జనవరి 5, 2021

మది మెచ్చిన వాక్యాలు పోటీ – ప్రతిలిపి

Posted in ఇతర పోటీలు, సాహితీ సమాచారం at 8:27 సా. by వసుంధర

లంకె

మది మెచ్చిన వాక్యాలు

మనసుకు హత్తుకునే వాక్యాలు రెండు ఉన్నా చాలు. మీ మనసు గడప నుండి రెండు వాక్యాలను ప్రతిలిపి సాహిత్య సాగరంలో ప్రచురణ చేయండి. ఈ పోటీలో పాల్గొనడానికి కవులు, రచయితలే కావాల్సిన అవసరం లేదు. ఎవరైనా పోటీలో పాల్గొనవచ్చు. మీ మనసు చెప్పే వాక్యాలను ప్రతిలిపిలో ప్రచురణ చేయండి.

ఈ పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు క్రింది విధముగా ఉండును:-

న్యాయనిర్ణేతలు అందించే ఫలితాల ఆధారంగా:-

మొదటి బహుమతి : 2000

రెండవ బహుమతి :  1000

ముఖ్యమైన తేదీలు :

1.మీ వాక్యాలు పంపడానికి చివరి తేది జనవరి- 28-2021.

2.జనవరి-30-2021న వాక్యాలను ప్రచురించి ఫలితాలు ప్రకటించే తేదీని ప్రకటించబడును. 

నియమాలు :-

1.ప్రతి ఒక్కరూ పదహైదు వాక్యాలు వరకు సబ్‌మిట్ చేయవచ్చు. వాక్యాలు పూర్తిగా మీ సొంతమై ఉండాలి.

2. గతంలో ప్రతిలిపిలో ప్రచురింపబడిన మీ వాక్యాలు పోటీకి సబ్‌మిట్ చేయరాదు. మరెక్కడైనా ప్రచురణ అయినవి సబ్‌మిట్ చేయవచ్చు.

3.సాధ్యమైనంత వరకు అక్షర దోషాలు లేకుండా చూసుకోండి.

పోటీలో పాల్గొనే పద్ధతి :-

1.ఈ పోటీకి మీ వాక్యాలను సమర్పించడానికి క్రింద ఉన్న “పాల్గొనండి” బటన్ పై క్లిక్ చేయండి.

2.మీ వాక్యాన్ని “ఇక్కడ రాయండి” అనే చోట మొదటి వాక్యాన్ని పోస్ట్ చేసి అప్‌లోడ్ సింబల్ పై క్లిక్ చేయండి.

3.వాక్యం యొక్క శీర్షిక రాసి “తరువాత” అనే బటన్ పై క్లిక్ చేయగానే వాక్యానికి తగ్గ ఫోటో అప్‌లోడ్ చేయడానికి “+” సింబల్ పై క్లిక్ చేసి ప్రతిలిపి ఫోటో గ్యాలరి మీకు నచ్చిన మరియు వాక్యానికి సరిపడిన ఫోటో జతచేయండి.

4.ఫోటో జత చేసి “తరువాత” అనే బటన్ పై క్లిక్ చేసి విభాగంలో “కవిత”, వర్గంలో మీ వాక్యం యొక్క వర్గం సెలెక్ట్ చేసి మీ వాక్యాన్ని సబ్‌మిట్ చేయండి.

5.అలాగే మీ రెండవ వాక్యం, మూడవ వాక్యం, నాలుగవ వాక్యం, ఐదవ వాక్యం ఇలా ఎన్ని అయినా సబ్‌మిట్ చేయగలరు.  

న్యాయనిర్ణేత అందించే ఫలితాలు ఆధారంగా:-

మీ వాక్యాలను మా న్యాయనిర్ణేతలు చదివి విజేతలను ప్రకటిస్తారు.

సందేహాలకు  : మెయిల్ – telugu@pratilipi.com  పాల్గొనండి

తానా బొమ్మల కథలు- 2021 ఫలితాలు

Posted in ఇతర పోటీలు, కథల పోటీలు, చిత్రజాలం, బాల బండారం, సాహితీ సమాచారం at 5:18 సా. by వసుంధర

డిసెంబర్ 10, 2020

ఫొటో కవితల పోటీ

Posted in ఇతర పోటీలు, కవితల పోటీలు, సాహితీ సమాచారం at 7:46 సా. by వసుంధర

ఫోటోకవిత
*
వంద పదాల భావాన్ని ఒక్క ఫోటో చెప్పగలుగుతాది.
ఒక్క ఫోటోలోని సారాంశాన్ని 2/3 లైనుల కవితతో చెప్పే ప్రక్రియ “ఫోటోకవిత” జనవరి 2021 నుండీ ప్రారంభం.

1.ఫోటో మీరు స్వయంగా తీసినదై వుండాలి.

  1. మంచి భావంతో చిన్న కవితై వుండాలి.

3 ప్రతీనెల 20న తేదీలోగా వాట్సాప్ ద్వారా ఈనెంబర్కి 7981146022కి పంపాలి.

4 ఉత్తమ ఫోటోకవితకి నగదు బహుమతి రూ. 500/- లు వుంటుంది.

నిర్వహణ.
-సాయి ప్రకాష్ తిరునగరి.
ప్రకృతి-సంస్కృతి.
విశాఖ.

డిసెంబర్ 7, 2020

పోటీ ఫలితాలు – తెలుగు జ్యోతి

Posted in ఇతర పోటీలు, కథల పోటీలు, కవితల పోటీలు, సాహితీ సమాచారం at 10:02 ఉద. by వసుంధర

రచయితలందఱికీ నమస్కారాలు, ధన్యవాదాలు. మా పోటీలో బహుమతుల వివరాలు పొందుపఱచిన pdf లో చూడండి.

బహుమతి గ్రహీతలందఱికీ అభినందనలు. బహుమతి రూపాయలలో కావాలా డాలర్లలో కావాలా, మీ బాంకూ, ఖాతా వివరాలేమిటి, చెక్కు పంపడానికి చిరునామా ఏమిటి పంపండి.
 కోవిడ్ పరిస్ఠితుల దృష్ట్యా దీపావళి సంచిక అచ్చు ప్రతిగా కాకుండా online digital మాధ్యమంగానే ప్రచురిస్తున్నాము. ఆ సంచిక link కళా సమితి website (www.tfasnj.org) మీద ఒకటి రెండు రోజులల్లో వస్తుంది.

బహుమతి రాని కథలూ కవితలూ కొన్నిటిని 2021 సంచికలలో ప్రచురిస్తాము. ఆ జాబితా కొన్ని వారాలలో తయారవుతుంది. అటువంటి ప్రచురణకు మీకెట్టి అభ్యంతరమూ ఉండదని మా ఆశాభావం. కాదన్నట్లైతే వెంటనే చెప్పండి. 
సంపాదక వర్గం

డిసెంబర్ 6, 2020

పివి శతజయంతి వ్యాసరచన పోటీ ఫలితాలు

Posted in ఇతర పోటీలు, రచనాజాలం, సాహితీ సమాచారం at 4:15 సా. by వసుంధర

తరువాతి పేజీ