రెండు ఉగాది వెబ్ సంచికలు
- సహరి
అందరికీ శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. 💐💐💐
నూతన సంవత్సర కానుకగా ఈ వారం సహరి మీకు ఉచితంగా అందచేస్తున్నాము. ఈ క్రింద ఇచ్చిన లంకెలో సహరి చదవండి. మీ బంధుమిత్రులకు షేర్ చెయ్యండి.
http://guest.sahari.in/1617892600/09-04-2021/
2. కథామంజరి

ఈ క్రింద ఇచ్చిన లంకెలో కథామంజరి చదవండి
చారిత్రక నవలా రచన పోటీ
డాలస్ వాసి, శ్రీ జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం గారి సౌజన్యంతో….
వారి తల్లిదండ్రులు – జొన్నలగడ్డ రాంభొట్లు-సరోజమ్మ స్మారక
సిరికోన ఉత్తమ చారిత్రక నవలా రచన పోటీ
(రూ.25,000విలువ గలది)
నిబంధనలు- విధాన వివరాలు:
- అనాది కాలం నుంచి, స్వాతంత్ర్యోద్యమ కాలం వరకు
ఏ నాటిదైనా, తెలుగువారికి సంబంధించిన
చారిత్రక ఇతివృత్తమై ఉండాలి! - ముద్రణలో రెండు వందల పుటలకు తగ్గరాదు.
- పోటీ ఫలితాలు వెలువడిన వెంటనే రూ. 10,000/ విజేత
అకౌంటుకు పంపబడుతుంది. ముద్రిస్తున్నప్పుడు ఆ పై వ్యయం
గరిష్టంగా రూ.15,000/-కు మించకుండా అందజేయబడుతుంది. - లోన రెండో అట్ట మీద పురస్కారప్రదాత తల్లిదండ్రుల పేర్లు,ఫోటో,
వారి స్మారక పురస్కారవిజేత రచన అని ప్రచురించవలసి
ఉంటుంది. అంకితం మాత్రం తమ అభీష్టం ప్రకారం ఇచ్చుకోవచ్చు. - రచనపై హక్కులు రచయితకే ఉంటాయి. అయితే ఎపుడు
పునర్ముద్రించినా రెండో అట్టపై పై స్మారక పురస్కార వివరాలను
ఫోటో సహితంగా ముద్రించవలసి ఉంటుంది. - బహుమతి పొందిన నవలను సిరికోన భారతిలో సీరియల్ గా
ముద్రించటం జరుగుతుంది. 2021 చివరివరకు పుస్తకరూపంలో
తప్ప, మరెందులోనూ నవలను సీరియల్ గా ముద్రించకూడదు. - పురస్కార నిర్ణయంలో న్యాయనిర్ణేతలదే తుది తీర్పు!
- రచనలు పంపడానికి ఆఖరు తేదీ― 31 జులై 2021.
రానున్న ఆగస్ట్15 కున్న ప్రత్యేకత రీత్యా ఆ తేదీన ఫలితాలు
వెల్లడింపబడుతాయి. - సిరికోన లోని రచయిత్రులు/ రచయితలే కాక ఇంకెవరైనా
ఇందులో పాల్గొనవచ్చు! వీలైనంత ఎక్కువ మంది సిరికోన రచయితలు ఈ పోటీలో పాల్గొంటూ, ఈ వార్తను ఎక్కువమందికి అందేలా చూడాలని విజ్ఞప్తి!
సాలూరు కోయిలల కవి సమ్మేళనం
శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మీ సాలూరు సాహితీ మిత్ర బృందం రేపు ఉదయం 6 గంటల నుండి శ్రీ మాత వారి యూట్యూబ్ ఛానల్లో https://youtu.be/046rwvGsCZY అలాగే శ్రీ మీడియా వారి మూవీ ఛానల్లో (సిటీ కేబుల్) 9 గంటలకు మా విశాఖపై సాలూరు కోయిలలు కవి సమ్మేళనం ప్రసారం కాబోతున్నాయి. వీక్షించి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీయొక్క లైక్ కామెంటు అందించి subscribe చేసి మమ్మల్ని ఆశీర్వదించ వలసిందిగా మిక్కిలి వినయ పూర్వకంగా ప్రార్థిస్తున్నాం . . ఇట్లు : జె.బి. తిరుమలాచార్యులు మరియు కిలపర్తి దాలినాయుడు. అధ్యక్ష కార్యదర్శులు సాలూరు సాహితీ మిత్ర బృందం, సాలూరు.