ని డాక్యుమెంట్లు కనిపిస్తాయి. వాటిలో blank ఎంచుకుని క్లిక్ చెయ్యండి. కొంచెం పైన వరుసగా file, edit, view, insert వగైరాలు కనిపిస్తాయి. అక్కడ Tools మీద క్లిక్ చెయ్యండి. కనబడిన బ్లాకులో voice typing మీద క్లిక్ చెయ్యండి.

అప్పుడు ఎడంపక్క నల్లగా మైక్రోఫోన్ బొమ్మ కనబడుతుంది. దానికి పైన English అని వ్రాసి ఉంటుంది. దాని పక్కన ఉన్న యారో మార్కుమీద క్లిక్ చేస్తే ఒక పెద్ద బ్లాకు వస్తుంది. అందులో బోలెడు భాషల పేర్లు ఉంటాయి. బాగా క్రిందన తెలుగు కనబడుతుంది. దానిమీద క్లిక్ చెయ్యండి. తర్వాత మైక్రొఫోను కింద click to speak అని వ్రాసి ఉన్న బటనుపై క్లిక్ చెయ్యండి. మైక్రోఫోను ఎర్రబడుతుంది.

ఇక మాట్లాడ్డం మొదలుపెట్టండి. మీ మాటలు తెలుగు లిపిలో టైపవుతూ కనిపిస్తాయి.

ఎడిటింగు వగైరా మిగతా సదుపాయాలు కూడా అక్కడే ఉన్నాయి.

కీబోర్డుమీద వేళ్లు పెట్టనవసరం లేకుండా, నోటిమాటలతో తెలుగులో టైపింగు చేసుకునే – ఈ గొప్ప సదుపాయాన్ని అందించిన గూగు ల్ క్రోమ్‍ని మనసులో అభినందించుకుంటూ, ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ వాయిస్ టైపింగుని ఎంజాయ్ చేద్దాం.

ఇదంతా చదువుతుంటే గజిబిజిగా అనిపించిందా? మీరీ సదుపాయాన్ని వాడుతున్నప్పుడు – అబ్బా, ఇంత సులభమా అనిపిస్తుంది.

ఇంత చక్కని సదుపాయాన్ని అమెరికానుంచి విడియో ద్వారా మాకు పరిచయం చేసిన శ్రీ రాయవరపు ఆదినారాయణరావుకి ధన్యవాదాలు.

నవంబర్ 27, 2020

సంస్మరణః గణితబ్రహ్మ లక్కోజు సంజీవరాయశర్మ

Posted in విద్యావేత్తలు at 7:15 సా. by వసుంధర

నేడు గణితబ్రహ్మ లక్కోజు సంజీవరాయశర్మ జయంతి
(నవంబర్ 27, 1907 – డిసెంబరు 2, 1998) ప్రపంచంలో 6వేల గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తి. సంజీవరాయశర్మ 1907 నవంబర్ 27 న కడపజిల్లా ప్రొద్దుటూరు మండలంలోని కల్లూరులో జన్మించాడు.

జన్మతః అంధుడు. అప్పట్లో బ్రెయిలీ లిపి కానీ, అంధుల్ని చేరదీసే వ్యవస్థ కానీ లేదు. శర్మ గారి అక్క పాఠశాలలో చదివినవి ఇంటిదగ్గర గొంతెత్తి బిగ్గరగా మననం చేస్తే, అవి విని, గుర్తుపెట్టుకుని, గణితంలో అపార విజ్ఞానం సాధించాడు.

తండ్రి మరణించడంతో, తల్లి పెంచి పెద్దచేసింది. కల్లూరులో రైతులకు ధాన్యం ధర, భూమి కొలతలు చెప్పేవారు. వారు ఆయనకి కొంత సొమ్ము చెల్లించేవారు. గణితంలో పేరు ప్రఖ్యాతులు పొందుతున్న కాలంలోనే ఆయన వయొలిన్ పట్ల ఆకర్షితుడై నేర్చుకొన్నారు.

శ్రీ సంజీవరాయశర్మ తొలిసారి 1928 లో గణితావధానం నిర్వహించారు. అప్పటినుంచి 1995వరకు ఆయన ఆంధ్రప్రదేశ్,కర్ణాటక, మహారాష్ట్ర, బీహారు,ఢిల్లీ రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి, ఆరువేల ప్రదర్శనలు ఇచ్చాడు. మహానగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాదు లలోను పలు ప్రదర్శనలను ఇచ్చారు. అఖిల భారత కాంగ్రెస్మహాసభలు 1928 నవంబర్ 15న నంద్యాలలో జరిగినపుడు, ప్రధాన ఆకర్షణ శ్రీసంజీవరాయశర్మ గారి గణితావధానమే.
సాధారణంగా, గణితావధానం లో, పుట్టిన తేదీ ఇస్తే, అది ఏ వారము అయిందో చెప్పడం ఒక అంశం-కాని, ఈ విషయంలో శ్రీ సంజీవరాయశర్మకు ఒక ప్రత్యేకత ఉంది.
ఆ పుట్టిన తేదీ ఏ వారము అయినదో చెప్పడమే కాకుండా, ఆనాటి పూర్తి పంచాంగము చెప్పేవారు. అంటే, పుట్టిన తేదీ, సమయము, ప్రదేశము చెప్పగానే, దానికి సంబంధించిన తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగము, వర్జ్యము, రాశి కూడాచెప్పి, కొంతవరకు జాతకం కూడాచెప్పేవారు.

ఈ ప్రత్యేకతను (మానవ గణనయంత్రంగా [Human Computer] పేరొందిన శకుంతలాదేవితో సహా) మరెవరూ చూపలేకపోయారు. ఆవిధంగా,
ఇది అనితరసాధ్యమైన ప్రత్యేకత 1966 డిసెంబరు ఏడో తేదీ.. అది హైదరాబాదులో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం వేదిక 2 power 103 ఎంత?

దానికి సమాధానంలో ముప్పైరెండు అంకెలున్న సంఖ్య చెప్పారు అవధాని.
‘క’ నుంచి ‘క్ష’ వరకు ఉన్న అక్షరాలకు వరుసగా నంబర్లు వేస్తే, ‘స, రి, గ, మ, ప, ద, ని” అక్షరాల లబ్దం ఎంత? ఏభై రెండు కోట్ల అయిదు లక్షల ఆరువేలు…

కలం, కాగితం రెండూ ఉన్నా గంటల కొద్దీ సమయంలో కూడా చెప్పలేని సమాధానాల్ని ఆయన ప్రశ్న అడిగినంత సులభంగా, ఏమాత్రం తడుముకోకుండా, ఆలస్యం లేకుండా సమాధానం చెప్పేవారు! ఆయనేమన్నా విద్యావంతుడా ?… కాదు.

పోనీ రెండు కళ్లూ ఉండి అంకెలిలా ఉంటాయి, సంఖ్యలిలా ఏర్పడతాయని చూడగలిగిన వారా ?… కాదు. పుట్టుగుడ్డి!
పై ప్రశ్నల వంటివి ఆయన్ని వేలల్లో అడిగారు. ఆయన చెప్పిన సమాధానాలు సరిచూడడానికి గణిత మేధావులకు గంటల తరబడి సమయం కావలసి వచ్చింది. )
ఆయనే గణిత బ్రహ్మ డా. లక్కోజు సంజీవరాయశర్మ “అంకెల ఆకాశంలో అమావాస్య చంద్రుడు. ప్రపంచంలో ఆరువేల గణితావధానాలు చేసిన ఏకైక మేధావి!” శ్రీపాద కథల్లో వడ్ల గింజల ప్రస్తావన తెలిసిందే. రాజుని చదరంగంలో ఓడించినందుకు బహుమానంగా…
మొదటి గడిలో ఒక వడ్లగింజ,
రెండో గడిలో రెండు గింజలు,
మూడో గడిలో నాలుగు, నాలుగో గడిలో ఎనిమిది… ఇలా అరవై నాలుగు గళ్లు నింపి ఇమ్మంటాడతను. రాజు ఓస్ ఇంతేనా అనుకొంటారు. తీరా ఎన్ని వడ్ల గింజలో తేల్చాల్సి వచ్చేటప్పటికీ.. అందరూ తలలు పట్టుకుంటారు!

దానికి సంజీవరాయశర్మ చెప్పిన సమాధానం… ”ఒక కోటి 84 లక్షల,
46 వేల 74 కోట్ల 40 లక్షల,
73 వేల, 70 కోట్ల, 95 లక్షల 51 వేల, 615 వడ్ల గింజలన్నమాట… (1,84,46,74,40,73,70,95,51,615!)
ఒక ఘనపు మీటరు పరిమాణం ఉన్న బస్తాలో దాదాపు ఒక కోటి యాభై లక్షల వడ్లగింజలు పడితే…

అటువంటి బస్తాలు ఒక కోటి ఇరవై లక్షల వేల కోట్లు ఘనపు మీటర్ల బస్తాలు అవసరం! నాలుగు మీటర్ల ఎత్తు, పది మీటర్ల వెడల్పు గల.. ఒక గాదెలో ఆ ధాన్యం నింపాలంటే ఆ గాదె పొడవు మూడు వందల కోట్ల కిలోమీటర్లు ఉండాలి. ఈ దూరం భూమికీ సూర్యుడికీ మధ్య ఉన్న దూరానికి 20 ఇంతలు!

అంత ధాన్యం ఈ భూమండలంపై ఉండదు! ఇదంతా అబ్బురమని పించవచ్చు. కానీ సంజీవరాయశర్మ గణితావధాన వివరణ మహిమ అదంతా! ఒకటి, రెండు, మూడు…. ఎలా ఉంటాయో తెలియకుండానే గణితబ్రహ్మ అయ్యారు!

సంవత్సరాలు, తిధులు, నెలలు, నక్షిత్రాలు, వారాలు, పక్షాలు… గంటలు, నిముషాలు, సెకనులు ఏవీ తెలియకున్నా అన్నీ తెలుసుకొని గణితంలో అపార విజ్ఞానం సాధించారు.. తొలిసారి 1928లో గణితావధానం నిర్వహిం చిన అప్పట్నించీ 1995 వరకు ఆయన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, బీహారు, ఢిల్లీ రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి ఆరువేల ప్రదర్శనలు ఇచ్చారు. మహానగరాలైన ఢిల్లీ, ముంబాయి, చెన్నై, బెంగుళూరు, హైదరాబాదుల్లోను పలు ప్రదర్శనలు నిర్వహించారు.. అప్పట్లో మద్రాసు గవర్నరు, భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వంటి జాతీయ ప్రముఖులు
ఆయన మేధాశక్తికి ఆశ్చర్యచకితులయ్యారు! నాలుగువేల సంవత్సరాల వరకు సరిపోయే క్యాలండరు సైతం తయారుచేశారు. అప్పటి #రాష్ట్రపతి డా. #రాజేంద్రప్రసాద్ శర్మ ప్రతిభకు ముగ్ధులై తన దగ్గర ఉన్న సొమ్ము ఎం.ఓ చేయడం విశేషం!
అప్పట్లో అనీబ్‌సెంట్, నెహ్రూ,
రాజేంద్రప్రసాద్‌లతో పాటు, బెజవాడ గోపాలరెడ్డి, శ్రీమాలి, హుమాయూన్ కబీర్, కాశీనాధుని నాగేశ్వరరావు, పి.వి.రాజమన్నార్, గవర్నర్ సర్ జార్జి స్టాన్లే, మేధ్స్ విజార్డ్ శకుంతలాదేవి తదితరులంతా శర్మ గణితావధాన.. ప్రదర్శనలు స్వయంగా తిలకించి అన్యులకు సాధ్యం కాదని వేనోళ్లా కీర్తించారు.

శర్మ పలు విశ్వవిద్యాలయాల్లో, ప్రసిద్ధ కళాశాలల్లో అవధానం ప్రదర్శించి విద్యార్ధుల్ని ఉత్తేజితుల్ని చేశారు. అలాగే గ్రంధాలయాల పిలుపునందుకొని పలు గ్రంధాలయాల్లోనూ తమ గణితావధాన ప్రదర్శనలు చేశారు.
అలాగే మేధమేటికల్ సొసైటీల ఆహ్వానం మేరకు వాటి సభ్యుల ముందు ప్రదర్శనలిచ్చారు.
ఆయన ప్రతిభ రాయలసీమ నుంచి అంతర్జాతీయ వేదికలకెక్కింది. దురదృష్టం ఏమిటంటే 1993లో అమెరికా సందర్శించాలని ఆయన్ని అక్కడి తెలుగు సంఘాలు ఆహ్వానించినా సకాలంలో వీసా రాకపోవడంతో ఆ మేథావి ఇల్లు కదలలేకపోయారు.

వివిధ విశ్వవిద్యాలయాలు… ఆయన్ని సత్కరించాయి. కొన్ని ఆయన్ని బంగారు పతకాలతో సత్కరించాయి. దురదృష్టమేమిటంటే 1964 అక్టోబరు పదో తేదీన శర్మ రేణిగుంట నుంచి తిరుపతికి రైల్లో ప్రయాణిస్తున్న సందర్భంలో ఆయన 14 బంగారు పతకాల సూట్‌కేసును దొంగలు తస్కరించారు.

ప్రపంచంలో అంధులైన మహా ప్రతిభావంతుల్లో జాన్‌మిల్టన్, బ్రెయిలీ కనుగొన్న హెల్‌న్ కెల్లర్, ద్వారం వెంకటస్వామినాయుడు వంటివారు పుట్టుకతో అంధులు కారు. తదనంతర కాలంలో వారు అంధులయ్యారు. మన దేశంలో గణిత శాస్త్రజ్ఞుల్లో భాస్కరాచార్యులు, రామానుజన్, శకుంతలాదేవి వంటివారు.. మంచి శిక్షణ పొందారు.

కానీ సంజీవరాయశర్మ అంధుడే కాక చదువు సంధ్యలు లేని వ్యక్తి. అంతా వినికిడి జ్ఞానమే… ప్రపంచంలో ఆరుగురు గణిత శాస్త్రజ్ఞుల్లో ఒకరు

ఆనాడే బ్రిటిష్ వైస్రాయ్ ”ఈయన మా దేశంలో పుట్టి వుంటే దేశం నడిబొడ్డున విగ్రహం పెట్టి రోజూ పూజలు.. చేసేవాళ్లం” అని శర్మనుద్దేశించి అన్నారు.

శకుంతలాదేవి స్వయంగా నాకన్నా ప్రతిభావంతుడు అని అంగీకరించింది. అయినా ఆయన పేదరికంలోనే జీవించారు. శ్రీనివాస రామానుజన్ వంటి మేధావిని గుర్తించని దేశమిది. అలాగే సంజీవరాయశర్మని రక్షించుకోలేకపోయింది. 1998 డిసెంబరు రెండోతేదీన సంజీవరాయశర్మ అస్తమించారు. ‘అంక విద్యాసాగర’ విశ్వసాంఖ్యాచార్య, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్ పొందిన శర్మ తన చివరి రోజుల్ని శ్రీ కాళహస్తీశ్వరస్వామి సన్నిధిలో వయొలిన్ మీటుతూ స్వామినర్చిస్తూ గడిపారు!

నిజానికి… ఈ నోబెల్ బహుమతులు, మెగ్‌సెసేలు, జ్ఞాన్‌పీఠ్‌లు…
ఆయన ప్రతిభ ముందు ఎంత చిన్నవో!

ఆగస్ట్ 18, 2020

సాహితీ ‘లంకె’ బిందువులు

Posted in కళారంగం, మన కథకులు, మన పాత్రికేయులు, రచనాజాలం, విద్యావేత్తలు, సంగీత సమాచారం, సాహితీ సమాచారం at 8:51 సా. by వసుంధర

సాహితీవేత్త రాపాక కన్నుమూత సాహితీ ప్రియంభావుకుడు రాపాక సాహితీ కృషీవలుడు రాపాక

మణిపూసలు

వృథా పరిశోధన

నువ్వు లేవు నీ గజల్ ఉంది

పండిట్ జస్‍రాజ్ మహాప్రస్థానం

జూన్ 19, 2020

మల్లంపల్లి వారిపై నార్ల మాట

Posted in చరిత్ర, విద్యావేత్తలు, సాంఘికం-రాజకీయాలు at 7:55 సా. by వసుంధర

నేటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ఈ వ్యాసం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మే 20, 2020

ప్రశంసః డాక్టర్ రేమెళ్ళ అవధానులు

Posted in విద్యావేత్తలు, సాంఘికం-రాజకీయాలు, సాహితీ సమాచారం at 11:55 ఉద. by వసుంధర

లంకె

రేమెళ్ళ అవధానులు
డాక్టర్ రేమెళ్ళ అవధానులు 1948 సెప్టెంబరు 25 తేదీన తూర్పు గోదావరి జిల్లా కోనసీమ లోని పొడగట్లపల్లిలో సూర్యనారాయణ, లక్ష్మీనరసమ్మ దంపతులకు జన్మించాడు.[1] 1969 లో పరమాణు భౌతిక శాస్త్రంలో ఎమ్మెస్సీ చేసాడు. రాజోలు డిగ్రీ కళాశాలలో భౌతికశాస్త్ర ఉపన్యాసకునిగా ఉద్యోగం చేశాడు. అలా ఉద్యోగం చేస్తూ తీరిక సమయాన్ని వృధా చేయక తనకిష్టమైన వేదాలను నేర్చుకోవాలనే అభిలాష కొద్దీ దగ్గరలో ఉన్న వేద పాఠశాలకు వెళ్ళి వేదాలను నేర్చుకునేవాడు. కానీ 1971 లో హైదరాబాదులో ఇ.సి.ఐ.ఎల్ కంపెనీలో ఉద్యోగం రావడంతో హైదరాబాదు వచ్చేశాడు. ఇ.సి.ఐ.ఎల్ భారత దేశంలోనే మొట్టమొదటి కంప్యూటర్ల తయారీ కంపెనీ. ఆ కంపెనీలో శిక్షణలో భాగంగా కొన్ని పుస్తకాలు చదువుతుంటే, ఎ ప్లస్ బి హోల్ స్కేర్ అనే గణిత సమస్యకు సంబంధించిన చరిత్ర కనబడింది. దానిని మన భారతీయులు మూడు వేల ఏండ్ల క్రిందటే కనుగొన్నారని తెలిశాక, మన ప్రాచీన గ్రంథాలపై మరింత ఆసక్తి పెరిగింది అవధానులు కి. ఇ.సి.ఐ.ఎల్.లో ఎనిమిదేండ్లు పనిచేసి, తిరిగి వేదాధ్యయనాన్ని కొనసాగించాడు. అంతరించిన పురాతన గ్రంథాలు అంతరించి పోగా మిగిలిన వాటినైనా రక్షించు కోవాలని అవధానులకు ఆలోచన వచ్చింది. దాన్ని కార్య రూపంలోకి తీసికొనిరావడానికి ప్రయత్నించాడు.

కంప్యూటరు లోకి తెలుగు సవరించు
1976 నాటికి ఏ భారతీయ భాషనూ కంప్యూటరీకరించలేదు. అందుచేత తెలుగును కంప్యూటరీకరించాలనే ఆలోచన వచ్చింది. అవధానులు తన మిత్రులతో కలిసి ఆరు నెలల పాటు శ్రమించి తెలుగు అక్షరాలను కంప్యూటరులో ప్రవేశ పెట్టాడు. ఆ విధంగా 1976 లో భారత దేశంలో కంప్యూటరు లోకి ఎక్కిన మొట్టమొదటి భారతీయ భాష తెలుగే. అప్పట్లో తెలుగు అధికార భాషా సంఘ అధ్యక్షుడు వావిలాల గోపాల కృష్ణయ్య అభినందనలతో కంప్యూటరు లో తెలుగు అనే వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వార్త పార్లమెంటు వరకూ వెళ్ళి, కంప్యూటరు లోకి తెలుగు వచ్చినపుడు, హిందీ ఎందుకు రాదు? అని ఎం.పీ లందరు తమ పై అధికారులకు లేఖలు వ్రాశారు. ఆ విధంగా హిందీని కూడా కంప్యూటరులో పెట్టే పనిని అవధాని చేపట్టవలసి వచ్చింది. దానితో పార్లమెంటరీ కమిటీ వీరి పని తీరుపై సంతృప్తి చెంది, ఇంకా అభివృద్ధి చేయాలని కోరింది.

నిమ్స్ కంప్యూటరీకరణ సవరించు
అవధానులకు హైదరాబాదు లోని NIMS డైరెక్టరు కాకర్ల సుబ్బారావుతో పరిచయం ఏర్పడింది. ఆయన కోరిక మేరకు NIMS ను కంప్యూటరీకరణ చేసి, అక్కడే సుమారు 18 సంవత్సరాలు పనిచేశాడు.

వేదాల కంప్యూటరీకరణ సవరించు
NIMS లో పనిచేస్తున్నప్పుడే ఒక సందర్భంలో తి.తి.దే. వారు ప్రచురించిన పుస్తకాలను చడవడం తటస్థించింది అవధానులకు. దాని వలన తెలిసిన విషయమేమంటే…. వేదాల గురించి ఉన్న మొత్తం 1131 శాఖలకు గాను 7 శాఖలు మాత్రమే మిగిలాయని., అవి కూడా అంతరించి పోవడానికి ఎంతో కాలం పట్టదనీ అర్థ మయి పోయింది. వాటినన్నా కాపాడుకోవాలంటే…. కనీసం వాటిని రికార్డింగ్ చేస్తే తాత్కాలికంగా నైనా వాటిని కాపాడు కోవచ్చని పించింది. కానీ ఋగ్వేదం మరీ ప్రమాదంలో ఉన్నదని తెలిసింది. తనకు యజుర్వేదం మాత్రమే తెలుసు. ఋగ్వేదం తెలిసిన వారెవరున్నారా? యని అన్వేషించగా మహారాష్ట్రలో ఒకాయన ఉన్నాడని తెలిసి, అక్కడికి వెళ్ళి అతన్ని కుటుంబం సమేతంగా తీసుకొచ్చి, వారి పోషణా బాధ్యతలన్నీ తానే తీసుకొని 1992 లో వేదాల రికార్డింగ్ మొదలు పెట్టాడు.

అఖిలభారత వేద సమ్మేళనంలో :
అదే సమయానికి తి.తి.దే. వారు తిరుపతిలో అఖిల భారత వేదశాస్త్ర సమ్మేళనం నిర్వహించారు. దానికి అప్పటి భారతదేశ అధ్యక్షుడు శంకర్ దయాళ్ శర్మ వస్తున్నారనీ ఆ సందర్భంగా తనను వేదాల గురించి ఒక ప్రదర్శన ఇవ్వవలసినదిగా తి.తి.దే. వారు కోరగా ‘నమకం’ లోని మూడు మంత్రాలనూ, వాటి అర్థాలనూ ‘సీ లాంగ్వేజి ‘ సహాయంతో కంప్యూటర్ లో పెట్టి చూపగా శంకర్ దయాళ్ శర్మ చాలా సంతోషించి ఈ ప్రాజెక్టుని పూర్తి చేయమని అవధానికి చెప్పారు. కానీ ఈ ప్రాజెక్టును ప్రారంభించాలంటే తనకు ఒక మంచి కంప్యూటర్ కావాలి. దానిని కొనే స్తోమత అవధానులకు లేదు. మనసుంటే మార్గము దేవుడే చూపిస్తాడన్నట్టు…. తనకు తెలిసిన మిత్రుడు సోమయాజులు ఆ విషయాన్ని ‘అశ్విని హెయిర్ ఆయిల్ ‘ అధినేత అయిన సుబ్బారావుకు తెలుపగా,… సుబ్బారావు ఉదారంగా ఒకలక్షా ఇరవై వేల రూపాయాలను ఇవ్వగా దాంతో ఒక అధునాతన కంప్యూటర్ కొన్నాడు అవధాని. కంప్యూటరు మీద పనిచేస్తున్న వారికి జీత భత్యాలను తన జీతంలో నుండి ఇస్తున్నందున ఎక్కువ మందిని పెట్టుకోలేక పోయాడు. దానికి ప్రత్యామ్నాయంగా విరాళాలు సేకరించడానికి వేదభారతి ట్రస్టు ను ప్రారంభించాడు. చేయవలసిన పని ఎక్కువగా ఉండటంతో అందరితో కలిసి తాను కూడా రాత్రుళ్ళు పనిచేసేవాడు.

యజుర్వేద అనుక్రమణికలు :
ఆ సందర్భంలో వేదాలలో సైన్సు, లెక్కలు, వైద్యం, అంతరిక్ష శాస్త్రం మొదలగు శాస్త్రాలన్నీ కనబడ్డాయి అవధానికి. ఆ స్ఫూర్తితో పనిని మరింత వేగిరి పరచి, 1995 నాటికి యజుర్వేదానికి 7 అనుక్రమణికలు వ్రాసి కంప్యూటరీకించి దేశంలోనే మొట్టమొదటి సారిగా మల్టీమీడియాలో రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మకు చూపించాడు. దానిని అప్పటి దేశ ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయి ఆవిష్కరించాడు; ప్రశంసించాడు. ఆ విధంగా అవధాని చిరకాల కోరిక కొంత వరకైనా నెరవేరింది. వేదభారతి ట్రస్టు ద్వారా ఇప్పటి వరకూ 700 గంటలు మాత్రమే రికార్డింగు పూర్తయింది. దానిని మల్టీమీడియా సీడీ ల రూపంలో ప్రజలకు అందుబాటులోనికి తెచ్చారు. కానీ మిగిలిన వేదశబ్దాల్ని రికార్డింగ్ చేస్తే సుమారు 2500 గంటల నిడివి గల రికార్డు తయారు కాగలదు. అందుకు అవధాని ఒక్కనితో అది సాధ్యమయ్యే పని కాదు. విద్వాంసులు, వదాన్యులు చేయూత నిస్తే అదేమంత కష్టమైన పని కాదంటాడు అవదాని. ఆవిధంగా మన వేద విజ్ఞానాన్ని పరిరక్షించు కున్న వాళ్ళమౌతాము.

ఇతర రంగాలలో సేవలు :
పరమాణు భౌతిక శాస్త్రంలో ఎం.ఎస్.సి. చేసిన అవధాని తనకు ఆసక్తి కరమైన వేదాలలోని యజుర్వేదం నేర్చుకున్నాడు. ఏదైనా శాస్త్రం నేర్చుకోవాలనే అభిలాషతో ‘మీమాంస ‘ శాస్త్రం నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఎమ్మె సంస్కృతం, జ్యోతిషం చేశాడు. అదే విధంగా వేదాల్లో సైన్సు భూకంపాలు జ్యోతిషం అనే అంశాలమీద పీ.హెచ్.డీలు చేశాడు. తాను చేసిన బహుభాషా మల్టీమీడియా వేది డేటాబేస్ డిజైన్ కి భారత ప్రభుత్వం పేటెంట్ ఇచ్చి, సంస్కృత మిత్ర బిరుదుతో సత్కరించింది.

SHRI VEDA BHARATHI
H.No. H Block-34,
MADHURANAGAR,
HYDERABAD-500 038,
Telangana, India

cell : 9849459316
Ph : 040-23812577.
http://www.shrivedabharathi.in
Email : shrivedabharathi@gmail.com

తరువాతి పేజీ